Blogging Beginners Guide in Telugu
Start Blogging In Telugu 2024 – A Blog Beginners Guide
బ్లాగింగ్ అనేది ఆన్లైన్ మని సంపాదనలో ఒక పాపులర్ మార్గము. మనలో చాలా మంది ఈ కెరీర్ స్టార్ట్ చేద్దాము అని ఆలోచన చేస్తూ ఉంటాము. బ్లాగింగ్ అంటే ఏమిటి అనే విషయములో మనలో చాలా మందికి క్లారిటి ఉండక పోవచ్చు. నేను చూసిన అన్ని నిర్వచనాలలో ఆన్లైన్ డిక్షనరీ thesaurus లో ఇచ్చిన డెఫినిషన్ బెస్ట్ గా బ్లాగ్ గురించి వివరిస్తుంది.
బ్లాగు నిర్వచనము
“మీ లేదా మీ గ్రూపు అనుభవాలను పరిశీలలను మరియు అభిప్రాయాలను ఫోటోలు మరియు ఇతర వెబ్సైటులకు లింక్ల సహాయముతో వివరించే ఒక వెబ్సైటు.”
ఈ నిర్వచనము ప్రకారము బ్లాగ్ అనేది ఒకరు లేదా ఒక గ్రూప్ రచయితలు వారి యొక్క అనుభవనాలను, పరిశీలనలు మరియు అభిప్రాయాలను ఇమేజ్ మరియు ఇతర వెబ్సైటు కంటెంట్ కు లింక్ల ద్వారా అందించే ఒక వెబ్సైటు.
ఇంత కన్నా సింపుల్ గా సూపర్ గా బ్లాగ్ గురించి ఎవరు వివరించగలరు. ఈ నిర్వచనములో చెప్పినట్టు మీ బ్లాగ్ అంటే
- మీ అనుభవాలు
- మీ పరిశీలనలు మరియు
- మీ అభిప్రాయాలు……
ఈ విషయాలను చెప్పడానికి మీరేమి మీరు ఎంచుకున్న సబ్జెక్ట్ లో మాస్టర్ లేదా ఎక్స్పర్ట్ కానక్కర్లేదు. మీ నాలెడ్జ్ మీ రీడర్స్ కి అర్థము అయ్యే విధముగ పదాలు వాక్యాలు ఫోటోలు వీడియోలు గ్రాఫులు చార్టుల తో ఆకర్షించే విధముగ ప్రజెంట్ చేసే కెపాసిటీ వుంటే చాలు మీరు బ్లాగింగ్ కెరీర్ స్టార్ట్ చేయడానికి అర్హులు.
బ్లాగ్ గురించి ఇంకా వివరముగా మాట్లాడుకోవాలంటే ఈ క్రింద ఇచ్చిన నిర్వచనం పరిగణలోనికి తీసుకుంటే
బ్లాగ్ అనేది ఒక ఎంచుకున్న ముఖ్యమైన టాపిక్ చుట్టూ తిరిగే ఎడిటోరియల్ కంటెంట్ (సవివరముగా వ్రాయపడిన). అంటే ఎంచుకున్న టాపిక్ గురించి డీప్ గా రీసర్చ్ చేసి మీ ఆలోచనలను అభిప్రాయలను మరియు పరిశీలనను ఆన్లైన్ లో చెప్పడము.
Blogging Beginners Guide in Telugu
1. బ్లాగింగ్ కెరీర్ ఎవరు ఎంచుకోవచ్చు.?
