మహిళలకు ఉచితంగా కుట్టు మిషన్లు
Free Machine Scheme In Telugu 2024
కేంద్రంలో మూడోసారి NDA ప్రభుత్వమే అధికారంలోకి రావడంతో, ఆల్రెడీ అమలు చేస్తున్న పథకాలను కొనసాగించేలా ప్లాన్స్ చేస్తున్నారు. ఈ క్రమంలో మహిళలకు, పురుషులకు ఉచితంగా కుట్టు మిషన్ (sewing machine) ఇచ్చే పథకాన్ని కంటిన్యూ చేస్తోంది. ఇప్పటికే చాలా మంది పొందారు. మరింత మందికి ఇస్తోంది. ఆ వివరాలు తెలుసుకుందాం.
కేంద్ర ప్రభుత్వం వివిధ రకాల వృత్తులు చేసే వారికి ప్రత్యేక పనిముట్లు, యంత్రాలను ఇస్తోంది. ఐతే, వాటిని కేంద్రం ఇవ్వకుండా, మనీ ఇస్తూ, ఆ డబ్బుతో కొనుక్కునేలా చేస్తోంది. కుట్టు మిషన్ కూడా ఇదే టైపు. కేంద్రం ప్రధానమంత్రి విశ్వకర్మ యోజన (Pradhan Mantri Vishwakarma Yojana) అనే పథకాన్ని అమలుచేస్తోంది. ఈ పథకంలో భాగంగా, కుట్టు మిషన్ కొనుక్కునేందుకు రూ.15,000 పొందవచ్చు. ఈ డబ్బును నేరుగా మీ బ్యాంక్ అకౌంట్లో వేస్తుంది. అలాగే ఓ వారం డిజిటల్ ట్రైనింగ్ ఇస్తుంది. ఆ సమయంలో రోజుకు రూ.500 చొప్పున మనీ ఇస్తుంది.
పథకం వివరాలు
కుట్టు మిషన్ కొనుక్కున్న తర్వాత, కేంద్రం 1 లక్ష రూపాయలు రుణం ఇప్పిస్తుంది. ఈ రుణాన్ని 18 నెలల్లో చెల్లించవచ్చు. రుణం చెల్లించాక మరో 2 లక్షల దాకా రుణం తీసుకోవచ్చు. దాన్ని 30 నెలల్లో చెల్లించాలి. ఇలా, కేంద్రం కుట్టు మిషన కొనుక్కునేవారు షాపు పెట్టుకునేందుకు ఈ రుణం ఇప్పిస్తోంది. ఈ రుణాలకు వడ్డీ చాలా తక్కువగా ఉంటుంది. అలాగే, రుణాలకు అప్లై చేసుకునే క్రెడిట్ గ్యారెంటీ ఫీజును కేంద్రమే చెల్లిస్తుంది.
అర్హతలు
ఉచిత కుట్టు మిషన్ పథకానికి అర్హతలు:
– భారతదేశ పౌరులు అయి ఉండాలి.
– ఇప్పటికే కుట్టుపని చేస్తున్న వారు మాత్రమే.
– దరఖాస్తుదారు వయస్సు 18 ఏళ్లు పైబడి ఉండాలి.
– ప్రధానమంత్రి విశ్వకర్మ యోజన దరఖాస్తుదారుగా ఉండాలి.
Free Machine Scheme In Telugu 2024
Free Machine Scheme In Telugu 2024
అవసరమైన పత్రాలు
ఉచిత కుట్టు మిషన్ పథకం కోసం అవసరమైన పత్రాలు:
– ఆధార్ కార్డు
– చిరునామా రుజువు
– గుర్తింపు కార్డు
– కుల ధృవీకరణ పత్రం
– పాస్పోర్టు సైజు ఫొటో
– మొబైల్ నంబర్
– బ్యాంకు పాస్ బుక్
దరఖాస్తు ప్రక్రియ
ఉచిత కుట్టు మిషన్ పథకం కోసం ఎలా దరఖాస్తు చేయాలి:
1. ముందుగా అధికారిక వెబ్‌సైట్ https://pmvishwakarma.gov.in లో రిజిస్టర్ అవ్వాలి.
2. ఆన్లైన్లో కుదరదు అనుకుంటే, మీ దగ్గర్లోని మీ సేవా కేంద్రానికి వెళ్లి, చేయించుకోవచ్చు.
3. పైన చెప్పుకున్న పత్రాలను మీ దగ్గర ఉంచుకోవాలి.
4. దరఖాస్తు అప్లై చేశాక, మీకు రసీదు వస్తుంది. ఆ రసీదును మీ దగ్గర ఉంచుకోవాలి.
5. కొన్ని రోజులకు కేంద్రం మీ బ్యాంక్ అకౌంట్లో మనీ జమ చేస్తుంది. తద్వారా మీరు కుట్టు మిషన్ కొనుక్కోవచ్చు.
ఆంధ్రప్రదేశ్ లో 6000 రేషన్ డీలర్ల నియామకాలు – Click Here
No comments chudu
I will do it