స్నేహితులను నమ్మి రూ.15 కోట్ల మోసపోయిన ఎంఎస్ ధోనీ
మిత భాషి.. మృదు స్వభావిగా ఉండే భారత క్రికెటర్ ఎంఎస్ ధోనీ ధోనీని నమ్మిన స్నేహితుడే భారీ మోసం చేశాడు. ధోనీ పేరుతో వ్యాపారం చేస్తానని చెప్పి రూ.15 కోట్ల మోసానికి పాల్పడ్డాడు. ఎన్ని సార్లు అడిగినా.. నోటీసులు పంపినా పట్టించుకోకపోవడంతో ధోనీ పోలీసులను ఆశ్రయించాడు. తన స్నేహితుడిపై కేసు నమోదు చేయించాడు. ఈ వార్త క్రికెట్ ప్రపంచంలో సంచలనంగా మారింది. అసలు ఏం జరిగిందో తెలుసుకుందాం.
ధోనీ చిన్ననాటి స్నేహితుడు మిహిర్ దివాకర్ వ్యాపార భాగస్వామిగా కూడా కొనసాగుతున్నాడు. ధోనీ, మిహిర్ కలిసి అనేక వ్యాపారాలు నిర్వహిస్తున్నాడు. ఇదే క్రమంలోనే 2017లో ‘ఎంఎస్ ధోని’ పేరుతో గ్లోబల్ క్రికెట్ అకాడమీ ఏర్పాటుచేస్తానని ధోనీతో మిహిర్ ఒప్పందం చేసుకున్నాడు. దేశ, విదేశాల్లో అనేక చోట్ల అకాడమీ కోసం భూమి కొనుగోలు చేశాడు.. కానీ అకాడమీని ఏర్పాటుచేయలేదని తెలిసింది.
ఒప్పందం ప్రకారం ఆర్కా స్పోర్ట్స్ ధోనికి డివిడెండ్ రూపంలో డబ్బులు రావాల్సి ఉంది. కానీ డబ్బులు చెల్లించకుండా ఒప్పందాన్ని ఉల్లంఘించారు. దీనిలో సౌమ్య బిశ్వాస్ పాత్ర కూడా ఉంది. డబ్బులు చెల్లించకపోడంతో 15 ఆగస్టు 2021న ఆర్కా స్పోర్ట్స్ కు మంజూరుచేసిన అధికార లేఖను ధోని ఉపసంహరించుకున్నాడు. అనంతరం అనేక నోటీసులను పంపారు. కానీ ప్రయోజనం లేకపోవడంతో ధోని పోలీసులకు ఫిర్యాదు చేశారు. ధోని ఫిర్యాదుతో మిహిల్, సౌమ్య బిశ్వాస్ పై క్రిమినల్ కేసు నమోదైంది.