పైన ఇచ్చిన బ్లాగ్ నిర్వచనము లో చెప్పినట్టు ఎదైనా విషయము గురించి మీ పరిశీలనలను, అభిప్రాయాలను, ఆలోచనలను ఇతరులతో పంచుకోవాలి అనుకునే ఎవరైనా బ్లాగింగ్ కెరీర్ స్టార్ట్ చెయవచ్చు. కాని ఆ బ్లాగ్ టాపిక్ చదవడానికి తెలుసుకోవడానికి ఆన్లైన్ లో ట్రాఫిక్ (రీడర్స్) వుంటే మీ బ్లాగింగ్ కెరీర్ బాగా క్లిక్ అవుతుంది. మీకు మీరు ఎంచుకున్న టాపిక్ బాగా లోతుగా నాలెడ్జ్ లేకపోయినా మీరు రీసెర్చ్ చేస్తూ, ట్రై చేస్తూ మరియు తెలుసుకుంటూ మీ రీడర్స్ కి అంధించడము ద్వారా మీరు విజయవంతం కావచ్చు.
ఆన్లైన్ లో ఇంటెర్నెట్ యూజర్లు వెతకని విషయము అంటూ ఏమీ ఉండదు. ఒక్కొక్కరి అవసరము మరియు ఒక్కొక్కరి ఆసక్తి ఒక్కోక్క విధము. కాబట్టి దగ్గర దగ్గర ప్రపంచములో వున్న అన్ని విషయాల గురించి బ్లాగింగ్ చేయడానికి అవకాశము వుంది.
బ్లాగింగ్ అంటే కంటెంట్, అంటే మీ నాలెడ్జ్ ని ఆన్లైన్ ప్లాటుఫారంలలో text, image & video రూపములో పొందుపరచడం. వ్రాయడము మరియు కంటెంట్ క్రియేట్ చేయడములో ఖచ్చితమైన ఆసక్తి వున్నవారు మాత్రమే ఈ కెరీర్ లో విజయము సాధించగలరు. ఇతరుల సమస్యలను అర్థము చేసుకుని వారికి పరిష్కార మార్గాలను అందించడములో ఆసక్తి కలిగి వుండటము బ్లాగర్స్ వుండవలిసిన ఇంకొక ముఖ్య లక్షణము.
బ్లాగింగ్ అనేది ఇంటర్నెట్ బిజినెస్ లేదా ఒక ప్రొఫెషనల్ కెరీర్. కాబట్టి గంటల కొద్ది ఇంటెర్నెట్ లో సమయము వెచ్చించగలవారు కూడ ఈ ఆన్లైన్ బ్లాగింగ్ కెరీర్ ఎంచుకోవచ్చు.
Blogging Beginners Guide in Telugu
2. బ్లాగింగ్ కెరీర్ ఎందుకు?
Firstsiteguide.com వారు నిర్వహించిన ఒక సర్వే (స్క్రీన్ షాట్) లో చెప్పినట్టు ఈ క్రింద ఇచ్చిన కారణాల కోసము ఎక్కువ మంది బ్లాగింగ్ కెరీర్ ఎంచుకుంటునట్టు తెలుస్తుంది.
telugu blogging online money
బ్లాగింగ్ చేసే వారిలో ఎక్కువ మంది ఈ క్రింద చెప్పిన 5 కారణాల కోసము బ్లాగింగ్ కెరీర్ స్టార్ట్ చేస్తున్నారు.
- డబ్బు సంపాదన
- సబ్జెక్టు లో వుండే interest లేదా passion
- ఫేమస్/ ఎక్స్పర్ట్ కావడం కోసము
- సంబంధిత సబ్జెక్టు లో అవసరమైన వారికీ సహాయ సహకారాలు అందించడము కోసము
- ఎంచుకున్న సబ్జెక్టు లో స్కిల్ లేదా నాలెడ్జి పెంచుకోవడానికి…..
