Display Of Welfare Schemes Boards Program-సంక్షేమ పథకాల బోర్డు

grama volunteer

సంక్షేమ పథకాల బోర్డు
Telegram Channel Join Now
WhatsApp Channel Join Now

Display Of Welfare Schemes Boards Program

సంక్షేమ పథకాల బోర్డు ప్రదర్శన ప్రోగ్రాం పూర్తి సమాచారం –

Display Of Welfare Schemes Boards Program

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నేటికీ 2.4 లక్షల కోట్ల నగదును DBT విధానం లో నేరుగా లబ్ధిదారుల బ్యాంకు ఖాతాలోకి మరియు 1.67 లక్షల కోట్లను Non DBT విధానంలో రాష్ట్రంలో ఉన్న 91.10 శాతం కుటుంబాలకు అందించడం జరిగినది.రాష్ట్రవ్యాప్తంగా వికేంద్రీకృత పరిపాలన అందించడం కోసం గానూ 15,004 గ్రామ వార్డు సచివాలయాలను ఏర్పాటు చేయడం జరిగినది. రాష్ట్ర స్థాయిలో మరియు దేశం స్థాయిలో ఎక్కడా కూడా ఇంతటి డీబీటీ విధానం లో సంక్షేమ కార్యక్రమాలు జరగలేదు. ఈ విషయాలన్నీ కూడా ప్రజలకు తెలియజేస్తూ ఇతర ప్రయోజనాలను పొందేలా వారిని ప్రేరంపించడం కోసం అర్హులైన వారందరికీ కూడా అన్ని సంక్షేమ పథకాలు అందేలా చూడడం కోసం గాను రాష్ట్రవ్యాప్తంగా “సంక్షేమ పథకాల బోర్డుల ప్రదర్శన” ( Display Of Welfare Schemes Boards) అనే కార్యక్రమమును ప్రభుత్వం చేపట్టనుంది.

ఆధార్ కార్డు లింక్ స్టేటస్

Trending Post

ఆధార్ కార్డుకు మొబైల్ నెంబర్ లింక్ స్టేటస్ తెలుసుకునే విధానము

సంక్షేమ పథకాల గురించి పౌరులకు అవగాహన కల్పించడం మరియు DBT మరియు Non DBT ద్వారా ప్రజలకు కలిగే ప్రయోజనాలను తెలియజేయడం కోసం కింద తెలిపిన రెండు కార్యక్రమాలు నవంబర్ 9, 2023 నుండి ప్రారంభం అవ్వనున్నాయి.

1. సంక్షేమ పథకాల బోర్డుల ఆవిష్కరణ

2. ఆంధ్రప్రదేశ్ కి జగన్ ఎందుకు కావాలంటే… బుక్ లెట్ పంపిణి

Download Welfare Schemes Boards Program GO

 DOWNLOAD

సంక్షేమ పథకాల బోర్డులో ఏముంటుంది ?

సంక్షేమ పథకాల బోర్డులో DBT విధానంలో నేరుగా లబ్ధిదారుల బ్యాంకు ఖాతాలో జమ అయిన నగదు సంక్షేమ పథకాల వారీగా, Non DBT విధానంలో వివిధ పథకాల ద్వారా అందిన పథకాల వారీగా మరియు జగనన్నకి చెబుదాం (1902) వివరాలు ఉంటాయి.

సంక్షేమ పథకాల వారీగా ఎంతమంది లబ్ధిదారులు ఎంత నగదు అందినదో సచివాలయ వారీగా ఉంటుంది.

రాష్ట్రవ్యాప్తంగా DBT మరియు Non DBT విధానంలో అందిన మొత్తం నగదు ఉంటుంది.

• వెండర్ల ద్వారా సంక్షేమ పథకాల బోర్డులు సచివాలయాలకు డెలివరీ జరిగి ఇన్స్టాల్ కూడా చేయటం జరుగుతుంది.

ఆంధ్రప్రదేశ్ కి జగనే ఎందుకు కావాలంటే… బుక్లెట్లో ఏముంటుంది ?

1. ఒక ఇంటికి ఒక బుక్లెట్ ఇవ్వటం జరుగుతుంది.

2. ఈ బుక్లెట్లను గ్రామ వార్డు వాలంటీర్ల ద్వారా డోర్ టు డోర్ పంపిణీ చేయడం జరుగుతుంది.

3. ఈ పంపిణీ కార్యక్రమం వారం రోజులపాటు జరుగుతుంది.

