Ap Govt Good News Dwcra Women 5lakh Loan

Table of Contents

Telegram Channel Join Now
WhatsApp Channel Join Now

Ap Govt Good News Dwcra Women 5lakh Loan

 

ఏపీలో డ్వాక్రా మహిళలకు గుడ్‌న్యూస్.. రూ.2 లక్షల నుంచి రూ.5 లక్షలకు పెంపు

 

Ap Govt Good News Dwcra Women 5lakh Loan: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మరో ముఖ్యమైన నిర్ణయం తీసుకుంది.. డ్వాక్రా మహిళలకు సంబంధించి ఫైల్ క్లియర్ చేసింది. ఎస్సీ, ఎస్టీ డ్వాక్రా మహిళలకు సంబంధించి రుణ పరిమితిని రూ.2 లక్షల నుంచి రూ.5 లక్షల వరకు పెంచుతూ నిర్ణయం తీసుకుంది. అలాగే కనిష్టంగా రూ.50వేల నుంచి రూ.5 లక్షల వరకు వడ్డీలేని రుణాలను డ్వాక్రా మహిళలకు అందిస్తారు. ఆ వివరాలు ఇలా ఉన్నాయి.

  • ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది
  • డ్వాక్రా మహిళలకు రుణ పరిమితి పెంచారు
  • రూ.2 లక్షల నుంచి రూ.5 లక్షలకు పెంపు

ఆంధ్రప్రదేశ్‌లో కూటమి ప్రభుత్వం ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను ఒక్కొక్కటిగా అమలు చేస్తోంది. ఇప్పటికే పలు పథకాలను అమలు చేయగా.. మరికొన్ని అమలు చేసేందుకు సిద్ధమవుతున్నాయి. తాజాగా ఎస్సీ, ఎస్టీ డ్వాక్రా మహిళలకు సంబంధించి ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఉన్నతి పథకం కింద డ్వాక్రా మహిళలకు ఇచ్చే వడ్డీలేని రుణాల పరిమితి రూ.5 లక్షలకు పెంచారు.

మొన్నటి వరకు ఈ పథకం కింద వారికిచ్చే సున్నా వడ్డీ రుణాల పరిమితి రూ.2 లక్షల ఉంది.. ఇప్పుడు దానిని రూ.5 లక్షలకు పెంచింది. మహిళల జీవనోపాధి కింద ఒక్కొక్కరికి కనిష్టంగా రూ.50 వేల నుంచి గరిష్టంగా రూ.5లక్షల వరకు వడ్డీలేని రుణాన్ని ఇస్తారు.

డ్వాక్రా మహిళలు ఈ రుణాన్ని వాయిదా రూపంలో తిరిగి చెల్లిస్తారు. 2024-25 ఏడాదికి సంబంధించి రూ.250 కోట్లు రుణంగా ఇవ్వాలని అధికారులు టార్గెట్‌గా పెట్టుకున్నారు. ఇప్పటికే ఈ ఫైల్‌పై ఎమ్‌ఎస్‌ఎమ్‌ఈ, సెర్ప్, ఎన్‌ఆర్‌ఐ వ్యవహారాలశాఖ మంత్రి కొండపల్లి శ్రీనివాస్‌ సంతకం చేశారు. ఈ ఉన్నతి పథకం కింద రుణ మంజూరుకు ప్రణాళికను అమలు చేస్తున్నారు అధికారులు.

డ్వాక్రా సంఘాల్లో సభ్యులుగా ఉన్న ఎస్సీ, ఎస్టీ మహిళలు ఈ రుణం కోసం దరఖాస్తు చేసుకున్న నెలలో యూనిట్ ఏర్పాటు చేయాల్సి ఉంటుంది. రాష్ట్రంలో గ్రామ సంఘం స్థాయి నుంచి అన్ని దశల్లోనూ పర్యవేక్షణ ఉంటుంది. అలాగే లబ్ధిదారులు ఎంపిక చేసుకున్న జీవనోపాధికి అనుగుణంగా రుణ మంజూరు చేస్తారు. ఏ జీవనోపాధి ఏర్పాటు చేసుకోవాలనేది డ్వాక్రా మహిళల ఇష్టం.

