PAN Aadhar Card Linking Process In Telugu
PAN Aadhar Card Link Status Check In Telugu
PAN-AADHAAR Link Last Date
జులై 1 2024 తర్వాత PAN Aadhaar Card Link అవ్వకపోతే పాన్ కార్డు పనిచేయదు. పాన్ కార్డు పనిచేయుటకు గాను రూ.1000/- పెనాల్టీ తో ఆన్ లైన్ లొ నమోదు చేసుకోవాలి. ఫీజు పేమెంట్ అయిన నెల తరువాత మరలా పాన్ కార్డు పని చేస్తుంది. ఉదాహరణకు ఎవరైనా జులై 3 న పాన్ -ఆధార్ లింక్ చేసుకోటానికి ఆన్ లైన్ లొ నమోదు చేసుకోని ఫీజు పేమెంట్ చేస్తే వారికి ఆగష్టు 2 తరువాత నుంచి పాన్ కార్డు పని చేస్తుంది. ఈ విధంగా ఎప్పుడు దరఖాస్తు చేసుకున్న రోజు నుంచి నెల తర్వాత ఆధార్ కార్డు మనవడ లోకి వస్తుంది.
Exemption For PAN Aadhaar Link
80 సంవత్సరాలు పై బడిన వారికి, NRI వారికి, అస్సాం, మేఘాలయ, జమ్మూ & కాశ్మిర్ రాష్ట్రాల వారికి, భారతీయులు కానీ వారికి Aadhaar PAN Card Link అవసరం లేదు.
PAN Aadhar Card Linking Process In Telugu
Aadhar – Pan Card Link చేసుకోకపోతే మీ పాన్ కార్డు ఆ తరువాత పనిచేయడం మానేస్తుంది. అలా పనిచేయకపోతే
1. మీరు భవిష్యత్తులో పాస్పోర్టుకు దరఖాస్తు చేయలేరు,
2. ట్రేడింగ్ ఎకౌంట్ ఉన్నట్టయితే ఆ ఎకౌంటు పనిచేయడం మానేస్తుంది అందువలన స్టాక్ మార్కెట్లో మీ డబ్బును పెట్టుబడిగా పెట్టలేరు,
3. ప్రభుత్వ పథకాలలో మీ డబ్బుని పెట్టుబడిగా పెట్టలేరు,
4. బ్యాంకులో FD చేద్దాం అనుకుంటే 50,000 రూ కు మించి చేయలేరు,
5. బ్యాంకు నుండి 50 వేల కన్నా ఎక్కువ డబ్బును Withdraw కూడా చెయ్యలేరు.
6. Income Tax Return పైల్ చేయలేరు.
7. TDS నగదు ఎక్కువ కట్ అవుతుంది.
పై సమస్యలు రాకుండా ఉండాలి అంటే వెంటనే Aadhar – PAN Card Link లింక్ చేసుకోవాలి .
How To Know PAN Aadhaar Linking Status In Telugu
Step1: కింద ఇవ్వబడిన లింకుపై క్లిక్ చేయండి.
Step 2 : Home పేజీ లో ఉన్న Link Aadhaar Status పై క్లిక్ చేయండి.
Step 3 : PAN వద్ద PAN కార్డు నెంబర్ ను, Aadhaar Number వద్ద మీ ఆధార్ నెంబర్ ఎంటర్ చేసి View Link Aadhaar Status పై క్లిక్ చేయాలి.
Aadhaar కు PAN కార్డు లింక్ ఉంటే Your PAN CCXXXXXX6Q is already linked to given Aadhaar 79XXXXXXXX05 ఇలా వస్తుంది. Aadhaar కు PAN కార్డు లింక్ లేకపోతే PAN not linked With Aadhaar. Please Check on Link Aadhaar. Link to link Your Aadhaar With PAN అని చూపిస్తుంది.
PAN Aadhar Card Linking Process In Telugu
Step1: కింద ఇవ్వబడిన లింక్ పై క్లిక్ చేయండి.
Step 2 : Link Aadhaar పై క్లిక్ చేయండి.
Step 3 : PAN వద్ద మీ PAN కార్డు నెంబర్ ను, Aadhaar Number వద్ద ఆధార్ నెంబర్ ను ఎంటర్ చేయాలి. Validate పై క్లిక్ చేయాలి.
₹1,000/- పేమెంట్ చేయమని POP-UP వస్తుంది. Continue to Pay Through E-Pay Tax పై క్లిక్ చేయండి.
Step 4 : PAN/TAN వద్ద మీ PAN నెంబర్ ను Confirm PAN/TAN వద్ద మరల PAN నెంబర్ ఎంటర్ చేయాలి, Mobile నెంబర్ వద్ద ఆధార్ కు లింక్ అయిన మొబైల్ నెంబర్ ఎంటర్ చేయాలి. OTP వస్తుంది ఆ OTP ఎంటర్ చేయాలి.
Step 5 : e-PSY Tax పేజీ ఓపెన్ అవుతుంది. అందులో Income Tax అని ఉన్న బాక్స్ ను సెలెక్ట్ చేసుకోవాలి. Proceed పై Click చేయాలి.
Step 6: Assessment Year – 2023-34 & Type Of Payment Mode & Other Receipt (500) ను సెలెక్ట్ చేసుకోవాలి. Continue పై క్లిక్ చేయండి. 1000 పేమెంట్ చూపిస్తుంది. మరలా Continue పై క్లిక్ చేయండి.
Step 7 : Mode Of Payment & Phone Pay / Google Pay / Paytm లో UPI విధానంలో చేయిటకు Payment Gateway లో ఉండే Canara Bank or Federal Bank or Kotak Mahindra Bank లో ఒకటి సెలెక్ట్ చేసుకోవాలి. వాటిలో మీకు అకౌంట్ ఉండవలసిన అవసరం లేదు.
ఆప్షన్ లలో ఏదైనా ఒకటి సెలెక్ట్ చేసుకోని UPI సెలెక్ట్ చేసుకోవాలి. పేమెంట్ పూర్తి చేసాక రసీదు ప్రింట్ తీసుకోవాలి.
Step8: పేమెంట్ చేసిన 2 లేదా 3 రోజుల తరువాత PAN-AADHAAR లింక్ ఓపెన్ చేసి PAN & ఆధార్ నెంబర్ ఎంటర్ చేసి Verify పై క్లిక్ చేసాక ముందుగా చేసిన పేమెంట్ వివరాలు చూపిస్తుంది. Continue పై క్లిక్ చేయాలి. Name As Per Aadhaar లో ఆధార్ ప్రకారం పేరు ఎంటర్ చేయాలి మరియు Mobile Number లో మొబైల్ నెంబర్ ఎంటర్ చేసి రెండు Box లలో టిక్ చేసి Link Aadhaar పై క్లిక్ చేయాలి. OTP ఎంటర్ చేసాక Validate పై క్లిక్ చేస్తే ప్రాసెస్ పూర్తి అవుతుంది.
More Useful Links :
- PVC ఆధార్ కార్డు ఆర్డర్ పెట్టుకునే విదానం – Click Here
- సొంతముగా ఆధార్ డాక్యుమెంట్ అప్డేట్ ఎలా చేసుకోవాలి ? – Click Here
Tags : PAN Aadhar Card Linking Process In Telugu, PAN Aadhar Card Linking Process In Telugu, pan Aadhaar link last date, pan Aadhaar link status check Telugu, www.incometax.gov.in Aadhaar pan link status Telugu, PAN Aadhar Card Linking Process In Telugu, Pan Card Telugu