మీ బ్లాగింగ్ కెరీర్ కి ఒక బలమైన కారణముతో స్టార్ట్ చేయడము కారణముగా కాన్ఫిడెంట్ గ ముందుకు సాగవచ్చు. మీరు బ్లాగింగ్ లక్ష్యము ఆధారముగ మీ బ్లాగ్ కంటెంట్ ప్లానింగ్ మరియు మోనేటైజషన్(బ్లాగ్ సంపాదన) ప్లాన్, బ్లాగ్ ప్రమోషన్ స్ట్రాటెజిఎస్ ఉంటాయి. కాబట్టి మీరు మీ బ్లాగింగ్ కెరీర్ స్టార్ట్ చేసేటప్పుడు మీ బ్లాగింగ్ పర్పస్ (అంతిమ లక్ష్యం) తెలుసుకోవడం చాల చాల అవసరం.
Money Earning
Blogging Beginners Guide in Telugu
3. మంచి డిమాండ్ వున్న బ్లాగ్ టాపిక్ ఎంచుకోవడము
firstsiteguide.com బ్లాగ్ లో ప్రచురించిన 2020 టాప్ 10 బ్లాగులు వాటి వార్షిక సంపాదన ఇక్కడ స్క్రీన్ షాట్ లో ఇవ్వడము జరిగింది.
- The Huffington post
- Mashable
- Perez Hilton
- Techcrunch
- Smashing Magazine
- Timothy Sykes
- Gothamist
- Tuts Plus
- CAR advise
- VENTURE BEAT
ఈ 10 బ్లాగ్స్ లో 5 బ్లాగులు న్యూస్ మరియు అప్ డేట్స్ కి సంబంచినవి, 2 వెబ్సైటు లు టెక్నాలజీ సంబంచినవి, ఇంకొక 2 వెబ్సైటులు రివ్యూ మరియు రేటింగ్ సంబంధించినవి.
ఈ టాప్ 10 వెబ్సైటు యొక్క రెవిన్యూ మోడల్ లలో ముఖ్యమైనవి గమనిస్తే అవి యాడ్ రెవిన్యూ, అఫిలియట్ కమిషన్, స్పాన్సర్డ్ కంటెంట్.
పోటీ పడే బ్లాగులు మరియు టాప్ బ్లాగులను అనలైజ్ చేసేటపుడు ఆ బ్లాగ్ కేటగిరీ(బ్లాగ్ టాపిక్) ఏమిటి ,ఆ కేటగిరీ లో వాళ్ళు ఏ ఏ టాపిక్స్ మీద కంటెంట్ రాస్తున్నారు, వారు బ్లాగ్ ద్వారా ఏ విధములో మనీ సంపాదిస్తున్నారు, ఎంత మని సంపాదిస్తున్నారు, వారి ప్రమోషనల్ స్ట్రాటెజీఎస్ ఏమిటి లాంటి విషయాలను పరిశీలించవచ్చు.
Blogging Beginners Guide in Telugu
4. ఏ ఏ విషయాలను బ్లాగింగ్ చేయవచ్చు?
ఏ ఏ ఈ విషయాలను బ్లాగింగ్ టాపిక్ గా ఎంచుకోవచ్చు? ఎంచుకున్న టాపిక్ లో ఏ ఏ కంటెంట్ వ్రాయాలి ? ఏ ఫార్మటు లో కంటెంట్ వ్రాయాలి ? ఆ కంటెంట్ ఎలా సెలెక్ట్ చేసుకోవాలి? లాంటి విషయాలు ఎక్కువ మంది బ్లాగింగ్ కెరీర్ స్టార్ట్ చేయాలి అనుకునేవారు ఎదురుకునే ఇబ్బందులు. ఈ ప్రశ్నలకి సమాధానాలు తెలుసుకోవాలంటే మీరు తెలుసుకోవలిసిన కొన్ని విషయాలు
బ్లాగులు 4 రకాలు
- Personal Blog
- Business Blog
- Niche Blog
- Authority Blog
- hobby Blogs & Lifestyle blogs
పర్సనల్ బ్లాగులు మరియు బిజినెస్ బ్లాగులు ప్రత్యేకమైన కారణం కోసం స్టార్ట్ చేసి నడుపుతుండేవి. పర్సనల్ బ్లాగులు మామూలుగా సొసైటీ లో పాపులర్ గా వున్నవారు,గౌరవనీయమైన పొజిషన్ లో వున్నవారు వారి ఫ్యాన్స్ లేదా ఫాలోవర్ మెయింటైన్ చేయడానికి మరియు రెగ్యులర్ గా అప్డేట్ లు ఇవ్వడానికి నడిపే బ్లాగులు. సినిమా యాక్టర్స్ మరియు రాజకీయ నాయకులు నడిపే బ్లాగులు ఈ కోవలోకి వస్తాయి.
