ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నుండి వినాయక చవితి 2024 పండుగ ప్రత్యేక ప్రకటన
Ganesh Utsav 2024 AP for Govt’s Efficient Mandap Clearance
వినాయక చవితి పండుగ సందర్భంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రజల సౌలభ్యం కోసం వినాయక మంటపం ఏర్పాటుకు సంబంధించిన కొత్త విధానాన్ని ప్రవేశపెట్టింది. గతంలో గణేష్ మంటపం ఏర్పాటు చేయడానికి ప్రజలు వివిధ శాఖల నుండి అనుమతులు పొందాల్సి ఉండేది. ఈ సందర్భంలో ప్రజలు అగ్నిమాపక శాఖ, పురపాలక శాఖ, విద్యుత్ శాఖ మరియు పోలీసు శాఖల నుండి నిరభ్యంతర పత్రం (NOC) తీసుకోవాల్సి ఉండేది. ప్రజల ఈ అవరోధాన్ని తొలగించి, సులభతరం చేయడంకోసం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సింగిల్ విండో క్లియరెన్స్ విధానాన్ని ప్రారంభించింది.
Ganesh Utsav 2024 APGanesh Utsav 2024 AP
సింగిల్ విండో క్లియరెన్స్ విధానం వివరాలు
ఈ విధానంలో, ప్రజలు 7995095800 మొబైల్ నంబర్ కు WhatsApp ద్వారా “Hi” అని సందేశం పంపితే చాలు, నిరభ్యంతర పత్రం కోసం అనుసరించవలసిన అన్ని విధానాలు వారి మొబైల్ ఫోన్ లో WhatsApp ద్వారా అందుతాయి.
దీనికి అనుసంధానంగా, *ganeshutsav.appolice.gov.in* అనే వెబ్‌సైట్‌లో ప్రజలు గణేష్ మంటపం ఏర్పాటు చేయదలచిన కమిటీ సభ్యుల వివరాలు, మంటపం ఏర్పాటు చేయు ప్రదేశం, సంబంధిత పోలీసు స్టేషన్, విగ్రహం ఎత్తు, మంటపం ఎత్తు, విగ్రహ ప్రతిష్ఠ రోజు, నిమజ్జనం చేసే ప్రదేశం మరియు సమయం వంటి వివరాలను నమోదు చేసి దరఖాస్తు చేసుకోవాలి.
ఎస్. హెచ్.ఓ (SHO) విచారణ మరియు నిరభ్యంతర పత్రం జారీ
దరఖాస్తు పోలీసు స్టేషన్ ఎస్. హెచ్.ఓ (SHO) గారికి చేరుతుంది. ఎస్. హెచ్.ఓ (SHO) ఆధ్వర్యంలో పురపాలక శాఖ, అగ్నిమాపక శాఖ మరియు విద్యుత్ శాఖ సిబ్బంది, ఒక బృందంగా ఏర్పడి, మంటపం ఏర్పాట్లను పరిశీలిస్తారు. ఏర్పాట్లు సానుకూలంగా ఉంటే, QR కోడ్ తో కూడిన నిరభ్యంతర పత్రం జారీ చేయబడుతుంది. అలాగే, అనుమతి రుసుము వివరాలను తెలియజేస్తారు.
Ganesh Utsav 2024 AP
రుసుము చెల్లింపు మరియు NOC జారీ
ప్రజలు, తమకు సమీపంలోని మీసేవ కేంద్రంలో రుసుము చెల్లించి, ఆ రసీదును వెబ్‌సైట్‌లో అప్లోడ్ చేస్తారు. ఎస్. హెచ్.ఓ (SHO) గారు పరిశీలన తర్వాత నిరభ్యంతర పత్రం (NOC) జారీ చేస్తారు.
నిరభ్యంతర పత్రం వినియోగం
జారీ చేయబడిన నిరభ్యంతర పత్రాన్ని ప్రింట్ తీసి గణేష్ మంటపంలో ఉంచాలి. పోలీసు వారు సందర్శన సమయంలో QR కోడ్‌ని స్కాన్ చేసి తనిఖీ చేస్తారు.
ఈ కొత్త విధానం ద్వారా గణేష్ ఉత్సవాలను ప్రజలు సులభంగా మరియు ప్రశాంతంగా జరుపుకోవచ్చు.
Ganesh Utsav 2024 AP
Ap September Pension Update 2024 – Click Here
Tags :
Vinayaka Chaturthi 2024 ap permission letter, Ganesh Chaturthi 2024 date, Vinayaka Chavithi permission letter in Telugu, Vinayaka Chaturthi 2024 ap permission letter, Ganesh Chaturthi 2024 date, Ganesh Chaturthi 2024 ap permission letter
Hi
All
Tha
Best