9 Ways To Earn Money From Blogging In Telugu
తెలుగు బ్లాగ్ నుంచి మని సంపాదన సాధ్యమా?
తెలుగు బ్లాగ్ నుంచి మని సంపాదన కు ఏలాంటి మార్గాలు ఉన్నాయి?
Trending Post
ఆధార్ కార్డుకు మొబైల్ నెంబర్ లింక్ స్టేటస్ తెలుసుకునే విధానము
తెలుగు బ్లాగ్ నుంచి ఎంత మని సంపాదించవచ్చు?
తెలుగు బ్లాగ్ చేయడానికీ ఏ ఏ విషయాలపై బ్లాగింగ్ చేస్తే మంచిది?
2024 లో తెలుగు బ్లాగ్స్ ఏమైనా ఫ్యూచర్ వుంటుందా?
లాంటి చాలా ప్రశ్నలు బ్లాగింగ్ కెరీర్ మొదట్లో మనల్ని బాగా ఇబ్బంది పెడుతుంటాయి. మీ బ్లాగింగ్ కెరీర్ లో క్లారిటీ తో ముందుకు సాగడానికి ఈ బ్లాగ్ పోస్ట్ మీకు కచ్చితంగ సహాయ పడుతుంది.
కొద్ది సంవత్సరాల క్రితము వరకి బ్లాగింగ్ అనేది ఒక హాబీ లేదా ఒక పర్సనల్ టైం పాస్ చేసే ఒక పని.
కాని ఇపుడు చాలా మంది బ్లాగింగ్ అనేది హాబీ గానే కాక
ఒక సైడ్ బిజినెస్ (పార్ట్ టైం) గాను
ఫైల్ టైమ్ కెరియర్ గాను ఎంచుకుంటున్నారు
ఎందుకంటె ఈ కెరీర్ లో మన రెగ్యులర్ కెరీర్ లానే మంచి ఇన్కమ్ తో పాటు మంచి పేరు ప్రక్యాతులు ఇంకా మంచి పాసివ్ ఇన్కమ్ సంపాదనకు అవకాశము వుండటము.
బ్లాగింగ్ అనేది తక్కువ పెట్టుబడి తో ఇంటి నుంచి మనకి నచ్చిన సమయములో పని చేస్తూ పెద్ద మొత్తంలో డబ్బు సంపాదనకు అవకాశము వున్న ఒక మార్గము.
న్యాయపరంగా వున్న అన్ని మార్గాలలో బ్లాగింగ్ కెరీర్ ద్వారా మని అనేది చాల గౌరవముతో కూడిన లాభదాయకమైన మార్గము.
మిగిలిన మార్గాలతో పోలిస్తే ఇది ఒక దీర్ఘకాలికమైన(long term) విధానము అందుకే ఈ విధానము మీరు ఎంచుకునే సమయములో చాలా చాలా జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది. లేని పక్షంలో మీ ప్యయత్నాలు అన్ని దీర్ఘకాలంలో మంచి లాభాలను ఇచ్చే అవకాశాలను మనము కోల్పోయే అవకాశము వుంది.
మనకి ముందుగా పెద్దలు చెపినట్టు ఏదైనా పద్దతిగా చేసినపుడు దానికి సంబంధించిన ప్రతిఫలాలు పెద్ద మొత్తములో వుంటాయి మరియు ఎక్కువ సంతోషాన్ని కలిగిస్తాయి.
ఇంతకు ముందు నేను రాసిన బ్లాగ్ మని తెలుగు part-1 లో బ్లాగింగ్ గురించిన ముఖ్యమైన బేసిక్ వివరాలు గురించి డిస్కస్ చేయడము జరిగింది
ఆ బ్లాగ్ పోస్ట్ లో
బ్లాగింగ్ అంటే ఏమిటి ?
బ్లాగింగ్ ఎవెరెవరు చేయవచ్చు ?
బ్లాగింగ్ చేయడము ద్వారా మని సంపాదన ఎలా ?
ఏ ఏ విషయాల పైన బ్లాగింగ్ చేయవచ్చు?
ఎలాంటి విషయాలను బ్లాగ్ ద్వారా రీడర్స్ కి అందించవచ్చు ?
బ్లాగింగ్ కెరీర్ ప్రారంభించడములో వుండే కష్ట నష్ఠాలు ఏమిటి ?
బ్లాగింగ్ అనేది ఒక ఆన్లైన్ మని సంపాదన కెరీర్ గా కాన్ఫిడెంట్ గా ఎంచుకోవచ్చా?
బ్లాగింగ్ ద్వారా నెలకి లక్ష రూపాయలు సంపాదించడానికి ఎన్ని రోజులు పడుతుంది?
ఇలాంటి విషయాల గురించి వివరముగా డిస్కస్ చేయడము జరిగింది.