బిజినెస్ బ్లాగులు బిజినెస్ కి సంబంధించిన ప్రొడక్ట్స్ లేదా సర్వీసుల విషయాలను కస్టమర్లకి అందించడానికి, వారికి వచ్చే సందేహాలను తీర్చే ఇన్ఫర్మేషన్ వారికి అందుబాటులో ఉంచటానికి, ప్రొడక్టులను ఆన్లైన్ లో మార్కెట్ చేయడానికి, ఎడ్యుకేట్ చేయడానికి, ప్రోడక్ట్ కి మరియు ఇతర విషయాలకి సంబంధించిన టిప్స్, సలహాలు అందించడానికి నడిపే బ్లాగులు. ఉదా: Ubersuggest బ్లాగు, Moz బ్లాగు, shopify బ్లాగు, e-commerce సైట్లు freelancers నడిపే బ్లాగులు
Niche blogs ఏదైనా ఎంచుకున్న ప్రత్యేకమైన సబ్జెక్టు టాపిక్ లో మీకు వున్న నాలెడ్జి మరియు అభిప్రాయాలను అవసరమైన వారికి అందిచడము. Niche Blogs నడిపే వారు ఆ ఆ సబ్జెక్టు లో పెద్దగా నాలెడ్జి లేకపోయినా వారు నేర్చుకుని స్యయముగా ప్రయత్నిస్తూ నేర్చుకున్న మరియు తెలుసుకున్న విషయాలను ఇంటర్నెట్ లో ఆ విషయాలు అవసరమైన వారికి షేర్ చేసి వాళ్ళ మన్నలనలను మరియు నమ్మకాన్ని పొందుతూ వుంటారు. ఉదా: వెయిట్ లాస్ కోసము నడిపే బ్లాగులు, సింగల్ పేరెంట్ బ్లాగులు, పర్సనల్ ఇన్వెస్ట్మెంట్ కి సంబంధించిన బ్లాగులు
అథారిటీ బ్లాగులు మరియు Niche blogs రెండు బ్లాగ్ టాపిక్ విషయములో దాదాపు సమానమైనవే అంటే ఎంచుకున్న ప్రత్యేకమైన సబ్జెక్టు లో కంటెంట్ షేర్ చేయడము. కానీ అథారిటీ బ్లాగ్ లలో బ్లాగర్ ఎంచుకున్న టాపిక్ లో ఎక్స్పర్ట్ గ వుండి వాళ్ళ అథారిటీ అంటే సబ్జెక్టు లో ఉన్నతమైన నాలెడ్జి వాళ్ళ బ్లాగ్ కంటెంట్ తో నిరూపించుకునే ప్రయత్నము చేస్తూవుంటారు. ఉదా: Neil Patel Blog(SEO), Patt Flyn(passive income)…
ఇంకా హాబీ మరియు lifestyle బ్లాగులు మన రోజువారీ జీవితములో జరిగే మరియు అవసరము అయ్యే మనము చేసే విషయాల గురించి ఆన్లైన్ లో షేర్ చేస్తూ ఫాలోయర్స్ మరియు ఫాన్స్ పెంచుకోవడము. ఉదా: ఫ్యాషన్, వంట వార్పులు …
మనలో చాలా మందికి వున్న అతి పెద్ద సమస్య కంటెంట్ క్రియేట్ చేయడము. ఈ క్రింద చెప్పిన 3 విధానాల ద్వారా మీ బ్లాగ్ కంటెంట్ ని ప్రిపేర్ చేయవచ్చు.
