AP Free Bus Journey Scheme 2024

Table of Contents

Telegram Channel Join Now
WhatsApp Channel Join Now

AP Free Bus Journey Scheme 2024

ఏపీలో మహిళలకు గుడ్ న్యూస్.. ఉచిత బస్సు ప్రయాణం ఎప్పుడో చెప్పిన మంత్రి

    ఉచిత బస్సు ప్రయాణంపై ఏపీ ప్రభుత్వం కీలక అప్ డేట్ చెప్పింది. ఏపీలో ఎప్పటి నుంచి ఈ విధానం అమల్లోకి వస్తుందనే దానిపై క్లారిటీ ఇచ్చింది. మరో నెలరోజుల్లోగా ఏపీలో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం పథకం అమలుచేస్తామని మంత్రి రాంప్రసాద్ రెడ్డి చెప్పారు. త్వరలోనే హామీ అమలుపై కమిటీ వేస్తామని.. అధ్యయనం చేసి నివేదిక సమర్పించిన తర్వాత పథకాన్ని అమలు చేస్తామన్నారు. నెలరోజుల్లోగా ఈ ప్రక్రియ పూర్తిచేస్తామని వెల్లడించారు.

AP Free Bus Journey Scheme 2024

ఏపీలోని మహిళలకు ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. ఎప్పుడెప్పుడు ప్రారంభమవుతుందా అని ఎదురుచూస్తున్న ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణం పథకంపై కీలక అప్‌డేట్ ఇచ్చింది. ఎన్నికల ప్రచారం సమయంలో టీడీపీ, జనసేన కూటమి ఈ హామీ ఇచ్చింది. ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఫ్రీ జర్నీ కల్పిస్తామని సూపర్ సిక్స్ హామీల్లో కూడా చేర్చింది.

దీంత ఎన్నికల్లో మహిళా ఓటర్లు కూడా టీడీపీ కూటమికి అనుకూలంగా ఓటేశారని చెప్పొచ్చు. అయితే ఎన్నికల్లో గెలిచి టీడీపీ కూటమి అధికారంలోకి వచ్చింది. ముఖ్యమంత్రిగా చంద్రబాబు, మంత్రులుగా ఇతర నేతలు కూడా కొలువుదీరారు. ఈ నేపథ్యంలో పథకాన్ని ఎప్పుడు ప్రారంభిస్తారా అని మహిళలు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

ap free bus scheme
ఈ నేపథ్యంలోనే ఏపీ రవాణాశాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి కీలక అప్ డేట్ ఇచ్చారు. నెలరోజుల్లోగా ఏపీలో మహిళలకు ఆర్టీసీ బస్సుల్లో ఉచితంగా ప్రయాణం కల్పిస్తామని చెప్పారు. దీనిపై ఇప్పటికే అధికారులు కసరత్తు చేస్తున్నట్లు చెప్పారు. ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణంపై అధ్యయనం 15 రోజుల్లోగా కమిటీని ఏర్పాటు చేస్తామన్నారు. ఇప్పటికే ఈ విధానం అమల్లో ఉన్న కర్ణాటక, తెలంగాణలో ఈ కమిటీ పర్యటించి పథకాన్ని ఎలా అమలు చేయాలనేదానిపై అధ్యయనం జరుపుతుందన్నారు.

కమిటీ నివేదిక వచ్చిన తర్వాత ఉచిత బస్సు ప్రయాణాన్ని అమలు చేస్తామన్నారు. అలాగే దూరప్రాంతాలకు వెళ్లే బస్సుల సంఖ్యను పెంచుతామని, ఎలక్ట్రిక్ బస్సులు కొనుగోలు చేస్తామని చెప్పారు. ఇక విజయవాడ బస్టాండులో గురువారం ఆకస్మిక తనిఖీలు చేసిన మంత్రి.. ఆర్టీసీ సిబ్బందికి పలు సూచనలు చేశారు.

Vijayawada floods Report
ఏపీలో వరద నష్టంపై కేంద్రానికి నివేదిక పంపిన ప్రభుత్వం

మరోవైపు ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణం హామీ ఇప్పటికే కర్ణాటక, తెలంగాణ ప్రభుత్వాలు అమలు చేస్తున్నాయి. కర్ణాటకలో మహిళలకు స్మార్ట్ కార్డులు జారీచేయగా.. తెలంగాణలో మాత్రం జీరో టికెట్ల విధానం అనుసరిస్తున్నారు. అలాగే గుర్తింపు కార్డులు చూసి జీరోటికెట్లు ఇస్తున్నారు.

AP Free Bus Journey Scheme 2024

ఈ టికెట్ల ఆధారంగా ప్రభుత్వం ఆర్టీసీకి చెల్లింపులు జరుపుతోంది. అయితే తెలంగాణలో మాదిరిగా మొత్తం రాష్ట్రవ్యాప్తంగా ఉన్న ఎక్స్ ప్రెస్, పల్లెవెలుగు బస్సుల్లో ఈ పథకాన్ని అమలుచేస్తారా… లేదా జిల్లాల లోపలి సర్వీసులకు మాత్రమే అమలు చేస్తారా అనేది ఆసక్తికరంగా మారింది.

More Links :

NTR Bharosa Pension Scheme Details 2024 – Click Here

కూటమి ప్రభుత్వ మ్యానిఫెస్టోలో ఉన్న ముఖ్య పథకాల వివరాలు – Click Here

PM Kisan 18th Installment Date 2024 Telugu
PM కిసాన్ 18వ విడత తేదీ 2024: చెల్లింపు స్థితి, లబ్ధిదారుల జాబితా

Ap New Scheme for Women – Click Here

Ap Government Super 6 Updates – Click Here

Tags : AP Free Bus Journey Scheme 2024, AP Free Bus Journey Scheme 2024, AP Free Bus Journey Scheme 2024, AP Free Bus Journey Scheme 2024, ap free bus scheme, ap free bus scheme 2024, free bus in ap for ladies, free bus for ladies in ap latest news, free bus in ap for ladies, free bus in ap date,

Event Details
AP Free Bus Date First week of July 2024

4.4/5 - (17 votes)

ప్రభుత్వ పథకాలు, ప్రభుత్వ ఉద్యోగాలు, ప్రైవేట్ కంపెనీ ఉద్యోగాల గురించి రోజువారీ సమాచారాన్ని పొందడానికి మా వాట్సాప్ ఛానెల్‌లో మరియు టెలిగ్రామ్ ఛానెల్‌లో చేరండి

Telegram Channel Join Now
WhatsApp Channel Join Now

Related Job Posts

Vijayawada floods Report

ఏపీలో వరద నష్టంపై కేంద్రానికి నివేదిక పంపిన ప్రభుత్వం

PM Kisan 18th Installment Date 2024 Telugu

PM కిసాన్ 18వ విడత తేదీ 2024: చెల్లింపు స్థితి, లబ్ధిదారుల జాబితా

Anganwadi Recruitment 2024 Kadapa

అంగన్వాడీ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ 2024 | దరఖాస్తు ప్రక్రియ & చివరి తేదీ

Leave a comment