మీరు ఆ బ్లాగ్ పోస్ట్ చదవకపోతే ఈ క్రింద ఇచ్చిన లింక్ క్లిక్ చేసి డిటైల్ గా తెలుసుకొని తరువాత ఈ బ్లాగ్ పోస్ట్ చదవడము ద్వారా మీకు తెలుగు బ్లాగింగ్ కెరీర్ మీద ఒక క్లియర్ అవగాహనా వచ్చే అవకాశము వుంది.
మరి ఇప్పుడు ప్రస్తుత బ్లాగ్ పోస్ట్ డిటైల్స్లోకి వెళ్తే
బ్లాగింగ్ ద్వారా మని సంపాదించడానికి వున్న అన్ని మార్గాలని ముఖ్యముగా 4 ముఖ్యమైన విధానాలుగా విభజించవచ్చు.
Note: మీరు మీ బ్లాగింగ్ కెరీర్ ద్వారా మని సంపాదించాలి అనే ఆలోచనతో బ్లాగ్ ప్రారంభించినప్పుడు ఈ 9 మార్గాలలో మీ స్కిల్ కి అనుగుణంగా లేదా మీ కంటెంట్ నిచ్చే (niche) కి సరిపోయే బ్లాగ్ రెవెన్యూ మార్గాన్ని ఎంచుకోవడం మీ బ్లాగింగ్ కెరియర్ విజయానికి వుపయోగ కరముగా వుంటుంది.
కాబట్టి మీ మని సంపాదన మార్గం ఎదైనా మీరు మనసులో పెట్టుకోవలిసిన 3 ముఖ్యమైన అత్యవసరమైన విషయాలు
1.మీ బ్లాగ్ సరికొత్త మరియు క్వాలిటీ కంటెంట్ కలిగి ఉండటం
2. సరియైన విజిటర్స్ మంచి సంఖ్యలో ఆకర్షించే లక్షణము
3. మీ కంటెంట్ మీద విజిటర్స్ కి వున్న ఆసక్తి మరియు ఎంగేజ్మెంట్
మీరు ఎంచుకునే మార్గము ఎదైనా మీకు ఒక self hosted wordpress Blog లేదా website తప్పనిసరి. దానికి అధనముగా మీరు ఎంచుకున్న డిజిటల్ కెరీర్ ఆధారముగా మీరు మీ బ్లాగ్ లేదా వెబ్సైటు కి అవసరమయ్యే అధనపు ఫీచర్స్ చేర్చుకోవలసి వస్తుంది.
బ్లాగ్ క్రియేట్ చేయడం చాలా సులభమైన పని. పెద్దగా టెక్నికల్ నాలెడ్జ్ లేకుండా చిన్న వయస్సు నుంచి పెద్దవాళ్ళ వరకు ఎవరైనా బ్లాగ్ ను 15 నుంచి 20 నిమిషాల్లో సులభంగా క్రియేట్ చేయవచ్చు. మీరు non technical బ్యాక్ గ్రౌండ్ నుంచి వచ్చినప్పటికీ ఇపుడు అందుబాటులో వున్న ఆన్లైన్ టూల్స్ మరియు రిసోర్సెస్ నుంచి బ్లాగ్ లేదా వెబ్సైటు స్టార్ట్ చేయడం సులభము.
మీరు ఇప్పటివరకు బ్లాగ్ సెటప్ చేయకపోతే 20 నిమిషాలలో మీ బిజినెస్ ఐడియాకి లేదా మీ డిజిటల్ కెరీర్ కి సంబంధించిన బ్లాగ్ లేదా వెబ్సైట్ ను సులభము గా స్టార్ట్ చేయవచ్చు.
దీనికి సంబంధించిన ఎన్నో ఫ్రీ టూల్స్ మరియు ఆన్లైన్ టుటోరియల్స్ ఆన్లైన్ లో అందుబాటులో వున్నాయి.
వాటి సహాయముతో మీరు మీ బ్లాగ్ లేదా వెబ్సైటు నిర్మించి మీ డిజిటల్ కెరీర్ ప్రారంచవచ్చు.
మరి మన ప్రస్తుత బ్లాగ్ టాపిక్ ఐన బ్లాగ్ మని గురించి వివరాలలోకి వెళ్తామా మరి
9 Ways To Earn Money From Blogging In Telugu
బ్లాగింగ్ కెరీర్ ద్వారా మని సంపాదించడానికి 9 మార్గాలు
ఆన్లైన్ లో మని సంపాదించడానికి ఎన్నో మార్గాలు ఉన్నప్పటికీ బాగా పెద్ద మొత్తములో మని సంపాదించడానికి వున్న అతి ప్రముఖమైన మార్గము ఈ బ్లాగింగ్.