- Content Creation– మీరు ఎంచుకున్న టాపిక్ లో సొంతముగా మీ యొక్క నాలెడ్జి, అవగాహన, పరిశీలనలు మరియు అభిప్రాయాలను సరికొత్త కంటెంట్ గా తయారు చేయడము.
- Content Curation– వివిధ బ్లాగులు, వెబ్సైటు లలో వచ్చే కంటెంట్ కి మీ అభిప్రాయాలను మీ ఆలోచనలను చేర్చి తయారు చేయబడిన కంటెంట్.
- Content Aggregation– వివిధ సోర్స్ లలో వుండే మీరు ఎంచుకున్న టాపిక్ కి సంబంధించిన కంటెంట్ ని మీ రీడర్స్ కి సులభముగా అందే విధముగా అందిచడము. ఇక్కడ మీరు మీ అభిప్రయాలను మరియు ఆలోచనలను చేర్చే అవకాశము ఉండదు.
పైన చెప్పిన విధానములో మీకు అనువైన మీ రీడర్స్ ఆకర్షించే కంటెంట్ క్రియేట్ చేస్తూ మీ బ్లాగింగ్ కెరీర్ ని ముందుకు తీసుకుపోవచ్చు. మీకు తెలిసిన విషయాలని మీ బ్లాగ్ పోస్టులు గా వ్రాసిన తరువాత మీకు వచ్చే సందేహము ఇంకా నా రీడర్స్ నేను ఏమేమి కంటెంట్ ఇవ్వగలను అని. ఇలాంటి సందేహము వచ్చిన ప్రతి సారి మీరు మీ బ్లాగ్ డెఫినిషన్ ఒకసారి రిఫర్ చేస్తే మీకు మంచి మంచి ఐడియాలు వచ్చే అవకాశము వుంటుంది. ఇంకా ఐడియాల కోసము మీరు ఎంచుకున్న టాపిక్ లో వున్న బ్లాగర్స్ మరియు వాళ్ళ టాప్ బ్లాగ్ పోస్టులు రిఫర్ చేస్తే ఏమేమి విషయాలు మీ బ్లాగులో మీ రీడర్స్ కి అందించవచ్చో మీకు ఒక ఐడియా వస్తుంది. ఇంకా మరిన్ని ఐడియాల కోసము ఈ క్రింద చెప్పిన 25 రకాలైన కంటెంట్ మీ రీడర్స్ కోసము మీరు అందించే ప్రయత్నము చేయవచ్చు.
- Tips
- Tricks
- List
- Tactics
- Ask Me Anything
- FAQ(Q&A)
- How To
- Industry Updates
- Myths & Facts
- Data Analysis
- Trends
- Opinions
- Expert or Influencer Interviews
- Stories(Factual/Mythology/Old)
- Reviews
- Recommendations
- News
- Hints
- Alerts
- Community Management
- Offers & Discounts(Promos)
- Coaching
- Case Studies
- News-Letters
- Quotes
- Comparisons
- Testimonials
- Forums
- Contests
- Group News
- Events
- Motivational Stories
- Demos
- Checklists
- About Books
- About Courses
- About Tools
- About Movies
- E Book
- Podcasts
- Videos
- Infographs
ఇక్కడ మీరు ఒక విషయము బాగా గుర్తుంచుకోవాలి మీరు ఎంచుకునే ఏ కంటెంట్ ఫార్మాట్ అయిన మీరు ఎంచుకున్న బ్లాగ్ టాపిక్ అనుసరించి, మీ ఆడియెన్స్ ఇంటరెస్ట్ అనుసరించి మరియు మీరు మీ బ్లాగ్ లో ఫాలో అవుతున్న మీ సొంత స్టైల్ నుంచి ఎటువంటి డిస్టర్బ్ లేకుండా ట్రై చేస్తే మీ ఆడియెన్స్ మెచ్చే అవకాశాలు మెండుగా ఉంటాయి.
