You can vote at home

grama volunteer

You can vote at home
Telegram Channel Join Now
WhatsApp Channel Join Now

You can vote at home

వీరు ఇంటి వద్దే ఓటు వేసుకోవచ్చు

పోలింగ్ కేంద్ర వరకూ రాలేని వృద్ధులు, దివ్యాంగులకు ఈ ఎన్నికల్లో ఇంటి వద్ద ఓటు వేసే సౌకర్యం కల్పిస్తూ కేంద్ర ఎన్నికల సంఘం (సీఈసీ) నిర్ణయం తీసుకుంది. దేశంలో 85 ఏళ్ల పైన ఓటర్లు, 40 శాతం, అంతకంటే ఎక్కువ వైకల్యం ఉన్న దివ్యంగా ఓటర్లు ఈ సౌకర్యాన్ని వినియోగించుకోవచ్చు. ఈ మేరకు రాష్ట్రాల వారీగా ఇంటి వద్ద ఓటు వేసేందుకు అర్హత ఉన్న ఓటర్ల సంఖ్యను కేంద్ర ఎన్నికల సంఘం ప్రధాన కమిషన్ రాజీవ్ కుమార్, కమిషనర్లు జ్ఞానేశ్ కుమార్, డాక్టర్ సుకుబీర్ సింగ్ సింధు శుక్రవారం ప్రకటించారు. వీరికి ఇంటి వద్ద ఓటు వేయాలనేది తప్పనిసరి కాదని, ఇది ఐచ్చికం మాత్రమేనని చెప్పారు. ఇటువంటి ఓటర్లు దేశవ్యాప్తంగా 1.70 కోట్లు పైగా ఉన్నట్లు ఈసీ తెలిపింది.

85 ఏళ్లు పైబడిన వారు 81 లక్షలు పైగా
దివ్యాంగులు 90 లక్షల పైగా ఉన్నారు

ఆధార్ కార్డు లింక్ స్టేటస్

Trending Post

ఆధార్ కార్డుకు మొబైల్ నెంబర్ లింక్ స్టేటస్ తెలుసుకునే విధానము

80 ఏళ్లు పైబడి ఓటర్లలో మహిళలు ఎక్కువగా ఉన్నారు వీరిలో 33.84 లక్షల మంది పురుషులు కాగా, 47.27 లక్షల మంది మహిళా ఓటర్లు, 18 మంది థర్డ్ జెండర్ లు ఉన్నారు.

40 శాతం వైకల్యం ఉన్న ఓటర్లలో 53.64 లక్షల మంది పురుషులు, 36.42 లక్షల మంది మహిళలు, 442 మంది థర్డ్ జెండర్ లు ఉన్నారు. ఈ వర్గాల వారు ఇంటి వద్ద ఓటు వేసేందుకు కేంద్ర ఎన్నికల సంఘం అవకాశం కల్పించింది. ఈ వర్గాలకు పోలింగ్ కేంద్రాల వద్ద ఓటు వేసే సమయంలో ఇబ్బందులు కలగకుండా చర్యలు తీసుకోనుంది.

ఈ సదుపాయాన్ని పొందే విధానం సరళంగా, సమగ్రంగా, పారదర్శకంగా కేంద్ర ఎన్నికల సంఘం రూపొందించింది. ఎన్నికల నోటిఫికేషన్ జారీ అయిన ఐదు రోజుల్లోగా అర్హులైన ఓటర్లు ఇంటి వద్ద ఓటు వేసేందుకు 12D ఫారం ను పూర్తి చేసి రిటర్నింగ్ అధికారికి ఇవ్వాలి. దివ్యాంగులు 12D ఫామ్ తో పాటు వైకల్య ధ్రువీకరణ పత్రాన్ని సమర్పించాలి. వీరి నుంచి 12D ఫామ్ ను బూత్ లెవెల్ ఆఫీసర్ సేకరిస్తారు. జవాబు దారి, పారదర్శకత కోసం ఇంటి వద్ద ఓటు వేసే వారి వివరాలను అభ్యర్థులకు అందుబాటులో ఉంచుతారు, అవసరమైతే అభ్యర్థులు ఈ ప్రక్రియను పర్యవేక్షించుకోవచ్చు. ఈ ఓటర్ల ఇళ్లకు భద్రత అధికారులతో పాటు ప్రత్యేక పోలింగ్ బృందం వెళ్తుంది. ఎప్పుడు ఇంటికి వస్తారు ముందుగానే ఆ ఓటర్లకు తెలియజేస్తారు. ఇంటి వద్ద ఓటు వేసే పూర్తి ప్రక్రియను వీడియో తీస్తారు. ఓటు ఎవరికి వేశారో తెలియకుండా తగిన జాగ్రత్తలు పాటిస్తారు. ఇంటి వద్ద ఓటు వేసిన తర్వాత ఆ బ్యాలెట్ లను భద్రంగా బాక్స్ లో ఉంచి తిరిగి రిటర్నింగ్ అధికారి కి స్వాధీనం చేస్తారు.