ఐతే మీరు గుర్తుంచుకోవలసిన ఇంకొక విషయము బ్లాగింగ్ అనేది Get Rich Quick లేదా overnight Obama లాంటి స్కీం అయితే కాదు.
మరియు అదేవిధముగా ఈ బ్లాగింగ్ కెరీర్ లో మీ బ్లాగ్ వుపయోగించి మని సంపాదించడానికి దగ్గర దగ్గరా 100 కు పైగా మార్గాలు వున్నాయి.
బ్రాడ్ గా ఆలోచిస్తే అవన్నీ ముఖ్యముగా పైన చెప్పిన 4 విధానాల కిందకి వస్తాయి. కావున ఆ 100 మార్గాలు తెలుసుకున్న లేదా ఈ 4 మార్గాలను సంపూర్ణముగా అర్ధము చేసుకున్న మీ బ్లాగింగ్ కెరీర్ సంపాదన గురించిన మీ నాలెడ్జ్ సంపూర్ణము అయినట్టే.
బ్లాగ్ నుంచి మని సంపాదనకు వున్న అన్ని మార్గాలను ముఖ్యముగా 4 విధానాలుగా మనము విభజించవచ్చు. అవి
- యాడ్ రెవిన్యూ
2. ఇతరుల ప్రొడక్ట్స్ లేదా సర్వీసులను అమ్మడము
3. సొంత డిజిటల్ / ఫిజికల్ ప్రొడక్ట్స్ / సర్వీసులను అమ్మడం
4. ప్రీమియం కంటెంట్ అమ్మడము ద్వారా
ఇప్పుడు మీరు బ్లాగ్ నుంచి మనీ సంపాదించడానికి ఉన్న ముఖ్యమైన 9 మార్గాల గురించి తెలుసుకుందాము
9 Ways To Earn Money From Blogging In Telugu
1. Adsense Revenue
మీ బ్లాగింగ్ కెరీర్ ప్రారంభంలో మీరు మీ బ్లాగ్ నుంచి మని సంపాదనకి ఒక మంచి అవకాసం ఈ Adsense రెవెన్యూ. మీకు వున్న కొద్దిపాటి ట్రాఫిక్ (రీడర్స్) నుంచి మీరు మని సంపాదించే అవకాశము.
ఇంకా చెప్పాలంటే అన్ని మార్గాలలో ఇది చాలా సులభమైన మార్గం కూడా. మీ బ్లాగింగ్ కెరీర్ ప్రారంభించిన మొదట్లో నుంచే మీరు Google AdSense ద్వారా మీ బ్లాగ్ కంటెంట్ నుంచి మని సంపాదించే అవకాశం వుంది.
Google AdSense అనేది గూగుల్ కంపెనీ చేత నడపబడే ఒక అడ్వర్టైజింగ్ నెట్వర్క్. దీనిని మనం మల్టీ ఛానల్ యాడ్ నెట్వర్క్ (MCN) అని కూడ అంటాము.
మీ బ్లాగ్ లేదా వెబ్సైట్లో టెక్స్ట్, ఇమేజ్, వీడియో యాడులను మీ ఆడియన్స్ కి చూపడం ద్వారా మీ బ్లాగ్ లేదా website కంటెంట్ నుంచి మనీ సంపాదించుకునె అవకాశం ఈ గూగుల్ యాడ్ సెన్స్ మీకు కలిగి ఇస్తుంది.
ఇంకొక ముఖ్య ఉపయోగము చూశారంటే Google Adsense చూపే యాడ్ లు మీ బ్లాగ్ యొక్క టాపిక్ సందర్భానికి అనుగుణముగా వుండటము మరియు హై క్వాలిటీ కారణముగా మీ రీడర్స్ కి డిస్టర్బ్ చేసిన ఫీల్ ఏమి ఉండదు. అంటే మీ రీడర్స్ కి మంచి ఫీల్ తో పాటు మీకు మంచి ఇన్కమ్ అన్నమాట!
Adsense మీ వెబ్సైట్ లేదా బ్లాగ్ లో మీరు అనుమతి ఇచ్చిన స్పేస్ లో ఆటోమేటిక్ గా యాడ్ లను చూపి మరియు పేమెంట్ పొందడానికి వీలు కలిగిస్తుంది.
Google AdSense అడ్వర్టైజ్మెంట్ CPC(Cost-Per-Click) Ads ద్వారా పని చేస్తుంది. అంటే మీ బ్లాగ్/వెబ్సైట్ విజిటర్లు మీ వెబ్ సైట్ లో చూపిన యాడ్ మీద క్లిక్ చేసినప్పుడు మీరు మనీ సంపాదించగలగడం అన్నమాట.
మీ Adsense రెవెన్యూ యాడ్ ల మీద పడే క్లిక్ ల సంఖ్య మీద మాత్రమే కాకుండా ఇంకా చాలా ఇతర విషయాల మీద కూడా ఆధారపడి ఉంటుంది.