Blogging Beginners Guide in Telugu
5. బ్లాగింగ్ కెరీర్ అవసరమైయ్యే విషయాలు ఏమిటి ?
మీ బ్లాగింగ్ కెరీర్ విజయానికి అన్నిటికన్నా ముందు మీ బ్లాగింగ్ కెరీర్ స్టార్ట్ చేయడానికి ఒక బలమైన కారణము వుండాలి. అంటే ఒక లక్ష్యము. ఏ కారణం లేకుండా లేదా హాబీ కోసమో చేసే పని సంవత్సరాల తరపడి చేస్తూ పోవడము చాలా కష్టము. అందుకే మీ బ్లాగింగ్ కెరీర్ స్టార్ట్ చేయడానికి ఒక బలమైన కారణం వుండాలి.
బ్లాగింగ్ అనేది ఒక మారథాన్. చాలా కాలం పాటు సాగుతుంది. సహనము, ఓర్పు మరియు పట్టుదల లాంటి వ్యక్తిగత లక్షణాలు చాలా ముఖ్యము. ఇంకా మంచి క్రమశిక్షణ అవసరము. ఎందుకంటె ఇక్కడ బాస్ మెనేజర్ డెడ్లైన్ ఏమి ఉండవు. మీ వ్యక్తిగత లక్షణాలు మాత్రమే మిమ్మలిని విజయ తీరాల వైపు నడిపిస్తాయి.మీరు ఎంచుకున్న బ్లాగ్ టాపిక్ లో మీకు మంచి పట్టు మరియు గొప్ప నాలెడ్జ్ లేకపోయినా ఆ టాపిక్ లో మీకు మంచి శ్రద్ధ ఇంకా ఆసక్తి వుండాలి. లేకపోతే మీరు రీసెర్చ్ చేయడమూ, తెలుసుకోవడం మరియు పెద్ద పెద్ద బ్లాగ్ పోస్టులు వ్రాయడం చాలా కష్టము గా ఇబ్బందిగా మారే అవకాశం ఉంది.
సెల్ఫ్ కంట్రోల్ మరియు సెల్ఫ్ మోటివేషన్ ఇంకొక ముఖ్య విషయము. బ్లాగింగ్ స్టార్ట్ చేయడము సులభము అయిన విజయము సాధించడం కొంచెం కష్టము చాలా ఒడిదుడుకులు ఎన్నో ఎత్తుపల్లాలు కలిగిన ఒక ప్రయాణము. ఎవరు మిమ్మలిని ప్రోత్సహంచే స్థితి మరియు అవకాశము వుండదు. మిమ్మలిని మీరే మోటివేట్ ముందుకు సాగాలి.
బ్లాగింగ్ పూర్తీగా ఇంటెర్నెట్ కి సంబంధించిన ఒక విషయం. కాబట్టి ఇంటెర్నెట్ లో ఎక్కువ సమయం గడప గలిగె ఇంటరెస్ట్ వుండాలి. ఇంకా మీరు నాన్ టెక్నికల్ పర్సన్ అయిన కూడ కొన్ని రకాల బ్లాగ్ టెక్నాలజీ బేసిక్స్ తెలుసుకోవాల్సి ఉంటుంది. అదే విధంగా తరచూ మారే బ్లాగ్ టెక్నాలజీ అప్డేట్స్, బ్లాగ్ టూల్స్, టర్మ్స్ & కండిషన్స్, Guidelines లాంటి విషయాలను గమనిస్తూ జాగ్రత్తగా ముందుకు సాగే నిరంతర విద్యార్థి లక్షణాలు కూడ ముఖ్యము.
