మొబైల్ నెంబర్ తో ఓటర్ కార్డు వివరాలు చెక్ చేయు విధానం
Search Voter Card Details With Mobile
Number in Telugu
గమనిక:- స్టెప్స్ అన్ని పూర్తిగా ఫాలో అవ్వండి లేకపోతే మీకు కావాల్సిన ఇన్ఫర్మేషన్ రాదు.
దేశవ్యాప్తంగా పలు రాష్ట్రాలలో త్వరలో ఎన్నికలు ఉన్న సందర్భంగా కేంద్ర ప్రభుత్వం ఒక ముఖ్యమైన నిర్ణయం తీసుకుంది. ఓటు కార్డుకు సంబంధించి కార్డు చలామణిలో ఉందొ, లేదో, కార్డుదారుడి నియోజకవర్గము, గ్రామము,ఓటు వేయవలసిన పోలింగ్ స్టేషన్ నెంబరు, పోలింగ్ స్టేషన్ పేరు, బూత్ లెవెల్ ఆఫీసర్ వారి పేరు మరియు మొబైల్ నెంబరు తెలుసుకునేందుకు కొత్తగా మొబైల్ నెంబర్ ద్వారా తెలుసుకుని ఆప్షన్ ను ఉచితంగా ఆనులైన్లో ఇవ్వటం జరిగినది. ముందుగా ఓటు కార్డు నెంబరు మరియు పేరు ద్వారా సెట్ చేసుకునే ఆప్షన్ ఉండేది .
Trending Post
ఆధార్ కార్డుకు మొబైల్ నెంబర్ లింక్ స్టేటస్ తెలుసుకునే విధానము
ఓటు కార్డు ద్వారా తెలుసుకునేందుకు తప్పనిసరిగా ఓటు కార్డు నెంబరు తెలిసి ఉండాలి మరియు పేరు ద్వారా తెలుసుకునేందుకు ఓటరు కార్డులో పేరు ఎలా ఉందో అలానే ఎంటర్ చేయవలసి ఉంటుంది, కొన్ని సందర్భాలలో పై రెండు ఆప్షన్లో ద్వారా తెలుసుకోవడం కష్టమవుతుంది అందుకుగాను కొత్తగా కేంద్ర ప్రభుత్వం అన్ని రాష్ట్ర ప్రజలు ఉపయోగకరంగా ఉండేందుకు కొత్తగా మొబైల్ నెంబర్ ద్వారా సెట్ చేసుకునే ఆప్షన్ ఇవ్వడం జరిగినది.
మొబైల్ నెంబర్ ద్వారా ఓట కార్డు వివరాలను తెలుసుకునేందుకు తప్పనిసరిగా ఓటరు కార్డుకు మొబైల్ నెంబర్కు లింక్ అయి ఉండాలి. ఆ విధంగా లింక్ అయి ఉన్న వాటర్ కార్డు వివరాలు మాత్రమే ఈ ప్రాసెస్ ద్వారా తెలుసుకునే అవకాశం ఉంటుంది. ఒకవేళ ఓటర్ కార్డుకు మొబైల్ నెంబరు
లింకు లేకపోయినట్లయితే ఆన్లైన్ లోనే ఎవరికి వారు లింకు
చేసుకుని ఆప్షన్ ఉంటుంది లేదా మీ సంబంధిత బూత్ లెవెల్
ఆఫీసర్ (BLO) వారిని కాంటాక్ట్ అయినట్లయితే వారు
మీయొక్క ఓటర్ కార్డు నెంబర్ కు మొబైల్ నెంబర్కు లింక్
చేయడం జరుగుతుంది.
మొబైల్ నెంబర్ ద్వారా ఓటర్ కార్డు వివరాలు తెలుసుకునే విధానము :
Step 1 : ముందుగా కింద ఇవ్వబడిన లింక్ ఓపెన్ చేయాలి.
Step 2: Search in Electoral అనే ఆప్షన్ టిక్ చేయాలి
Step 3 : తరువాతి పేజీ లో Search By Mobile అనే ఆప్షన్ ఎంచుకొని రాష్ట్రము, భాష ను ఎంచుకోవాలి.
Step 4: Mobile Number బాక్స్ లో 10 అంకెల మొబైల్ నెంబర్ ఎంటర్ చేసి SEND OTP పై క్లిక్ చేయాలి.
Step 5: మొబైల్ నెంబర్ కు 6 అంకెల OTP వస్తుంది. ఆ నెంబర్ ఎంటర్ చేయాలి.
Step 6: Search $53. Search Result వివరాలు చూపిస్తుంది. అందులో Action పై క్లిక్ చేయాలి.
Step 7 : ఓటర్ వివరాలు చూపిస్తుంది. అందులో
- చలామణిలో ఉందొ, లేదో,
- ఓటు కార్డుదారుడి నియోజకవర్గము,
- గ్రామము,
- ఓటు వేయవలసిన పోలింగ్ స్టేషన్ నెంబరు,
- పోలింగ్ స్టేషన్ పేరు,
- బూత్ లెవెల్ ఆఫీసర్ వారి పేరు మరియు మొబైల్ నెంబరు ఉంటాయి.
- ప్రింట్ తీసుకోవచ్చు.
మొబైల్ నెంబర్ తో ఓటర్ కార్డు వివరాలు చెక్ చేయు విధానం
Search Voter Card Details With Mobile
More Usefull Links
PM Vishwakarma Scheme Details in Telugu
Leave a comment