కొన్ని రకాలైన సింపుల్ టిప్స్ పాటించి అదే సంఖ్యలో వున్న మీ రీడర్స్ నుంచి మీ AdSense రెవిన్యూ 2-3 రెట్లు పెంచుకోవడానికి అవకాశము వుంది. ఎందుకంటె
మన యాడ్ రెవెన్యూ మన బ్లాగ్ విజిటర్స్ యొక్క సంఖ్య వారు మన బ్లాగ్ లోని యాడ్ మీద చేసే క్లిక్స్, మన కంటెంట్ తో చేసే ఎంగేజ్మెంట్ ఇంకా బ్లాగ్ రీడర్స్ యొక్క లొకేషన్ మరియు కంపెనీ ఆ సీజనల్ లో ఇచ్చే CPC లాంటి అనేక విషయాలు మీ Adsense రెవెన్యూ ప్రభావితము చేస్తాయి.
Google Adsense నుంచి అప్రోవల్ తెచ్చుకోవడం మాత్రమే ఇక్కడ ఒక ముఖ్యమైన పని. ఒకసారి అప్రూవల్ తరువాత యాడ్స్ మని కలెక్షన్ మరియు ట్రాన్స్ఫర్ లాంటి అన్ని పనులు ఆటోమాటిక్ గా జరిగే వెసులుబాటు గూగుల్ ఇస్తుంది.
ఫ్రీ బ్లాగ్ బిల్డింగ్ టూల్స్ మరియు ఇతర టూల్స్ వుపయోగించి మీరు మీ స్టార్ట్ చేసి వుంటే మీకు AdSense అప్రూవల్ దొరికే అవకాశాలు గూగుల్ Adsense రూల్స్ మరియు రెగ్యులేషన్ లోబడి ఉంటాయి. కాబట్టి మీరు మీ బ్లాగ్ మని గూగుల్ Adsense గా నిర్ణయించుకుంటే మీరు మీ బ్లాగ్ సెల్ఫ్ హోస్టెడ్ బ్లాగ్ గా చూసుకోవడం మంచిది.
9 Ways To Earn Money From Blogging In Telugu
2. Adsense ప్రత్యామ్నాయ మార్గాలు
మీరు ఎంచుకున్న బ్లాగ్ టాపిక్(నిచ్చే) ఎక్కువ ట్రాఫిక్ కలిగిన సబ్జెక్టు అయితే మీరు AdSense మాత్రమే కాకుండా ఇతర యాడ్ నెట్వర్క్ లను కూడ ప్రయత్నిచవచ్చు. చాలా వరకు రూల్స్ మరియు ప్రొసీజర్ అంతా Google Adsense మాదిరిగానే వుంటాయి.
వాటిలో బాగా పాపులర్ సర్వీసులను చూస్తే
Media.net,
infolink.com
chitika.com
Adsense తో పోలిస్తే ఈ ad network ల ద్వారా సంపాదన ఎక్కువ ఉన్నపటికీ అప్రూవల్ ప్రొసెస్ కొంచెం కటినముగా వుండే అవకాశం వుంటుంది.
మరిన్ని వివరాల కోసం ఈ క్రింద ఇచ్చిన లింక్స్ ద్వారా మీరు తెలుసుకోవచ్చు.
Media.net
Infolinks.com
https://www.infolinks.com/login/
9 Ways To Earn Money From Blogging In Telugu
3. బ్లాగ్ యాడ్ స్పేస్ ని అమ్మడం
యాడ్ రెవెన్యూ విషయములో Google Adsense మరియు ఇతర MCN (Media.com, chitika.com) ద్వారా ఇన్కమ్ చాలా వరకు బ్లాగ్ కెరియర్ మొదట్లో వచ్చినప్పటికీ ఈ రకమైన సంపాదనలో చాలా వరకు మన కంట్రోల్ లో లేని ఎన్నో విషయాలు మన సంపాదనను ప్రభావితము చేస్తూ వుంటాయి.
ఈ నెట్వర్క్స్ డిసైడ్ చేసే CPC విలువ ప్రతి నిమిషము మారుతూ ఉంటుంది. అదేవిధముగా పెద్ద సంఖ్యలో మన బ్లాగ్ విసిట్ చేసే రీడర్స్ యాడ్ మీద క్లిక్ చేయకపోతే మన సంపాదన బాగా దెబ్బ తినే అవకాశము వుంది.
