IBPS Recruitment 2024 Telugu 1

grama volunteer

IBPS Recruitment 2024 Telugu 1
Telegram Channel Join Now
WhatsApp Channel Join Now

IBPS Recruitment 2024 Telugu 1

 

ఐబీపీఎస్‌ ఆధ్వర్యంలో నియామక ప్రక్రియ.. రెండు దశల రాత పరీక్షలో ప్రతిభతో కొలువు!

దకొండు ప్రభుత్వ రంగ బ్యాంకుల్లో.. క్లరికల్‌ కేడర్‌లో కొలువుదీరే అవకాశం లభిస్తుంది. వీటికి డిగ్రీ అర్హతతోనే పోటీ పడొచ్చు. ఈ నేపథ్యంలో.. ఐబీపీఎస్‌ క్లర్క్స్‌ సీఆర్‌పీ-14 ఎంపిక ప్రక్రియ, పరీక్ష విధానం, సిలబస్‌ విశ్లేషణ, ప్రిపరేషన్‌ తదితర వివరాలు..

ఆధార్ కార్డు లింక్ స్టేటస్

Trending Post

ఆధార్ కార్డుకు మొబైల్ నెంబర్ లింక్ స్టేటస్ తెలుసుకునే విధానము

 

మొత్తం 6,128 పోస్ట్‌లు

ఐబీపీఎస్‌ తాజాగా విడుదల చేసిన సీఆర్‌పీ క్లర్క్స్‌-14 ప్రక్రియ ద్వారా మొత్తం పదకొండు ప్రభుత్వ రంగ బ్యాంకుల్లో 6,128 క్లర్క్‌ పోస్ట్‌ల నియామకం చేపట్టనున్నారు. బ్యాంక్‌ ఆఫ్‌ బరోడా, కెనరా బ్యాంకు, ఐఓబీ, యూకో బ్యాంకు, బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా, సెంట్రల్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా, పంజాబ్‌ నేషనల్‌ బ్యాంక్, యూనియన్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా, బ్యాంక్‌ ఆఫ్‌ మహారాష్ట్ర, ఇండియన్‌ బ్యాంక్, పంజాబ్‌ అండ్‌ సింద్‌ బ్యాంకుల్లో ఈ ఖాళీలు ఉన్నాయి. సదరు బ్యాంకులకు సంబంధించి ఏపీలో 105 పోస్ట్‌లు, తెలంగాణలో 104 పోస్ట్‌లు ఉన్నాయి.

అర్హతలు

➤ 2024, జూలై 21 నాటికి బ్యాచిలర్‌ డిగ్రీ ఉత్తీర్ణత ఉండాలి. దీంతోపాటు కంప్యూటర్‌ పరిజ్ఞానం తప్పనిసరి. స్కూల్‌/కాలేజ్‌ స్థాయిలో కంప్యూటర్‌/ఐటీ ఒక సబ్జెక్ట్‌గా చదివుండాలి.
 వయసు: జూలై 1, 2024 నాటికి 20-28 ఏళ్ల మధ్యలో ఉండాలి. ఎస్‌సీ, ఎస్‌టీ అభ్యర్థులకు అయిదేళ్లు, ఓబీసీ అభ్యర్థులకు మూడేళ్లు చొప్పున గరిష్ట వయో పరిమితిలో సడలింపు.

రెండు దశల ఎంపిక ప్రక్రియ

ఐబీపీఎస్‌ సీఆర్‌పీ ఫర్‌ రిక్రూట్‌మెంట్‌ ఆఫ్‌ క్లర్క్‌ ఎంపిక ప్రక్రియ మొత్తం రెండు దశల్లో జరుగుతుంది. అవి.. ప్రిలిమినరీ రాత పరీక్ష; మెయిన్‌ రాత పరీక్ష.
తొలుత అభ్యర్థులకు ప్రిలిమినరీ రాత పరీక్ష ఆన్‌లైన్‌లో నిర్వహిస్తారు. ఇందులో చూపిన ప్రతిభ ఆధారంగా.. ఐబీపీఎస్‌ నిర్దేశించిన కటాఫ్‌ జాబితాలో నిలిచిన వారికి తదుపరి దశలో మెయిన్‌ ఎగ్జామినేషన్‌ నిర్వహిస్తారు. మెయిన్స్‌ పరీక్షలోనూ విజయం సాధించి.. తుది జాబితాలో నిలిస్తే క్లర్క్‌ కొలువు ఖాయమవుతుంది.