4. బుక్లెట్లో రాష్ట్రాలు విభజన సమయంలో పరిస్థితులు ఎలా ఉన్నాయి, గౌరవ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రివర్యులు తీసుకొన్న చర్యలు ఏమిటి, ఆంధ్రప్రదేశ్ పై సంక్షేమ పథకాలు మరియు వివిధ అభివృద్ధి కార్యక్రమాల ప్రభావం ఎలా ఉంది అనే విషయాలు ఉంటాయి.

5. బుక్లెట్లో అన్ని కూడా అన్ని జిల్లాలకు ప్రింట్ చేయబడి పంపించడం జరిగినది వీటికి నోడల్ ఆఫీసర్గా CPO వారు ఉంటారు.

Download Booklet

సంక్షేమ పథకాలపై అవగాహన కార్యక్రమానికి సంబంధించి షెడ్యూలు, ప్లానింగ్ ఎలా ఉండాలి ?

• షెడ్యూలు ప్రకారం రాష్ట్రవ్యాప్తంగా ఉన్న అన్ని గ్రామ వార్డు సచివాలయాలలో నవంబర్ 9, 2023 నుండి మొదలై 5 వారాలపాటు కార్యక్రమం ఉంటుంది.

• ప్రోగ్రాం యొక్క షెడ్యూల్ను గ్రామ వార్డు డిపార్ట్మెంట్ వారు నిర్ణయించి అన్ని జిల్లాలకు సమాచారం ఇవ్వడం జరుగుతుంది.

• షెడ్యూలు తేదీ నాడు కార్యక్రమం అనేది మధ్యాహ్న 3 గంటల నుండి సాయంత్రం 4 గంటల వరకు జరుగుతుంది.

ఒకే మండలంలో ఒకేరోజు రెండు సచివాలయాలలో ఈ కార్యక్రమం అనేది జరగకూడదు కేవలం ఒక సచివాలయంలో మాత్రమే జరగవలెను. ఒకరోజు ఒక సచివాలయం ఒక మండలానికి అనే విధానం తప్పనిసరిగా పాటించాలి.

• గ్రామాలలో EO-PR&RD వారు మునిసిపాలిటీలలో మున్సిపల్ కమిషనర్ వారు నిర్ణయించిన అడిషనల్ కమిషనర్ లేదా ఇతర ఆఫీసర్ వారు ఈ కార్యక్రమానికి నోడల్ ఆఫీసర్గా ఉంటారు.

• ప్రోగ్రాం నాడు తప్పనిసరిగా అందరూ సచివాలయ సిబ్బంది మరియు వాలంటీర్లు ప్రోగ్రాంలో భాగం అవ్వాలి.

• ప్రోగ్రాం షెడ్యూల్ తేదీ కోసం మరియు ఎక్కడ జరుగుతుందో అనే విషయాన్ని వాలంటీర్లు మరియు సచివాలయ సిబ్బంది ఇంటింటికి వెళ్లి తెలియజేయాలి.

Display Of Welfare Schemes Boards Note:

•  వెండర్ల ద్వారా ఆదివారం లేదా ఇతర ప్రభుత్వ సెలవుల రోజు కూడా సంక్షేమ పథకాల బోర్డులు డెలివరీ చేయడం జరుగుతుంది. దానికి అనుగుణంగా సిబ్బంది బోర్డులను రిసీవ్ చేసుకోవాలి.

•  సచివాలయాలకు లేదా జిల్లాలకు డిస్ప్లే బోర్డుల డెలివరీ చివరి తేదీ నవంబర్ 15 2023.

• సంక్షేమ పథకాల బోర్డులు సచివాలయాలకు వచ్చిన తరువాత పంచాయతీ కార్యదర్శి లేదా వార్డ్ అడ్మిన్ సెక్రటరీ వారు BOP మొబైల్ అప్లికేషన్లు అందినట్టుగా అప్డేట్ చేయవలసి ఉంటుంది.

BOP మొబైల్ అప్లివేషన్ లో ఎలా అప్డేట్ చేయాలి ?

Step 1: ముందుగా కింద ఇవ్వబడిన లింకు ద్వారా BOP కొత్త వర్షన్ మొబైల్ అప్లికేషన్ డౌన్లోడ్ చేసుకోవాలి.

