pm vishwakarma online process telugu
పీఎం విశ్వకర్మ యోజన పథకానికి ఆన్లైన్ చేయు విధానము
PM విశ్వకర్మ పథకం అన్ని వివరాలు
పీఎం విశ్వకర్మ యోజన పథకానికి రాష్ట్రములో ఉన్న అన్ని జిల్లాల వాసులకు రిజిస్ట్రేషన్ ఓపెన్ అవ్వటం జరిగింది . CSC లాగిన్రి లో జిస్ట్రేషన్ చేయు విధానం ఇప్పుడు చూద్దాం
Trending Post
ఆధార్ కార్డుకు మొబైల్ నెంబర్ లింక్ స్టేటస్ తెలుసుకునే విధానము
Step 1 : ముందుగా కింద ఇవ్వబడిన లింక్ పై క్లిక్ చేయండి లాగిన్ పేజీకి వెళ్తుంది. ప్రస్తుతం లబ్దిదారుడు లేదా సిటిజెన్ లాగిన్ పని చేయడం లేదు కేవలం CSC లాగిన్ ద్వారా మాత్రమే దరఖాస్తు చేయవలసి ఉంటుంది
Step 2: Login అనే ఆప్షన్ పై క్లిక్ చేసి అందులో CSC Login పై క్లిక్ చేయాలి. అందులో CSC – Register Artisans అనే ఆప్షన్ పై క్లిక్ చేయాలి.
Step 3 : వెంటనే CSC Login Page కి వెళ్తుంది. అందులో User Name, Password & Captcha Code ఎంటర్ చేసి SIGN IN పై క్లిక్ చేయండి.
Step 4: Register Now పేజీ ఓపెన్ అవుతుంది. అందులో “Is There Any Government Employee Within Your Family?” అనగా కుటుంబంలో ఎవరైనా ప్రభుత్వ ఉద్యోగులు ఉన్నారా ? అనే ప్రశ్న అడుగుతుంది దానికి అవునా / కాదా అని సెలెక్ట్ చేయాలి. ఇక్కడ కుటుంబం అనగా భర్త – భార్య మరియు 18 సంవత్సరాలు పూర్తి అయిన వివాహం కానీ పిల్లలు వస్తారు. తరువాత CONTINUE పై క్లిక్ చేయాలి.
Step 5: తరువాత “Have you availed credit/ loanfacility under similar schemes of central government or state government for self- employment/ business development e.g. PMEGP or have outstanding loan under PM SVANidhi or Mudra?” అనే ప్రశ్న అడుగుతుంది దీని అర్థము గతంలో PM SVANidhi లేదా ముద్ర లేదా PMEGP వాటిలో లేదా ఇతర లోన్ తీసుకున్నారా అని అడుగుతుంది. తీసుకున్నట్టయితే YES అని తీసుకోకపోతే NO అని సెలెక్ట్ చేయాలి. రెండు NO అని సెలెక్ట్ చేస్తే అర్హులు అవుతారు. తరువాత CONTINUE పై క్లిక్ చేయాలి.
Step 6: తరువాత Aadhaar Verification పేజీ ఓపెన్ అవుతుంది. అందులో ఆధార్ కార్డుకు లింక్ అయినటువంటి మొబైల్ నెంబర్ను మరియు 12 అంకెల ఆధార్ నెంబర్ను ఎంటర్ చేసి Captcha Code ఎంటర్ చేసి Terms పై టిక్ చేసి Continue పై క్లిక్ చేయాలి.
Step 7 : One Time Password పేజీ ఓపెన్ అవుతుంది దానిలో ఆధార్కు లింక్ అయినటువంటి మొబైల్ నెంబర్ కు 6 అంకెల ఓటిపి వస్తుంది ఆ ఓటీపీను ఎంటర్ చేసి Continue పై క్లిక్ చేయాలి.
Step 8 : Aadhaar Verification పేజీ ఓపెన్ అవుతుంది.