Vijayawada floods Report
ఏపీలో వరద నష్టంపై కేంద్రానికి నివేదిక పంపిన ప్రభుత్వం

మొన్నటి వరకు ఉన్నతి పథకం కింద రుణాల మంజూరును గృహనిర్మాణానికి, విద్యకు, భూమి కొనుగోలుకు వర్తించదు. డ్వాక్రా మహిళల నుంచి వచ్చిన విజ్ఞప్తులతో విద్య, గృహనిర్మాణానికి, భూమి కొనుగోలకు కూడా వర్తింపచేయాలని అధికారులు ప్రతిపాదనలు సిద్ధం చేసి ప్రభుత్వానికి పంపించారు. ఎస్సీ కార్పొరేషన్‌ నుంచి రూ.8 కోట్ల మేర నిధుల్ని రాయితీ కింద డ్వాక్రా మహిళలకు అందించే ఛాన్స్ ఉంది. ఒక్కో మహిళకు గరిష్ఠంగా రూ.50 వేల వరకు రాయితీ కింద రుణం అందిస్తారు.. ప్రభుత్వం ఈ అంశంపై నిర్ణయం తీసుకోవాల్సి ఉంది.

ఈ ఉన్నతి పథకం డ్వాక్రా సంఘాల్లోని ఎస్సీ, ఎస్టీ మహిళల అభ్యున్నతి కోసం తీసుకొచ్చిన పథకం. మహిళలు ఈ రుణాల తీసుకుని చిన్న చిన్న వ్యాపారాలు చేసుకుంటూ అభివృద్ధి సాధించేలా చూడాలనేది లక్ష్యంగా పెట్టుకున్నారు. ఇప్పుడు తాజాగా ప్రభుత్వం రుణ పరిమితిని రూ.5 లక్షల వరకు పెంచడంతో వారికి మరింత ఊరట లభించింది. కొత్త ప్రభుత్వం అధికారంలోకి రావడంతో బడ్జెట్‌ నుంచి మరో రూ.250 కోట్ల నిధులకు ప్రతిపాదనలు పంపించారు. ప్రస్తుతం ఉన్న రూ.250 కోట్ల నిధులకు అదనంగా చేరితే రూ.500 కోట్ల మేర రుణాలు.. ఎస్సీ, ఎస్టీల మహిళలకు ఒక్క ఏడాదిలోనే అందించే అవకాశం ఉంటుంది అంటున్నారు.

ap dwcra official website – Click Here

Ap Govt Good News Dwcra Women 5lakh Loan

More Links :

AP Deepam Scheme Details 2024 – Click Here

NTR Bharosa Pension Scheme Details 2024 – Click Here

PM Kisan 18th Installment Date 2024 Telugu
PM కిసాన్ 18వ విడత తేదీ 2024: చెల్లింపు స్థితి, లబ్ధిదారుల జాబితా

తల్లికి వందనం పథకం – Click Here

అన్నదాత సుఖీభవ పథకం – Click Here

ఆడబిడ్డ నిధి పథకం – Click Here

 

Tags : Ap Govt Good News Dwcra Women 5lakh Loan, Ap Govt Good News Dwcra Women 5lakh Loan, dwcra group details in ap, dwcra andhra pradesh official website, dwcra group ap, dwakra group names list in andhra pradesh,

2.9/5 - (7 votes)

ప్రభుత్వ పథకాలు, ప్రభుత్వ ఉద్యోగాలు, ప్రైవేట్ కంపెనీ ఉద్యోగాల గురించి రోజువారీ సమాచారాన్ని పొందడానికి మా వాట్సాప్ ఛానెల్‌లో మరియు టెలిగ్రామ్ ఛానెల్‌లో చేరండి

Telegram Channel Join Now
WhatsApp Channel Join Now

Related Job Posts

Vijayawada floods Report

ఏపీలో వరద నష్టంపై కేంద్రానికి నివేదిక పంపిన ప్రభుత్వం

PM Kisan 18th Installment Date 2024 Telugu

PM కిసాన్ 18వ విడత తేదీ 2024: చెల్లింపు స్థితి, లబ్ధిదారుల జాబితా

Anganwadi Recruitment 2024 Kadapa

అంగన్వాడీ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ 2024 | దరఖాస్తు ప్రక్రియ & చివరి తేదీ

Leave a comment