 DOWNLOAD

Step 2: ఓపెన్ చేసిన తర్వాత పంచాయతీ కార్యదర్శి / పంచాయతీ కార్యదర్శి డిజిటల్ అసిస్టెంట్ లేదా వార్డ్ అడ్మిన్ సెక్రటరీ లేదా వార్డ్ ఎడ్యుకేషన్ డేటా ప్రాసెసింగ్ సెక్రటరీ వారి ఆధార్ నెంబర్ ఎంటర్ చేసి బయోమెట్రిక్ / ఐరిష్ / ఫేస్ ద్వారా లాగిన్ అవ్వాలి.

Step 3 : హోమ్ పేజీ లో “Samkshema Pathakala Display Board acknowledgement” అనే ఆప్షన్ పై టిక్ చేయాలి.

సంక్షేమ పథకాల బోర్డు
సంక్షేమ పథకాల బోర్డు

Step 4 : సచివాలయం కోడ్ సెలెక్ట్ చేసుకున్న తరువాత పథకాల బోర్డు మీ సచివాలయం కు చేరుకున్నట్టయితే వివరాలు ఓపెన్ అవుతాయి లేకపోతే వివరాలు ఓపెన్ అవ్వవు.

Step 5 : చేరుకున్నట్టయితే సంక్షేమ పథకాల బోర్డు ఫోటో తీసి అప్లోడ్ చేసి ఎవరైతే లాగిన్ అయ్యారో వారి eKYC ద్వారా ధ్రువీకరించవలసి ఉంటుంది.

Welfare Schemes Display Board Model Photo:

Display Of Welfare Schemes Boards Program
Display Of Welfare Schemes Boards Program

సంక్షేమ పథకాల బోర్డుకు సంబంధించి ముఖ్యమైన సూచనలు :

• ప్రతి సెక్రటేరియట్లో ఒక డిస్ప్లే బోర్డును ఏర్పాటు చేయాలని GSWS డిపార్ట్మెంట్ ఆదేశించింది, ఇది రాష్ట్ర స్థాయిలో ఖరారు చేసిన షెడ్యూల్ ప్రకారం భవిష్యత్తులో ప్రజా ప్రతినిధులచే ఆవిష్కరించబడుతుంది.

• ఈ డిస్ప్లే బోర్డులో గత నాలుగు సంవత్సరాలుగా ఆ సెక్రటేరియట్ లో అమలు చేయబడిన DBT మరియు నాన్- DBT స్కీమ్ల యొక్క సంగ్రహ వివరాలు ఉంటాయి.

• ఈ ప్రదర్శన బోర్డు రూపొందించి రాష్ట్ర స్థాయిలో ముద్రించబడి సెక్రటేరియట్లకు ఒక ఏజెన్సీ ద్వారా పంపబడుతుంది.

• ఒక సచివాలయానికి ఒక డిస్ప్లే బోర్డు రాష్ట్ర కార్యాలయం నుండి పంపబడుతుంది.

• ఈ డిస్ప్లే బోర్డ్ అందుకున్న తర్వాత డిజిటల్ అసిస్టెంట్ తన లాగిన్లో డిస్ప్లే మంచి స్థితిలో వచ్చినా లేదా అను విషయమును అందిన తరువాత రసీదు డేటాను ఆన్లైన్ నందు సమర్పించాలి?

• కాబట్టి దయచేసి జిల్లాలోని అన్ని పంచాయతీ కార్యదర్శులు మరియు డిజిటల్ సహాయకులకు ఈ సమాచారాన్ని తెలియజేయండి.

• డిస్ప్లే బోర్డ్ను స్వీకరించిన తర్వాత తదుపరి ఉత్తర్వులు వచ్చే వరకు దానిని అత్యంత జాగ్రత్తగా సెక్రటేరియట్లో ఉంచాలి.

• అన్ని గ్రామ సచివాలయాల వద్ద డిస్ప్లే బోర్డులకు సంబంధించిన సూచనలను అందరు MPDOలు పాటించవలసిందిగా అభ్యర్థించడమైనది.

• ఈ బోర్డులు కవర్తో పంపిణీ చేయబడతాయి మరియు పల్లెకు పోదాము కార్యక్రమంలో మాత్రమే వీటిని ప్రారంభించాలని నిర్ధారించుకోండి.

• ఇన్స్టాలేషన్ తర్వాత డిస్ప్లే బోర్డ్ తగిన మెటీరియల్తో కప్పబడి ఉందని నిర్ధారించుకోండి.

• ఆవిష్కరణ కార్యక్రమం నిర్వహించిన తర్వాత మాత్రమే ప్రదర్శించబడాలి.

• ఈ వివరములు అన్ని సచివాలయములకు సిబ్బందికి తెలియచేసి నిర్ధారించుకోండి.