తొలి దశ ప్రిలిమినరీ

ఐబీపీఎస్‌ క్లర్క్స్‌ నియామక ప్రక్రియలోని తొలి దశ ప్రిలిమినరీ పరీక్ష.. మూడు విభాగాల్లో ఆన్‌లైన్‌ విధానంలో జరుగుతుంది. ఇంగ్లిష్‌ లాంగ్వేజ్‌ 30 ప్రశ్నలు-30 మార్కులు, న్యూమరికల్‌ ఎబిలిటీ 35 ప్రశ్నలు-35 మార్కులు, రీజనింగ్‌ ఎబిలిటీ 35 ప్రశ్నలు-35 మార్కులు.. ఇలా మొత్తం 100 ప్రశ్నలు-100 మార్కులకు పరీక్ష ఉంటుంది. పరీక్ష సమయం 60 నిమిషాలు.

మెయిన్స్‌ పరీక్ష విధానం

తొలిదశ ప్రిలిమినరీ పరీక్షలో చూపిన ప్రతిభ ఆధారంగా పోస్ట్‌ల సంఖ్యను అనుసరించి మెరిట్‌ లిస్ట్‌ను రూపొందిస్తారు. ఆ మెరిట్‌ లిస్ట్‌లో నిలిచిన వారు మెయిన్స్‌ ఎగ్జామినేషన్‌కు హాజరవ్వాల్సి ఉంటుంది. మెయిన్స్‌ ఎగ్జామినేషన్‌ నాలుగు విభాగాల్లో నిర్వహిస్తారు. జనరల్‌/ఫైనాన్షియల్‌ అవేర్‌నెస్‌ 50 ప్రశ్నలు-50 మార్కులు, జనరల్‌ ఇంగ్లిష్‌ 40 ప్రశ్నలు-40 మార్కులు, రీజనింగ్‌ ఎబిలిటీ అండ్‌ కంప్యూటర్‌ ఆప్టిట్యూడ్‌ 50 ప్రశ్నలు-60 మార్కులు, -క్వాంటిటేటివ్‌ ఆప్టిట్యూడ్‌ 50 ప్రశ్నలు-50 మార్కులు.. ఇలా 190 ప్రశ్నలు-200 మార్కులకు పరీక్ష జరుగుతుంది. పరీక్ష సమయం 2 గంటల 40 నిమిషాలు.

ముఖ్య సమాచారం

➤ దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌ లో దరఖాస్తు చేసుకోవాలి.
➤ ఆన్‌లైన్‌ దరఖాస్తు చివరి తేదీ:2024, జూలై 21
➤ ప్రిలిమినరీ పరీక్ష హాల్‌ టిక్కెట్ల డౌన్‌లోడ్‌: 2024, ఆగస్ట్‌లో
➤ ఆన్‌లైన్‌ ప్రిలిమినరీ ఎగ్జామ్‌ తేదీలు: 2024, ఆగస్ట్‌లో
 మెయిన్‌ ఎగ్జామినేషన్‌ తేదీ: 2024,అక్టోబర్‌లో
➤ పూర్తి వివరాలకు వెబ్‌సైట్‌: www.ibps.in/index.php/clerical-cadre-xiv

రాత పరీక్షలో రాణించేలా

ఐబీపీఎస్‌ క్లర్క్‌ నియామక పరీక్షకు సంబంధించి అభ్యర్థులు ముందుగా స్వీయ సమయ ప్రణాళికను రూపొందించుకోవాలి. నోటిఫికేషన్‌లో నిర్దిష్టంగా తేదీని ప్రకటించనప్పటికీ.. ఆగస్ట్‌లో ప్రిలిమినరీ పరీక్ష, అక్టోబర్‌లో మెయిన్‌ పరీక్ష ఉంటుందని పేర్కొన్నారు. అంటే.. ఇప్పటి నుంచి ప్రిలిమ్స్‌కు రెండు నెలలు, మెయిన్స్‌కు మూడు నెలల సమయం అందుబాటులో ఉంది. దీనికి అనుగుణంగా.. టైమ్‌ ప్లాన్‌ను రూపొందించుకుని ప్రిపరేషన్‌కు ఉపక్రమించాలి.

ఇంగ్లిష్‌ లాంగ్వేజ్‌

ఈ విభాగంలో ఇడియమ్స్, సెంటెన్స్‌ కరెక్షన్, వొకాబ్యులరీ, సెంటెన్స్‌ రీ అరేంజ్‌మెంట్, వన్‌ వర్డ్‌ సబ్‌స్టిట్యూట్స్‌పై అవగాహన ఏర్పరచుకోవాలి. గ్రామర్‌కే పరిమితం కాకుండా.. జనరల్‌ ఇంగ్లిష్‌ నై­పుణ్యం పెంచుకోవాలి. ఇందుకోసం ఇంగ్లిష్‌ దినపత్రికలు చదవడం,వాటిలో వినియోగిస్తున్న పదజా­లం,వాక్య నిర్మాణం వంటి వాటిపై దృష్టి పెట్టాలి.

