HCL Recruitment 2024 Telugu
HCL : ఇంటర్ అర్హతతో సాఫ్ట్‌వేర్ జాబ్స్.. రూ. 2.2 లక్షల వరకు జీతం..
Trending Post
ఆధార్ కార్డుకు మొబైల్ నెంబర్ లింక్ స్టేటస్ తెలుసుకునే విధానము
HCL TechBee Recruitment 2024 :
ప్రముఖ దేశీయ సాఫ్ట్‌వేర్ దిగ్గజం హెచ్‌సీఎల్ (HCL) ఇంటర్మీడియట్ పాసైన విద్యార్థులకు సువర్ణావకాశం కల్పిస్తోంది. ఇంటర్న్‌షిప్‌తో పాటు గ్రాడ్యుయేషన్ అందిస్తూ HCL సంస్థలో ఉద్యోగం కల్పిస్తోంది. హెచ్‌సీఎల్ టెక్‌బీ (HCL TechBee) పేరుతో ఓ ప్రోగ్రామ్‌ను నిర్వహిస్తుంది. ఇంటర్ పూర్తయిన విద్యార్థులు ఐటీ సేవలకు తోడ్పడే డిజిటల్ సపోర్ట్ ఉద్యోగాల కోసం దరఖాస్తు చేసుకోవాలని.. ఏడాది శిక్షణ తర్వాత వారు హెచ్‌సీఎల్‌లో పూర్తిస్థాయి ఉద్యోగులుగా నియమితులవుతారని ఓ ప్రకటనలో తెలిపింది. ఇక.. ఆసక్తిగల విద్యార్థులు అప్లయ్ చేసుకోవడానికి డైరెక్ట్ లింక్ ఇదే.. Click Here క్లిక్ చేయండి.
HCL TechBee అర్హతలు :
- ఇంటర్మీడియట్ సీఈసీ, హెచ్‌ఈసీ, బైపీసీ, ఒకేషనల్ కోర్సుల్లో 75 శాతానికి పైగా మార్కులు తప్పనిసరి.
- దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులకు హెచ్‌సీఎల్ కెరియర్ ఆప్టిట్యూడ్ టెస్ట్‌ను నిర్వహిస్తారు.
- ఇందులో ప్రతిభ చూపిన వారికి ఇంటర్వ్యూ నిర్వహిస్తారు.
- ఎంపికైతే కమ్యూనికేషన్ టెస్ట్ ఉంటుంది. ఈ మూడు ప్రక్రియల్లో ఎంపికైన అభ్యర్థులకు నియామక పత్రాన్ని అందజేస్తారు.
ఈ ప్రోగ్రామ్‌కు ఎంపికైన అభ్యర్థులకు మధురై, చెన్నై హెచ్‌సీఎల్ కేంద్రాల్లో శిక్షణ ఇస్తారు. మొదటి మూడు నెలలు తరగతి గది శిక్షణ ఉంటుంది. తర్వాత 9 నెలలు ఇంటర్న్‌షిప్ ఉంటుంది. స్టైపెండ్ కింద నెలకు రూ.10 వేలు ఇస్తారు. 12 నెలల పాటు సాగే ప్రోగ్రామ్ ముగిసన తర్వాత హెచ్‌సీఎల్‌లో ఉద్యోగ అవకాశం కల్పిస్తారు. ఉద్యోగానికి ఎంపికైన తర్వాత ఏటా రూ. 1.7 లక్షలు నుంచి రూ. 2.2 లక్షల వరకు జీతంగా చెల్లిస్తారు.
ఉన్నత విద్యకు అవకాశం:
ఈ ప్రోగ్రామ్‌కు ఎంపికైన విద్యార్థులకు బిట్స్‌పిలానీ, ఆమిటీ, ట్రిపుల్‌ఐటీ కొట్టాయమ్, సస్త్రా యూనివర్సిటీ, కేఎల్ యూనివర్సిటీల నుంచి గ్రాడ్యుయేషన్ చేసే అవకాశం ఉంటుంది. ఇంటర్మీడియట్ ఉత్తీర్ణులైన విద్యార్థులు పూర్తి వివరాలను https://www.hcltechbee.com/ వెబ్‌సైట్ ద్వారా తెలుసుకోవచ్చు.
More Jobs :
DXC Recruitment 2024 Telugu – Click Here
Microsoft Recruitment 2024 Telugu –Click Here
అమెజాన్ వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్స్ – Click Here
Amazon కంపెనీలో 3 నెలలు ట్రైనింగ్ ఇచ్చి జాబ్ ఇస్తారు – Click Here
Google కంపెనీలో 12 వారాలు ట్రైనింగ్ ఇచ్చి జాబ్ ఇస్తున్నారు – Click Here
Sprinto కంపెనీలో పర్మనెంట్ జాబ్స్ – Click Here
ఫ్రెషర్స్ కి intel కంపెనీలో భారీగా ఉద్యోగాలు – Click Here
Tags : HCL Recruitment 2024 Telugu, HCL Recruitment 2024 Telugu, hcl recruitment 2024 process, hcl eligibility criteria for freshers 2024, hcl recruitment for freshers 2024,
Leave a comment