పైన చెప్పిన వాటిలో కొన్ని లక్షణాలు మీకు ప్రస్తుతము లేకపోయినా అదేమీ పెద్ద బ్రహ్మ విద్య మీరు నేర్చుకోకుండా పోవడానికి. మీరు మీ బ్లాగింగ్ ప్రయాణములో సులభముగా ప్రయత్నించి నేర్చుకోవచ్చు లేదా అలవాటు చేసుకోవచ్చు.పైన చెప్పిన వ్యక్తిగత విషయాలతో పాటు ఈ క్రింద చెప్పిన విషయాలు మీ బ్లాగింగ్ కెరీర్ స్టార్ట్ చేయడానికి మరియు మీ బ్లాగింగ్ కెరీర్ లో ముందుకు సాగడానికి ఈ విషయాలు చాలా అవసరము.
- Niche– మీ బ్లాగ్ లో కంటెంట్ వ్రాయడానికి ఏదైనా ప్రత్యేకమైన సబ్జెక్టు టాపిక్
- Domain– మీ బ్లాగ్ పేరు, మీ రీడర్స్ మిమ్మలిని ఆన్లైన్ లో సెర్చ్ చేసి చేరుకోవడానికి
- Web Hosting– మీ బ్లాగ్ కంటెంట్ ఆన్లైన్ లో మీ రీడర్స్ కి అందుబాటులో తెచ్చే సాఫ్ట్యూవేర్
- WordPress– మీ ఆన్లైన్ కంటెంట్ మెనేజ్మెంట్ చేయడానికి సాఫ్ట్వేర్
- Theme– మీ బ్లాగ్ ఆన్లైన్ కంటెంట్ మీ రీడర్స్ కి అందముగా క్లియర్ గా చూపడానికి
- PLUG INs- మీ బ్లాగ్ లో ఇతర ప్రత్యేకమైన ఆప్షన్స్ యాడ్ చేసుకోవడానికి
- Blog CONTENT– మీ బ్లాగ్ టాపిక్ సంబంధించిన ఆర్టికల్స్, ఫొటోస్, వీడియోలు
- Email ID– మీ రీడర్స్ మీతో కనెక్ట్ కావడానికి మరియు మీ బ్లాగ్ రీడర్స్ మిమ్మలిని 24*7 కాంటాక్ట్ చేయడానికి
- KEYWORD Research Tools– మీ రీడర్స్ కి అవసరమైన కంటెంట్ తెలుసుకొని సెర్చ్ ఇంజిన్స్ కి అనుగుణముగా కంటెంట్ క్రియేట్ చేయడానికి
Blogging Beginners Guide in Telugu
6. బ్లాగింగ్ ద్వారా డబ్బు సంపాదించడము ఎలా?
బ్లాగ్ లో ఎంత మని సంపాదించవచ్చు ఇది ఒక్క కొత్త బ్లాగర్ కి వుండే అతి పెద్ద సందేహము.
బ్లాగింగ్ అనేది get rich quick scheme కాదు త్వరగా కోటీశ్వరులు, లక్షాధికారులు కావాలి అనుకునే వాళ్ళకి బ్లాగింగ్ సరైన మార్గం కాదు. ఎందుకంటే బ్లాగింగ్ స్టార్ట్ చేయడానికి బ్లాగింగ్ ద్వారా పాపులర్ కావడానికి చాలా చాలా సమయం పడుతుంది. కొన్ని వీడియో కోర్సులు అమ్మే కోచులు ఆన్లైన్ ట్రైనర్లు ఫ్యాన్సీ ఫొటోస్ చూపించి బ్లాగింగ్ ద్వారా 10 రోజులలో ధనవంతులు అయిపోవచ్చని నమ్మించడానికి ప్రయత్నం చేస్తారు. బ్లాగింగ్ యూట్యూబ్ సోషల్ మీడియా మీటింగ్ ఓవర్ నైట్ లో కోటీశ్వరులు కావడం అంత సులభము కాదు. మన బ్లాగింగ్ సంపాదన మీరు వ్రాసే కంటెంట్ మీద మాత్రమే కాకుండా ఇంకా మీరు ఎంచుకున్న బ్లాగ్ టాపిక్, మీ బ్లాగ్ యొక్క ట్రాఫిక్, మీ రీడర్స్ మీ మీద పెట్టుకున్న నమ్మకము, మీ బ్లాగ్ కంటెంట్ తో రీడర్స్ అయ్యే ఎంగేజ్మెంట్, మీరు ఎంచుకున్న మోనేటైజేషన్ విషయాల మీద ఆధారపడి ఉంటుంది.