ఇలాంటి విషయాలను దాటి మీ బ్లాగ్ యాడ్ రెవెన్యూ పెంచుకోవడానికి మీ బ్లాగ్ లోని స్పేస్ ని మీరే డైరెక్టుగా అడ్వర్టైజర్ లకు బ్యానర్ యాడ్ ల కోసం అమ్మవచ్చు. గూగుల్ AdSense(MCN) మధ్యవర్తుల మీద ఆధారపడకుండా వారికి ఎటువంటి కమిషన్ ఇవ్వకుండా మంచి మొత్తం లో మనీ సంపాదించడానికి ఇక్కడ వీలు ఉంటుంది.
మీకు తెలుసా!! Google Adsense కంపెనీల దగ్గర కలెక్ట్ చేసే అమౌంట్ లో మీకు ఇచ్చే యాడ్ రెవెన్యూ షేర్ 68%. 32% గూగుల్ సర్వీస్ ఛార్జ్ గా తీసుకుంటుంది.
ఈ విధానంలో మీరు మీ వెబ్సైట్ లో కంపెనీల యాడ్ లను చూపించడానికి కొన్ని plug-in లను మీరు మీ వెబ్ సైట్ కి యాడ్ చేసుకోవాల్సి ఉంటుంది.
మీరు డైరెక్ట్గా కంపెనీల తో డీల్ చేయడము ద్వారా మీ రీడర్స్ కి అనువైన యాడ్ రెవెన్యూ విధానము (CPC or CPM) మీరు ఎంచుకునే అవకాశము వుంటుంది.
ఎక్కువమంది ఈ విధానంలో CPM యాడ్ లను ఎంచుకుంటారు. ఎందుకంటే క్లిక్ ఆధారంగా యాడ్ రెవెన్యూ లెక్కించడం కన్నా యాడ్ ని చూపించే సమయం(రోజులు లేదా గంటలు) లేదా యాడ్ డిస్ప్లే చేసే ప్లేస్ ఆధారముగా కంపెనీలకు ఛార్జ్ చేయడం సులభము.
ఇక్కడ మీరు గుర్తుంచుకోవాల్సిన ఒక ముఖ్యమైన విషయం Google Adsense రెవెన్యూ కోసము మీరు మీ బ్లాగ్ లో చిన్న కోడ్ యాడ్ చేయడం ద్వారా Adsense రెవెన్యూ ప్రారంభం అవుతుంది. ఇంకఇతర పనులుపెద్దగా ఏమి ఉండవు. కానీ మీరు సొంతంగా యాడ్ స్పేస్ లను అమ్మడానికి డిసైడ్ చేస్తే మాత్రము మీ సైడ్ నుంచి చాలా పనులు మీరే స్వయముగా చేసుకోవాల్సి వుంటుంది. అంటే మార్కెటింగ్ కంపెనీలను కన్విన్స్ చేయడం, రేట్ ఫిక్స్ చేసుకోవడం, యాడ్ లను డిజైన్ చేయడం వెబ్సైట్లో పోస్ట్ చేయడం పేమెంట్ కలెక్ట్ చేసుకోవడం యాడ్ లకు సంబంధించిన ఇన్ఫర్మేషన్ స్టాట్స్ కంపెనీలకు అందిచడము ఇలాంటివి అన్నమాట.
ముఖ్య గమనిక ఏమిటంటే మీరు మీ బ్లాగ్ కెరీర్ మొదట్లో గూగుల్ Adsense లాంటి సర్వీస్ ఎంచుకొని మీ బ్లాగ్ కి మంచి సంఖ్యలో రీడర్స్ రావడము స్టార్ట్ అయిన తరువాత మాత్రమే ఈ విధానము ఎన్నుకోవాలి. లేకుంటే మీరు విలువైన సమయము ఎక్కువ ఈ యాడ్ అందించే కంపెనీల కోసము వృధా చేస్తూ మీ బ్లాగ్ కి సంబంధించిన చాలా ముఖ్యమైన పనులు నెగ్లక్ట్ చేసే అవకాశము వుంది.
9 Ways To Earn Money From Blogging In Telugu
4. Paid Content & Reviews
చాలా సందర్భాలలో మీ వెబ్ సైట్ లో google Adsense లాంటి యాడ్ నెట్వర్క్ల ద్వారా గాని లేదా మీరు సొంతంగా యాడ్ స్పేస్ లను అమ్మడం ద్వారా గాని చూపించే అడ్వర్టైజ్మెంట్లు ఆడియెన్స్ ను విసిగించి ఇబ్బంది పెట్టే అవకాశాలు ఉన్నాయి. ఇలాంటి సమయాలలో మీరు ఈ విధానం అనుసరించవచ్చు.