ఉమ్మడి వ్యూహం

ప్రిలిమ్స్, మెయిన్స్‌ విధానంలో జరిగే ఐబీపీఎస్‌ క్లర్క్స్‌ పరీక్షలో.. మూడు విభాగాలు (ఇంగ్లిష్‌ లాంగ్వేజ్, రీజనింగ్, క్వాంటిటేటివ్‌ ఆప్టిట్యూడ్‌/న్యూమరికల్‌ ఎబిలిటీ) ఉంటాయి. ప్రిలిమ్స్‌లో అడిగే ప్రశ్నల క్లిష్టత స్థాయి కొంత తక్కువగా, మెయిన్స్‌ క్లిష్టత స్థాయి కొంత ఎక్కువగా ఉంటుంది. కాబట్టి అభ్యర్థులు ఈ మూడు విభాగాలకు సంబంధించి మొదటి నుంచే మెయిన్స్‌ దృక్పథంతో అధ్యయనం సాగించాలి.

న్యూమరికల్‌ ఎబిలిటీ

దీన్ని మెయిన్స్‌లో క్వాంటిటేటివ్‌ ఆప్టిట్యూడ్‌కు సరితూగే విభాగంగా పేర్కొనొచ్చు. విద్యార్థులు ప్ర­ధానంగా అర్థమెటిక్‌ అంశాల(పర్సంటేజెస్, నిష్పత్తులు, లాభ-నష్టాలు, నంబర్‌ సిరీస్, బాడ్‌మాస్‌ నియమాలు)పై పూర్తిగా అవగాహన పొందేలా ప్రా­క్టీస్‌ చేయాలి. వీటితోపాటు గత పరీక్షలు, వెయిటేజీ కోణంలో డేటా ఇంటర్‌ప్రిటేషన్, డేటా అనాలిసిస్‌ల­పై ప్రత్యేక దృక్పథంతో ప్రిపరేషన్‌ కొనసాగించాలి.

రీజనింగ్‌

ఇది కూడా రెండు పరీక్షల్లో (ప్రిలిమ్స్, మెయిన్స్‌) ఉంటుంది. ఇందులో మంచి మార్కుల సాధనకు కోడింగ్‌-డీకోడింగ్, బ్లడ్‌ రిలేషన్స్, డైరెక్షన్, సిలాజిజమ్‌ విభాగాలను బాగా ప్రాక్టీస్‌ చేయాలి.

 

ప్రిలిమ్స్‌తోపాటే మెయిన్స్‌

 

ప్రిలిమ్స్‌ ప్రిపరేషన్‌తోపాటే మెయిన్స్‌లో అదనంగా ఉండే జనరల్‌ అవేర్‌నెస్, ఫైనాన్షియల్‌ అవేర్‌నెస్, కంప్యూటర్‌ నాలెడ్జ్‌ అంశాల ప్రిపరేషన్‌ కూడా సాగించాలి. ప్రిలిమ్స్‌ పూర్తయ్యాక వీటిపై దృష్టి పెట్టాలనుకునే ఆలోచన సరికాదు. సమయాభావం సమస్య కూడా తలెత్తుతుంది. ఎందుకంటే.. ప్రిలిమ్స్‌ ఆఖరి స్లాట్‌ పరీక్ష ముగిసిన తర్వాత మెయిన్‌ ఎగ్జామినేషన్‌కు అందుబాటులో ఉండే సమయం తక్కువగా ఉంటుంది. ఈ సమయంలో మెయిన్స్‌లో అదనంగా ఉండే రెండు విభాగాలకు ప్రిపరేషన్‌ పూర్తి చేయడం కష్టమవుతుంది.

జనరల్‌ అవేర్‌నెస్‌/ఫైనాన్షియల్‌ అవేర్‌నెస్‌

ఈ విభాగంలో బ్యాంకింగ్‌ రంగం పరిణామాలపై ప్రత్యేక దృష్టి పెట్టాలి. నోటిఫికేషన్‌లో విత్‌ స్పెషల్‌ రిఫరెన్స్‌ టు బ్యాంకింగ్‌ అని స్పష్టంగా పేర్కొన్నారు. కాబట్టి బ్యాంకింగ్‌ రంగంలోని అబ్రివేషన్లు, పదజాలం, విధులు, బ్యాంకులకు సంబంధించిన కొత్త విధానాలు, కోర్‌ బ్యాంకింగ్‌కు సంబంధించి చట్టాలు, విధానాలు, రిజర్వ్‌ బ్యాంకు విధులు వంటి వాటిపై అవగాహన పెంచుకోవాలి. జనరల్‌ అవేర్‌నెస్‌లో కరెంట్‌ అఫైర్స్, స్టాక్‌ జనరల్‌ నాలెడ్జ్‌ కోణంలోనూ ఆర్థిక సంబంధ వ్యవహారాల(ఎకానమీ, ప్రభుత్వ పథకాలు)కు ప్రాధాన్యం ఇవ్వాలి.