మీ బ్లాగ్ చెప్పుకోదగ్గ కంటెంట్ మరియు ట్రాఫిక్ కలిగి మంచి ట్రెండ్ లో ఉంటే మీ బ్లాగ్ సంపాదన ఈ క్రింద చెప్పిన క్రమములో ఉండచ్చు.
- 1వ సంవత్సరం INR 20000
- 2వ సంవత్సరం INR 100000
- 3వ సంవత్సరం INR 1000000
- 4వ సంవత్సరం INR 5000000
- 5వ సంవత్సరం INR 10000000
- బ్లాగులో మని సంపాదనకి వున్న మార్గాలు
ప్రపంచ వ్యాప్తముగా వున్న బ్లాగర్స్ 100 కి పైగా మార్గాల ద్వారా బ్లాగింగ్ కెరీర్ ద్వారా డబ్బు సంపాదిస్తున్నారు. కానీ ఎక్కువ శాతము బ్లాగర్లు ఈ క్రింద చెప్పిన 6 మార్గాల ద్వారా మని సంపాదిస్తున్నారు.
- అడ్వర్టైజింగ్ (Advertising)
- Adsense
- Adsense alternatives(Media.net)
- Sponsors Posts/Reviews
- Direct Ads
- Native Ads
- అఫిలియేట్ మార్కెటింగ్
- డిజిటల్ ప్రొడక్ట్స్ అమ్మడం (E Commerce)
- సర్వీసెస్ అమ్మడం(Freelancing)
- మెంబర్షిప్ సైట్(Membership Sites)
- డైరెక్టరీ వెబ్సైట్స్(Directory Websites)
మీ బ్లాగింగ్ కెరీర్ స్టార్ట్ చేయడానికి కావలిసిన బేసిక్ వివరాలను ఈ బ్లాగ్ పోస్ట్ ద్వారా ఇవ్వడానికి ఒక ప్రయత్నము చేశాను. తెలుగు లో చాలా మంది బ్లాగర్స్ రావాలి. తెలుగు లో ప్రతి విషయానికి ఒక తెలుగు బ్లాగ్ ఉండాలి ఆ బ్లాగ్ లో మన తెలుగు వారి సమస్యలకి పరిష్కార మార్గాలు అందాలి. ఇండియా లో వుండే అన్ని బాషల కన్నా తెలుగు లో ఎక్కువ బ్లాగులు మరియు ఎక్కువ బ్లాగర్స్ ఉండాలి అనే ఆశతో ఈ బ్లాగ్ లో ఎక్కువ బ్లాగింగ్ కి సంబంధించిన విషయాలను డిస్కస్ చేయడము జరిగింది.
Blogging Beginners Guide in Telugu
తెలుగు యూట్యూబర్స్ సంఖ్యని తెలుగు బ్లాగర్స్ దాటాలి అనేది నా కోరిక. మీ బ్లాగింగ్ కెరీర్ త్వరగా ప్రారంభించండి.
Tags : Blogging Beginners Guide in Telugu, How do I start a blog guide for beginners in Telugu, What are the basics of blogging in Telugu,
1 thought on “Blogging Beginners Guide in Telugu”