Paid Content
ఉదాహరణకి మీరు బరువు తగ్గించుకోవడం అనే సమస్యకి సంబంధించిన బ్లాగ్ నడుపుతున్నారు అనుకున్నాం. ఇక్కడ మీరు మీ లొకాలిటీ లో బరువు తగ్గే విషయాలు సంబంధించిన ఏదైనా ప్రోడక్ట్ లేదా సర్వీసులను అందించే కంపెనీతో ఒప్పందం చేసుకుని వాళ్ళ యొక్క ప్రోడక్ట్ లేదా సర్వీస్ సంబంధించిన విషయం గురించి ఆర్టికల్ రాస్తూ ఆ ప్రోడక్ట్ లేదా సర్వీసులను మీరు మీ బ్లాగ్ పోస్టులో మెన్షన్ చేయడం ద్వారా మనీ సంపాదించడం.
అంటే మీరు నేరుగా గా ప్రొడక్ట్ లేదా సర్వీసులను అందించే కంపెనీ మెన్షన్ ఆ కంపెనీ అందించే పరిష్కార మార్గానికి సంబంధించిన సమస్యని మరియు దానికి ఉన్న ఇతర పరిష్కార మార్గాలను ఆర్టికల్ గా రాయడం.
ఈ విధానంలో లో 2 వ విధానము
Paid Reviews
పైన చెప్పిన paid Content విధానంలో సమస్య మరియు పరిష్కార మార్గాలు లాంటి బ్లాగ్ పోస్ట్ రాస్తూ స్పాన్సర్ యొక్క పేరుని అంతర్లీనంగా చెబుతూ ఉంటాము.
కానీ paid Reviews విధానంలో మీరు స్పాన్సర్ యొక్క ప్రోడక్ట్ నేరుగా రివ్యూ చేసి ఇ దానికి సంబంధించిన మంచి చెడులను చెబుతూ మీ స్పాన్సర్ యొక్క సర్వీస్ ని ప్రమోట్ చేస్తారు.
9 Ways To Earn Money From Blogging In Telugu
5. Affiliate Marketing
అఫిలియేట్ మార్కెటింగ్ అంటే మీ ఆడియన్స్ కి మీరు ఏదైనా ప్రోడక్ట్ ను కానీ సర్వీసును గాని టెక్స్ట్ లింక్ రూపంలో రెకమెండ్ చేసినప్పుడు వారు ఆ లింక్లను క్లిక్ చేయడం ద్వారా మీరు రికమెండ్ చేసిన ప్రోడక్ట్స్ లేదా సెర్విసులను కొనడం ద్వారా మీరు పొందే కమిషన్.
ఇంకా క్లుప్తంగా చెప్పాలంటే మీ కంటెంట్ లో ఉండే లింక్లను క్లిక్ చేయడం ద్వారా మీకు వచ్చే సంపాదన.
అఫిలియట్ మార్కెటింగ్ ద్వారా మీరు ప్రమోట్ చేసే కొన్ని ప్రొడక్ట్స్ ల మీద కొన్నిసార్లు కమిషన్ 70, 80, 90 శాతం గా కూడా ఉంటుంది.
మనీ సంపాదించడం లో అత్యంత లాభదాయకమైన విధం ఈ అఫిలియేట్ మార్కెటింగ్ విధానము.
అతి తక్కువ పెట్టుబడి తో సబ్జెక్ట్ ఎక్స్పర్ట్ కాకపోయినా తేలికపాటి రీసెర్చ్ చేసి మీ ఆడియన్స్కి అవసరమైనటువంటి మరియు తగినటువంటి కంటెంట్ అందించడం ద్వారా మీ కమిషన్ లక్షల్లోకి పెంచుకునే అవకాశం ఉంది.
అఫిలియేట్ మార్కెటింగ్ గురించి మీరు ఇంకా మరిన్ని వివరాలు తెలుసుకోవాలి అనుకుంటే అఫిలియేట్ మార్కెటింగ్ తెలుగు 2021 బ్లాక్ పోస్ట్ ని మీరు రెఫర్ చేయవచ్చు. ఈ బ్లాగ్ పోస్ట్ అఫిలియట్ మార్కెటింగ్ గురించిన అన్ని బేసిక్ వివరాలు పొందుపరచడానికి ప్రయత్నము చేస్తున్నాము.
మీరు ప్లేట్ మార్కెటింగ్ ద్వారా మనీ సంపాదించడం మీ ముఖ్య ఉద్దేశంగా అనుకున్నప్పుడు మీరు ఈ కింద ఇచ్చిన మూడు సైట్లలో ఉండే ప్రొడక్టులను ప్రమోట్ చేయడం స్టార్ట్ చేయొచ్చు.
9 Ways To Earn Money From Blogging In Telugu
6. Membership Sites
మీ బ్లాగ్ కంటెంట్ ద్వారా మాత్రమే కాకుండా ఇంకా బాగా డెప్త్ వున్న కంటెంట్ క్రియేట్ చేసి మీ ఆడియన్స్కి అందించి సబ్స్క్రిప్షన్ ఫీస్ పొందవచ్చు. ఇంటర్నెట్ లో దొరకని కంటెంట్ ఏమి లేకపోయినప్పటికీ మీ ఆడియన్స్ లేదా రీడర్స్ కి అవసరమైన మరియు అనువైన కంటెంట్ అందించి వారు మని పే చేసే కెపాసిటీ లో ఆకర్షించడము తో ఈ విధానములో కూడా మనము మంచి మొత్తములో మని సంపాధించవచ్చు .