• ఏర్పాటు చేసే బోర్డు కార్యాలయం వెలుపల ఉండాలి.

• కాబట్టి దయచేసి జిల్లాలోని అన్ని పంచాయతీ కార్యదర్శులు మరియు డిజిటల్ సహాయకులకు ఈ సమాచారాన్ని తెలియజేయండి.

• డిస్ప్లే బోర్డ్ను స్వీకరించిన తర్వాత తదుపరి ఉత్తర్వులు వచ్చే వరకు దానిని అత్యంత జాగ్రత్తగా సెక్రటేరియట్లో ఉంచాలి.

సంక్షేమ పథకాల బోర్డుల ప్రదర్శన సంబంధించి టైం లైన్ ఏమిటి ?

D -9 : క్యాంపు తేదీ కు 9 రోజుల ముందు పట్టణ ప్రాంతాల్లోని మున్సిపల్ కమిషనర్లు తమ పరిధిలో ప్రతి సచివాలయానికి నోడల్ అధికారిని నామినేట్ చేయాలి.

D-7: క్యాంపు తేదీ కు 7 రోజుల ముందునోడల్ ఆఫీసర్ వారు అతిథుల జాబితాను ఖరారు చేసి వారికి తెలియజేయవలసి ఉంటుంది.

D -5 : క్యాంపు తేదీ కు 5 రోజుల ముందుమండల స్థాయి అధికారులు మరియు FOA వారు వాలంటీర్లకు శిక్షణ టైం లైను , ఔట్రిచ్ మరియు పోస్ట్ ప్రోగ్రాం గురించి నిర్ణయం తీసుకోవాలి.

D – 3 : క్యాంపు తేదీ కు 3 రోజుల ముందుగ్రామ వార్డు వాలంటీర్లు ప్రోగ్రాం గురించి ప్రజలకు తెలియజేస్తూ షెడ్యూల్ తేదీన ప్రోగ్రాం వెన్యూకు హాజరు కావలసిందిగా అందరిని ఆహ్వానించాలి.

D-3: క్యాంపు తేదీ కు 3 రోజుల ముందుపంచాయతీ కార్యదర్శి లేదా వార్డ్ అడ్మిన్ సెక్రటరీ వారు బోర్డులోని నెంబర్ను అప్డేట్ చేయడంతో పాటు స్వీకరించడం ఇన్స్టాలేషన్ చేయడం వంటి కార్యక్రమాలు పూర్తి చేయాలి.

D-2 : క్యాంపు తేదీ కు 2 రోజుల ముందుగ్రామ వార్డు వాలంటరీ వారు ప్రోగ్రాం తేదీ మరియు వేదిక గురించి పౌరులకు సందేశం SMS లేదా వాట్సాప్ లో మరియు నేరుగా తెలియజేయవలసి ఉంటుంది.

D-1 : క్యాంపు తేదీ కు 1 రోజు ముందుపంచాయతీ కార్యదర్శి లేదా వార్డు అడ్మిన్ సెక్రటరీ వారు కార్యక్రమం నిర్వహణకు సమావేశం ఏర్పాటు తదితర పనులు చూసుకోవాలి.

D : కార్యక్రమం రోజుననోడల్ ఆఫీసర్ వారు కార్యక్రమాన్ని నిర్వహించడానికి అవసరమైన కుర్చీలు వేదిక పోడియం మైకు స్పీకర్ ఇతర ఉపకరణాలు సంవత్సరం వంటి పనులు చూసుకోవాలి.

D : కార్యక్రమం రోజున అతిథులు డిస్ప్లే బోర్డును ఆవిష్కరించడం మరియు సచివాల సిబ్బంది సంక్షేమ పథకాలు మరియు సేవలను పొందడంపై అవగాహన కల్పించాలి.

D : కార్యక్రమం అయిన తర్వాతనోడల్ ఆఫీసర్ వారు నిర్వహించిన కార్యక్రమం వివరాలు మరియు ఫోటోలు హోటల్లో అప్లోడ్ చేసే విధంగా చూడాలి.

D +1 to D + 10 : కార్యక్రమం జరిగిన రోజు నుంచి పది రోజుల వరకు గ్రామ వార్డు వాలంటీర్లు వారి క్లస్టర్ పరిధిలో 100% ఇళ్లను కవర్ చేస్తూ ప్రభుత్వం అందిస్తున్న పథకాలు ప్రయోజనాలపై ప్రజలకు అవగాహన కల్పించాలి.