ఆధార్ నెంబరు చూపిస్తుంది సరిగా ఉన్నట్టయితే Verify Biometric అనే ఆప్షన్ పై క్లిక్ చేయాలి. Mantra లేదా ఇతర బయోమెట్రిక్ స్కానర్ ద్వారా సిటిజన్ యొక్క బయోమెట్రిక్ పూర్తి చేయాలి.
pm vishwakarma online process telugu
పీఎం విశ్వకర్మ యోజన పథకానికి ఆన్లైన్ చేయు విధానము
Step 9 : తరువాత పేజీలో వ్యక్తిగత వివరాలు ఆధార్
ప్రకారం తీసుకోవడం జరుగుతుంది. వివాహ స్థితి, కుల
వివరాలు, దివ్యాంగుల కాదా, దివ్యాంగులు అయితే దివ్యంగ
రకము ఎంచుకోవాలి. Are you doing business in same
state? అనే ప్రశ్నకు మీ యొక్క వ్యాపారం మీ యొక్క
చిరునామా రెండు ఒకటే రాష్ట్రంలో అయితే YES అని లేకపోతే
NO అని సెలెక్ట్ చేయాలి. Are you doing business in
same District ? అనే ప్రశ్నకు మీ యొక్క వ్యాపారం మీ యొక్క
చిరునామా రెండు ఒకటే జిల్లాలో అయితే YES అని లేకపోతే
NO అని సెలెక్ట్ చేయాలి. దరఖాస్తుదారుడు మైనారిటీ అయితే
YES అని కాకపోతే NO అని సెలెక్ట్ చేయాలి మైనారిటీ అయితే
Select Minority లో మైనార్టీ రకమును ఎంచుకోవాలి.
Step 10 : తర్వాత పేజీలో Contact details పేజీ ఓపెన్
అవుతుంది అందులో మొబైల్ నెంబరు, ఆధార్ నెంబరు ఎంటర్ చేసి పాన్ కార్డు నెంబరు ఉన్నట్టయితే ఎంటర్ చేయండి లేకపోతే అవసరం లేదు.
Step 11 : తర్వాత పేజీలో Family details వివరాలు
అడుగుతుంది అందులో రేషన్ కార్డు నెంబరు ఉన్నట్టయితే
ఎంటర్ చేయండి లేకపోతే అవసరం లేదు. రేషన్ కార్డు ద్వారా
వివరాలు రాకపోయినట్టయితే Add Row అనే ఆప్షన్ ద్వారా
కుటుంబంలో ఉన్న కుటుంబంలో ఉన్న అందరిని Add చేయాలి
పేరు, దరఖాస్తు దారుణతో సంబంధము మరియు వారి ఆధార్
కార్డు నెంబరు Add చేయవలసి ఉంటుంది. అలా కుటుంబంలో
ఉన్న అందరి పేర్లు యాడ్ చేయాలి.
pm vishwakarma online process telugu
పీఎం విశ్వకర్మ యోజన పథకానికి ఆన్లైన్ చేయు విధానము
Step 12 : తర్వాతే పేజీలో Aadhar address వివరాలు అడుగుతుంది ఆధార్ కార్డులో ఉన్న చిరునామా ప్రకారం ఆటోమేటిక్గా వివరాలు వస్తాయి. Current address మీరు ప్రస్తుతం ఉన్న చిరునామా ఆధార్ కార్డులో ఉన్న చిరునామా Same as Aadhaar address ఎంచుకోవాలి లేకపోతే Other ను ఎంచుకోవాలి. తరువాత దరఖాస్తుదారుడు గ్రామపంచాయతీలో ఉన్నట్లయితే Do you come under Gram Panchayat ? అనే ప్రశ్నకు Yes అని లేకపోతే NO అని సెలెక్ట్ చెయాలి. చిరునామా సెక్షన్లో జిల్లా ను పాత జిల్లా పేరు ఎంచుకున్నట్లయితే అప్పుడు మాత్రమే బ్లాక్ వివరాలు చూపిస్తుంది లేకపోతే చూపించడం లేదు. ఆ విధంగా బ్లాక్ ను మరియు గ్రామపంచాయతీను సెలెక్ట్ చేసుకోవాలి.