You can vote at home

You can vote at home

You can vote at home

ప్రశ్న: ఇంటి వద్దే ఓటు వేసేందు కు ఎవరు అర్హులు ?

జవాబు: 85 సంవత్సరాలు పైబడిన వారు మరియూ 40 శాతం పైన వైకల్యం గలవారు ఇంటివద్దే ఓటు హక్కు వినియోగించుకునేందుకు అర్హులు.

ప్రశ్న: అర్హత గల అబ్యర్ధులు ఎప్పటినుంచి అప్లై చేసుకోవాలి?

జవాబు: నామినేషన్ ప్రక్రియ మొదలైన 5 రోజాల లోగా అప్లై చేసుకోవాలి.

ప్రశ్న : అర్హత అబ్యర్ధులు ఎక్కడ అప్లై చేసుకోవాలి ?

జవాబు: మీకు సంబందించిన BLO కి మీరు ముందే సమాచారం ఇచ్చినట్లయితే మీ BLO 12D ఫారం నింపి రిటర్నింగ్ అధికారికి ఇవ్వడం జరుగును.

ప్రశ్న: 85 సంll వయస్సు మరియూ 40 శాతం వైకల్యం వున్నవారు కచ్చితంగా ఇంటివద్దే ఓటు వేయాలా ?

జవాబు: లేదు పోలింగ్ బూత్ వద్దకు వెళ్ళి కూడా ఓ టు హక్కు వినియోగించ వచ్చు.

You can vote at home

✅ కొత్త ఓట్ కార్డ్ ను నమోదు చేసుకొనుటకు ఈ క్రింది లింక్ మీద క్లిక్ చేయగలరు. 👇

New Voter Registration online 2024

✅ ఫైనల్ ఓటర్ జాబితాలో మీ పేరు వుందో లేదో ఈ క్రింది లింక్ మీద క్లిక్ చేసి తెలుసుకోగలరు. 👇

Download New Voter List in Ap 2024

✅ మీ యొక్క ఓటర్ కార్డ్ ను డౌన్లోడ్ చేసుకొనుటకు ఈ క్రింది మీద క్లిక్ చెయ్యగలరు. 👇

Download Voter Card in Ap

 

✅ మీ ఓట్ వివరాలు సెర్చ్ చేసుకొనుటకు ఈ క్రింది లింక్ మీద క్లిక్ చెయ్యగలరు. 👇

Voter Card Details in Online

 

You can vote at home,You can vote at home

Rate this post

ప్రభుత్వ పథకాలు, ప్రభుత్వ ఉద్యోగాలు, ప్రైవేట్ కంపెనీ ఉద్యోగాల గురించి రోజువారీ సమాచారాన్ని పొందడానికి మా వాట్సాప్ ఛానెల్‌లో మరియు టెలిగ్రామ్ ఛానెల్‌లో చేరండి

Telegram Channel Join Now
WhatsApp Channel Join Now

Related Posts

New Ration Card AP 2024

New Ration Card AP 2024: సంక్రాంతికి రేషన్‌కార్డులు లేనట్టే!

Infosys Java Developer Jobs 2024

Infosys Java Developer Jobs 2024: Infosys కంపెనీలో భారీగా ఉద్యోగాలు

Tech Mahindra Recruitment 2024 | టెక్ మహీంద్రా వాయిస్ ప్రాసెస్ జాబ్స్ | Apply Online

One response to “You can vote at home”

Leave a comment