D +1 to D + 10 : కార్యక్రమం జరిగిన రోజు నుంచి పది రోజుల వరకు – గ్రామ వార్డు వాలంటీర్లు వారి క్లస్టర్ పరిధిలో ప్రతి ఇంటికి వెళ్లి అవగాహన కల్పించడం పూర్తి అయినట్టు eKYC తీసుకోవలసి ఉంటుంది.

Note : సచివాలయ ఉద్యోగుల VSWS పోర్టల్ లో రిపోర్ట్ సెక్షన్ లో “Unveiling Of Welfare Schemes Display Boards – Schedule” అనే ఆప్షన్ పై క్లిక్ చేసి జిల్లా, మండలం ఎంచుకొని సబ్మిట్ చేస్తే సంక్షేమ పథకాల ప్రదర్శన బోర్డుల షెడ్యూలు ప్రోగ్రాం చూపిస్తుంది.

గ్రామా వార్డు వాలంటీర్ల విధులు ఏమిటి ?

షెడ్యూల్ తేదీకి ముందు :

• పౌరులకు ప్రోగ్రాం గురించి అవగాహన కల్పించడం ప్రోగ్రాం రోజున అందుబాటులో ఉన్న సౌకర్యాల గురించి పౌరులకు తెలియజేయడం ప్రోగ్రాం రోజున నిర్వహించే కార్యక్రమాలకు అవసరమైన పత్రాలు జాబితాను తెలియజేయడం .

• కార్యక్రమం జరిగే రెండు రోజుల ముందు ప్రోగ్రాం తేదీ మరియు వేదిక గురించి పౌరులకు సందేశాలు అనగా నేరుగా తెలియజేయడం, SMS ద్వారా మరియు WhatsApp ద్వారా సందేశాలు వారి క్లస్టర్ పరిధిలో వారికి పంపించడం చేయాలి.

ప్రోగ్రాం రోజున :

• ప్రోగ్రాం రోజున వారి క్లస్టర్ పరిధిలో ప్రజలతో వేదికకు వెళ్లాలి. ప్రోగ్రాం సమయంలో జరిగే ప్రక్రియలలో వారికి సహాయం చేయాలి.

సచివాలయ సిబ్బంది విధులు ఏమిటి?

షెడ్యూల్ తేదీకి ముందు :

• బోర్డు ఏర్పాటు చేయటంలో సహాయం చేయటం, వేదిక ఏర్పాట్లు సంబంధించి సహాయం చేయాలి.

ప్రోగ్రాం రోజున :

• ప్రోగ్రాం రోజున సిటిజెన్లతో ఇంటరాక్షన్ పాల్గొనాలి.

• వేదిక వద్ద ఉన్న అన్ని అవసర సౌకర్యాలు నిర్వహించబడుతున్నాయా అని నిర్ధారించుకోవాలి. ప్రోగ్రామ్ లొకేషన్ షెడ్యూల్ ప్రకారం సమయానికి చేరుకోవాలి.

 

 రైతు భరోసా PAYMENT STATUS చెక్ చేసుకునే విధానం

Pmjay New operator Registration Grama volunteer

Pmjay GSWS Volunteer Wise Dashboard

 

Rate this post

ప్రభుత్వ పథకాలు, ప్రభుత్వ ఉద్యోగాలు, ప్రైవేట్ కంపెనీ ఉద్యోగాల గురించి రోజువారీ సమాచారాన్ని పొందడానికి మా వాట్సాప్ ఛానెల్‌లో మరియు టెలిగ్రామ్ ఛానెల్‌లో చేరండి

Telegram Channel Join Now
WhatsApp Channel Join Now

Related Posts

Thalliki Vandanam Grievance 2025: తల్లికి వందనం డబ్బులు రాలేదు? కారణాలు, గ్రీవెన్స్ ఎలా పెట్టాలి? పూర్తి సమాచారం

Thalliki Vandanam Payment Status Check 2025

Thalliki Vandanam Payment Status Check: తల్లికి వందనం పథకం అర్హత & పేమెంట్ స్టేటస్  – 9552300009 ద్వారా Step by Step Guide

Thalliki Vandanam Payment June 2025

Thalliki Vandanam Payment 2025: తల్లికి వందనం పథకం నిధులు జమ | మీ ఖాతాలోకి వచ్చాయా? వెంటనే ఇలా చెక్ చేయండి

One response to “Display Of Welfare Schemes Boards Program-సంక్షేమ పథకాల బోర్డు”

Leave a comment

 

WhatsApp