TDP Announced 10 Thousand For Volunteers
వాలంటీర్లకు గుడ్ న్యూస్, 10 వేలు జీతం
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గ్రామ వార్డు సచివాలయాల పరిధిలో పనిచేస్తున్నటువంటి వాలంటీర్లకు గుడ్ న్యూస్. తాము అధికారంలోకి వస్తే వాలంటీర్ వ్యవస్థను కొనసాగించడంతో పాటు వారికి పదివేల రూపాయల వేతనం ఇస్తామని తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు వెల్లడించారు.
ప్రస్తుతం 5000 రూపాయలకే వాలంటీర్లు ఇంటింటికి సేవలు అందిస్తున్న విషయం తెలిసిందే. ఇటీవల వాలంటీర్ వ్యవస్థ పై నెలకొన్న సంగ్దిద్ధం నేపథ్యంలో ఈ న్యూస్ రావడం గమనార్హం. తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వస్తే వాలంటీర్ వ్యవస్థను తీసి వేస్తారని అధికార పార్టీ నేతలు బహిరంగంగా విమర్శిస్తున్న నేపథ్యంలో చంద్రబాబు నాయుడు ఈ వ్యాఖ్యలు చేయటం కీలకంగా మారాయి.
Trending Post
ఆధార్ కార్డుకు మొబైల్ నెంబర్ లింక్ స్టేటస్ తెలుసుకునే విధానము
ప్రస్తుతం ఎన్నికల కోడ్ నేపథ్యంలో వాలంటీర్లను ప్రభుత్వ సేవల నుంచి దూరంగా ఉంచిన విషయం మనకు తెలిసిందే. వాలంటీర్లను పెన్షన్ పంపిణీ మరియు ఇతర సంక్షేమ పథకాలకు సంబంధించినటువంటి కార్యక్రమాలకు దూరంగా ఉండటం జరిగింది
ఎన్నికల తరువాత ఒకవేళ టీడీపీ జనసేన ప్రభుత్వం వస్తె
వీరికి 10 వేల రూపాయలు నెల వారి వేతనం గా ఇస్తామని ప్రకటించడం వాలంటీర్లకు ఊరటనిచ్చే అంశం.
TDP Announced 10 Thousand For Volunteers,
Leave a comment