కంప్యూటర్‌ ఆప్టిట్యూడ్‌

మెయిన్‌ ఎగ్జామినేషన్‌లో మూడో విభాగంలో ఒక సబ్జెక్ట్‌గా ఉన్న కంప్యూటర్‌ ఆప్టిట్యూడ్‌కు సంబంధించి కంప్యూటర్‌ ఆపరేషన్‌ సిస్టమ్స్, కంప్యూటర్‌ స్ట్రక్చర్, ఇంటర్నెట్‌ సంబంధిత అంశాలు, పదజాలంపై దృష్టి పెట్టాలి. కీబోర్డ్‌ షాట్‌ కట్స్,కంప్యూటర్‌ హార్డ్‌వేర్‌ సంబంధిత అంశాలు(సీపీయూ, మా­నిటర్,హార్డ్‌డిస్క్‌ తదితర)గురించి తెలుసుకోవాలి.

గ్రాండ్, మోడల్‌ టెస్ట్‌లకు ప్రాధాన్యం

ప్రిలిమ్స్‌ ముగిసిన తర్వాత మెయిన్స్‌కు అందుబాటులో ఉండే వ్యవధిలో అభ్యర్థులు మెయిన్స్‌ గ్రాండ్‌ టెస్ట్‌లకు ప్రాధాన్యం ఇవ్వాలి. ప్రతి రోజు ఒక గ్రాండ్‌ టెస్ట్‌ రాసే విధంగా వ్యవహరించాలి. మెయిన్స్‌లోని అదనపు అంశాలకు లభిస్తున్న వెయిటేజీని గుర్తించి ఆమేరకు ప్రిపరేషన్‌ సాగించాలి. వెయిటేజీ కొంచెం తక్కువగా ఉందని భావిస్తే పెద్దగా ఆందోళన చెందకుండా.. అప్పటికే పట్టు సాధించిన అంశాల్లో మరింత నైపుణ్యం సాధించే విధంగా ముందుకు సాగాలి.

More Jobs :

10th అర్హతతో HDFC Bank లో ఉద్యోగాలకు నోటిఫికేషన్ – Click Here

ఆంధ్ర బ్యాంక్ లో భారీగా ఉద్యోగాలు భర్తీ – Click Here

Indian Bank Apprentice Recruitment 2024 – Click Here

Tags : IBPS Recruitment 2024 Telugu, IBPS Recruitment 2024 Telugu,

IBPS recruitment 2024 last date to apply, IBPS recruitment 2024 apply online, IBPS recruitment 2024 notification, IBPS recruitment 2024 notification pdf, IBPS recruitment 2024 official website, IBPS recruitment 2024 syllabus, IBPS recruitment 2024 clerk, IBPS recruitment 2024 calendar, IBPS recruitment 2024 exam date, IBPS recruitment 2024 age limit, Latest Govt Jobs Update, IBPS Recruitment 2024 Telugu 1, IBPS Recruitment 2024 Telugu 1, IBPS Recruitment 2024 Telugu 1, IBPS Recruitment 2024 Telugu 1, IBPS Recruitment 2024 Telugu 1, IBPS Recruitment 2024 Telugu 1, IBPS Recruitment 2024 Telugu 1, IBPS Recruitment 2024 Telugu 1, IBPS Recruitment 2024 Telugu 1

1/5 - (1 vote)

ప్రభుత్వ పథకాలు, ప్రభుత్వ ఉద్యోగాలు, ప్రైవేట్ కంపెనీ ఉద్యోగాల గురించి రోజువారీ సమాచారాన్ని పొందడానికి మా వాట్సాప్ ఛానెల్‌లో మరియు టెలిగ్రామ్ ఛానెల్‌లో చేరండి

Telegram Channel Join Now
WhatsApp Channel Join Now

Related Posts

Infosys Recruitment 2025 Telugu

Infosys Recruitment 2025: ఫ్రెషర్స్ కి Infosys కంపనీలో భారీగా ఉద్యోగాలు

PhonePe Recruitment 2024

PhonePe Recruitment 2024: PhonePe కంపెనీలో భారీగా ఉద్యోగాలు

AAI Apprentice Jobs Notification 2024

AAI Apprentice Jobs Notification 2024: ఎయిర్‌పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా లో ఉద్యోగాలు

Leave a comment