ఉదాహరణకి మీ రీడర్స్ అవసరమైన కంటెంట్ ఈ క్రింద చెప్పిన ఫార్మట్స్ లో అమ్మి కూడా మీరు మని సంపాదించవచ్చు.
downloads
వీడియోస్
ఆడియో ఫైల్స్
Worksheets
Mindmaps
ఇలాంటి డెడికేటెడ్ సర్వీసుల ద్వారానే కాకుండా
Forum లేదా Question & Answer sites క్రియేట్ చేసి యూజర్ జనరేటెడ్ కంటెంట్ ద్వారా ప్రీమియం కంటెంట్ ని క్రియేట్ చేసి దాని ద్వారా కూడా మీరు మనీ సంపాదించవచ్చు. ప్రీమియం మెంబర్స్ మాత్రమే ఈ ప్రైవేట్ ఫోరం మరియు Q&A సెక్షన్ అందుబాటులో ఉంచడం ద్వారా మనీ సంపాదించవచ్చు.
ఈ విధానంలో మీరు కంటెంట్ జనరేషన్ కి క్రియేట్ చేయడానికి చాలా చాలా ఎక్కువ ప్రయత్నాలు చేయవలసి ఉంటుంది ఎందుకంటే ఇక్కడ మీ ఆస్తి మీ పెట్టుబడి మీ వ్యాపారం అంతా మీరు క్రియేట్ చేసిన లేదా మీ ఆడియన్స్ క్రియేట్ చేసిన కంటెంట్ మాత్రమే మీ ఆడియన్స్ సబ్స్క్రిప్షన్ ఫీస్ మీరు లేదా మీ కంటెంట్ క్వాలిటీ మీద క్వాంటిటీ మీద ఆధారపడి ఉంటుంది.
9 Ways To Earn Money From Blogging In Telugu
7. Directory Website
మీరు ఎప్పుడైనా టెలిఫోన్ డైరెక్టరీ మీరు చూశారా ఇప్పటి కాలం లో టెలిఫోన్ డైరెక్టరీ లా అవసరం చాలా తగ్గిపోయింది ఎందుకో మనందరికీ తెలుసు ఇంటర్నెట్ స్మార్ట్ఫోన్ కారణంగా.
కానీ నీ మీరు బాగా ఆలోచన చేస్తే మీ ఏరియాలో ఉన్న ఒక్క విషయానికి సంబంధించిన అన్నింటికీ ఒకే దగ్గర అ ఉండేలా అనేక సైట్లు వచ్చాయి.
బస్సుల కోసం abhibus redbus
హోటల్ మరియు ఫుడ్ ల కోసం Zomtato Swiggy
వధూవరుల కోసం మ్యాట్రిమోనియల్ సైట్స్
జాబ్ కోసం జాబ్ sites
హరి ఇలాంటి ఏదైనా ఒక సైట్ క్రియేట్ చేయాలి అని అనుకుంటే మీకు wordpress మరియు blogging అలాంటి అవకాశాన్ని ఇస్తుంది.
కానీ Zomato Swiggy Naukri redbus లాంటి సర్వీసులను డైరెక్టరీ లను అందించడం చాలా కష్టం తో మరియు పెద్ద మొత్తంలో పెట్టుబడి తో కూడుకున్న పని.
కానీ నీ ఒంటరిగా మీరు ఆన్లైన్లో మనీ సంపాదించడానికి బ్లాగింగ్ ద్వారా ఈ డైరెక్టరీలో బిజినెస్ నడపడానికి వీలు ఉంది.
ఉదాహరణకి మీ నగరంలో లేదా పట్టణంలో చుట్టూ ఉన్న స్కూల్స్ యొక్క ఇన్ఫర్మేషన్ ని డైరెక్టర్ ల రూపంలో మీ లోకల్ లో ఉన్న మీ ఆడియన్స్కి అందించడం.
ఇక్కడ మీరు స్కూల్స్ కి పబ్లిసిటీ చేయడానికి అదే మాదిరి ఇ మీ ఆడియన్స్ అవసరాలకు తగిన సమయంలో తగిన విధంగా సహాయం చేయడానికి వీలవుతుంది.
ఇంకా గవర్నమెంట్ జాబ్ ఇతర రియల్ ఎస్టేట్ కి సంబంధించిన అమ్మకాలు కొనుగోలు అద్దెలు అలాంటి విషయాలను కూడా మీరు డైరెక్టర్ ఈ రూపంలో మీ ఆడియన్స్ కి అందించవచ్చు.