Step 13 : Profession / Trade Details పేజీ ఓపెన్ అవుతుంది అందులో Profession / Trade Name ఎంచుకోవాలి. 18 రకముల చేతి వృత్తులు ఉంటాయి. అందులో దరఖాస్తుదారుని వృత్తి ప్రకారము ఎంచుకోవాలి. Business Address Same As Aadhaar Address, Same As Current Address, Other అనే మూడు ఆప్షన్లో ఉంటాయి వృత్తి ఎక్కడ చేస్తున్నారో దానికి అనుగుణంగా మూడు ఆప్షన్లు సెలెక్ట్ చేసుకుని పై క్లిక్ Save చేయాలి. Next పై క్లిక్ చేయాలి
Step 14 : Saving Bank Details Name Of The Bank, IFSC Code, Name Of The Branch, Account Number వివరాలు ఇవ్వాలి.
Step 15 : Credit Support Do You Want
Credit Support? అంటే ప్రస్తుతం మీకు ఆర్థిక సహాయం కావాలా అని అడుగుతుంది. కావాలి అనుకుంటే Yes అని అవసరం లేదు అనుకుంటే May be later పై టిక్ చేయాలి. Yes పెట్టినట్టయితే ఎంత నగదు కావాలి ? ఏ బ్యాంకులో నగదు జమ అవ్వాలి? లోను దేనికోసం వాడుతారు? అనే వివరాలు అడుగుతుంది. వివరాలన్నీ ఇవ్వవలసి ఉంటుంది.
Note : మొదటి విడతలో ఒక లక్ష రూపాయలు ఐదు శాతం
వడ్డీకి ఇవ్వడం జరుగుతుంది దానిని 18 నెలలలో కట్టవలెను. రెండో విడతలో రెండు లక్షల రూపాయలు ఐదు శాతం వడ్డీకి 30 నెలలలో పేమెంట్ చేయవలసి ఉంటుంది, ఇది కేవలం మొదటి విడత పూర్తి అయిన తర్వాత మాత్రమే తీసుకోవడానికి అవుతుంది.
Step 16 : Digital Incentive Details పేజీ లో ఫోన్ పే /
గూగుల్ పే ఇలా డిజిటల్ పేమెంట్ చేస్తే వారికీ 100/- కి 1/- కమీషన్ ఇవ్వటం జరుగును. దానికి గాను UPI ID ఎంటర్ చేయాలి. లేకపోతే NO అని పెట్టవచ్చు. తరువాత SAVE & NEXT పై క్లిక్ చేయాలి.
Step 17 : తర్వాతే పేజీలో Skill Training, Toolkit, Marketing Support వివరాలు చూపిస్తుంది వాటిపై టిక్ చేసి Save & Next పై క్లిక్ చేయండి.
Step 18 : Declaration Details పేజీ లో అన్ని వివరాలు
చదువుకొని Terms & Conditions పై టిక్ చేసి Submit పై క్లిక్ చేయాలి. అప్లికేషన్ నెంబర్ నోట్ చేసుకోవాలి. తరువాత డాష్ బోర్డు లోకి తీసుకు వెళ్ళటం జరుగుతుంది అందులో అప్లికేషన్ పిడిఎఫ్ ఉంటుంది అది డౌన్లోడ్ చేసుకోవాలి అదేవిధంగా అప్లికేషన్ ఏ స్థాయిలో ఉందో కూడా చూపిస్తుంది.
pm vishwakarma online process telugu
పీఎం విశ్వకర్మ యోజన పథకానికి ఆన్లైన్ చేయు విధానము
pm vishwakarma online process telugu
పీఎం విశ్వకర్మ యోజన పథకానికి ఆన్లైన్ చేయు విధానము
PM Vishwakarma Scheme Registration Process User Manual:
Leave a comment