9 Ways To Earn Money From Blogging In Telugu
8. Selling Services
బ్లాగ్ ద్వారా మీ ప్రతిభను మరియు ప్రావీణ్యాన్ని సర్వీసులను ఇతరులకు అమ్మడం ఒకింత సులభము.
బ్లాగ్ అనేది మీ సర్వీసుల బిజినెస్ కి ఒక ఆన్లైన్ అడ్రస్ గా మరియు మీ మీద మీ స్కిల్ మీద ఒక మంచి అభిప్రాయం రావడానికి మరియు మిమ్మలిని మీ స్కిల్ ని మార్కెట్ చేసుకోవడానికి అవకాశం కలిగిస్తుంది.
మీరు మీ బ్లాగ్ ద్వారా మీ నాలెడ్జి మరియు మీ స్కిల్ నీ మీ కస్టమర్లకు తెలియ చెప్పడం సులభము.
Freelancing సర్వీసుల అమ్మడం
Consulting సర్వీసులు అమ్మడం
Online కోచింగ్(Webinar)
9 Ways To Earn Money From Blogging In Telugu
9. Selling Products
బ్లాగ్ ద్వారా మని సంపాదనలో పెద్ద మొత్తము సంపాదనకి అవకాశము వున్న మార్గము ఈ సెల్లింగ్ ప్రొడక్ట్స్ ఒకటి.
మీరు మీ బ్లాగ్ కంటెంట్ ఆధారముగా ఫిజికల్ ప్రొడక్ట్స్ మరియు డిజిటల్ ప్రోడక్ట్స్ సులభముగా అమ్మవచ్చు.
మీ బ్లాగ్ కంటెంట్ ఆధారముగా
E Books
Video courses
PDFs
Charts
Sheets
ఇతర ఆర్ట్ కి సంబంధించిన ప్రత్యేకమైన వస్తువులు ఇంకా మసాలాలు ఊరగాయలు గ్రామములో మన ప్రాచీన వంటకాలు స్వీట్లు ఇంకా మీరు చేసే కొత్త డిజెనర్ డ్రెస్ లు.
ఇంకొక సులభమైన విధానము
9 Ways To Earn Money From Blogging In Telugu
ReSelling
బ్లాగ్ ల నుంచి మని సంపాదన మార్గాలలో పైన చెప్పిన వాటిలో మీకు ఇంకా ఒక క్లారిటీ రాకపోతే ఇంకోక సులభమైన మార్గం, మీరు మీ బ్లాగ్ ని ఇతరులకు లేదా ఇతర బిజినెస్ లకు అమ్మడం ద్వారా మని సంపాదించవచ్చు.
కాబట్టి మీరు మీ బ్లాగ్ క్రియేట్ చేసేటప్పుడు మరియు నిర్మించేటప్పుడు మీరు ఈ ఐడియాని లెక్కలోకి తీసుకోని ప్రారంభించడం మంచిది.
ఎందుకంటె బ్లాగ్ అమ్మడానికి నిర్మించడం అనేది బ్లాగింగ్ కెరీర్ కోసం బ్లాగ్ నిర్మించడం అనేది రెండు వేరు వేరు విషయాలు.
కాబట్టి మీ బ్లాగ్ అమ్మకము అనే బిసినెస్ బ్లాగ్ తయారుచేసి అమ్మడము అనేది కొంచెం షార్ట్ టర్మ్ బిజినెస్. మిగిలిన వాటితో పోలిస్తే ఇది చాలా సులభమైనది. మీ టెక్నికల్ నాలెడ్జ్ మరియు మార్కెటింగ్ స్కిల్ ఆధారము చేసికొని అపరిమితమైన సంపాదనకు అవకాశము వున్న ఒక విషయము.
9 Ways To Earn Money From Blogging In Telugu
Blogging Beginners Guide in Telugu – Click Here
7 Stages To Earn Money From Blogging In 2024 – Click Here
Tags : 9 Ways To Earn Money From Blogging In Telugu,9 Ways To Earn Money From Blogging In Telugu,9 Ways To Earn Money From Blogging In Telugu,9 Ways To Earn Money From Blogging In Telugu,9 Ways To Earn Money From Blogging In Telugu,9 Ways To Earn Money From Blogging In Telugu,9 Ways To Earn Money From Blogging In Telugu,9 Ways To Earn Money From Blogging In Telugu,9 Ways To Earn Money From Blogging In Telugu,9 Ways To Earn Money From Blogging In Telugu,9 Ways To Earn Money From Blogging In Telugu,9 Ways To Earn Money From Blogging In Telugu,9 Ways To Earn Money From Blogging In Telugu, Earn Money From Blogging In Telugu
Leave a comment