Ap Govt Announce Subsidy Loans in Formers

Table of Contents

Telegram Channel Join Now
WhatsApp Channel Join Now

రైతులకు రాయితీపై రూ.3 లక్షలు ప్రకటించిన చంద్రబాబు.. అప్లై చేయండి

Ap Govt Announce Subsidy Loans in Formers

 

ఆంధ్రప్రదేశ్ లో నూతనంగా అధికారంలోకి వచ్చిన చంద్రబాబు ప్రభుత్వం అభివృద్ధి పనులతోపాటు సంక్షేమ కార్యక్రమాలపై కూడా ప్రత్యేక శ్రద్ధ చూపిస్తోంది. ఈ క్రమంలో రైతులకు రాయితీపై ముఖ్యమైన ప్రకటన చేసింది. 2014 నుంచి 2019 మధ్య పరిపాలనలో చంద్రబాబు నాయుడు సూక్ష్మ సేద్య పథకానికి పెద్ద పీట వేశారు. కంపెనీలతో ఒప్పందాలు కుదుర్చి అవసరమైన పరికరాలను రాయితీలపై రైతులకు అందించడంతో పాటు కేంద్రం నుంచి కూడా అవసరమైన రాయితీని తెచ్చేందుకు కృషి చేశారు. తాజాగా మరోసారి ఈ పథకాన్ని అమలు చేయబోతున్నారు. ఇందులో రైతులు రాయితీపై రూ.3 లక్షలకు పైగా పొందవచ్చు.

Ap Govt Announce Subsidy Loans in FormersAp Govt Announce Subsidy Loans in FormersAp Govt Announce Subsidy Loans in Formers

శ్రీకాకుళం జిల్లాలో డ్రిప్ ఇరిగేషన్ పథకం:

ఇప్పటికే శ్రీకాకుళం జిల్లాలో 2400 హెక్టార్లలో డ్రిప్ ఇరిగేషన్ పథకం అమలవుతుండగా, ఇప్పుడు మరో 2400 హెక్టార్లలో ఈ పథకాన్ని అమలు చేయబోతున్నారు. ఈ పథకంతో రైతులకు రాయితీ కింద రూ.11.17 కోట్లను అందిస్తున్నారు. కేంద్రం నుంచి 60 శాతం నిధులు వస్తుండగా, రాష్ట్రం 40 శాతం నిధులు సమకూరుస్తోంది. పత్తి, మిరప, మొక్కజొన్న, జీడి మామిడి, మామిడి, జామ, ఆయిల్ ఫాం, కొబ్బరి, కూరగాయలు వంటి పంటలను పెంచే ఐదు ఎకరాల్లోపు భూమి ఉన్న సన్న కారు రైతులకు 90 శాతం రాయితీపై రూ.2.18 లక్షలను అందించనున్నారు. ఐదు నుంచి పన్నెండున్నర ఎకరాల భూమి ఉంటే రూ.3.10 లక్షలను 50 శాతం రాయితీపై అందిస్తారు.

అప్లై చేయడం ఎలా?

రాయితీపై పరికరాలను పొందేందుకు, రైతులు భూమి యాజమాన్య హక్కులకు సంబంధించిన పత్రాలతో పాటు ఆధార్ కార్డును జతచేసి రైతు సేవా కేంద్రాలకు లేదా జిల్లా మైక్రో ఇరిగేషన్ కార్యాలయం లేదా మండల ఉద్యాన శాఖాధికారి కార్యాలయంలో బయోమెట్రిక్ ద్వారా వివరాలు నమోదు చేసుకోవాలి. బోర్లు, బావుల కింద వ్యవసాయం చేసేవారికి ఈ పథకం బాగా ఉపయోగపడుతుందని మంత్రి అచ్చెన్నాయుడు తెలిపారు.

ఉపయోగం మరియు ప్రభావం:

ఈ పథకం ద్వారా రైతులు అధిక దిగుబడి పొందవచ్చు. డ్రిప్ ఇరిగేషన్ పథకం వల్ల నీటిని సమర్థవంతంగా వినియోగించుకోవడం సాధ్యం అవుతుంది. అలాగే, పంటలు సమయానికి నీరు అందుకోవడంతో దిగుబడి పెరుగుతుంది. చిన్నకారు రైతులకు ఎక్కువ రాయితీ అందించడం వల్ల వారు పరికరాలను సులభంగా కొనుగోలు చేయగలుగుతారు.

Aadabidda Nidhi Scheme Starting Date Fix 2024
Aadabidda Nidhi Scheme Starting Date Fix 2024

ముగింపు:

చంద్రబాబు నాయుడు ప్రభుత్వం రైతుల సంక్షేమానికి పెద్ద పీట వేస్తూ, వారికి రాయితీపై పరికరాలను అందించడం ద్వారా వారి ఆర్థిక పరిస్థితిని మెరుగుపరచడానికి కృషి చేస్తోంది. ఈ పథకాన్ని సద్వినియోగం చేసుకోవాలని, అవసరమైన పత్రాలతో అప్లై చేయాలని, రైతులు ముందుకు రావాలని ప్రభుత్వ యంత్రాంగం సూచిస్తోంది.

 

Ap Govt Announce Subsidy Loans in Formers

చంద్రన్న పెళ్లి కానుక సంక్షేమ పథకం పూర్తి వివరాలు – Click Here

ఆడబిడ్డ నిధి పథకం – Click Here

AP Deepam Scheme Details 2024 – Click Here

Ap Cabinet Decisions on Volunteer System
Ap Cabinet Decisions on Volunteer System 2024

NTR Bharosa Pension Scheme Details 2024 – Click Here

అన్నదాత సుఖీభవ పథకం 2024 – Click Here

AP Free Bus Journey Scheme 2024 – Click Here

2.7/5 - (3 votes)

ప్రభుత్వ పథకాలు, ప్రభుత్వ ఉద్యోగాలు, ప్రైవేట్ కంపెనీ ఉద్యోగాల గురించి రోజువారీ సమాచారాన్ని పొందడానికి మా వాట్సాప్ ఛానెల్‌లో మరియు టెలిగ్రామ్ ఛానెల్‌లో చేరండి

Telegram Channel Join Now
WhatsApp Channel Join Now

Related Job Posts

Aadabidda Nidhi Scheme Starting Date Fix 2024

Aadabidda Nidhi Scheme Starting Date Fix 2024

Ap Cabinet Decisions on Volunteer System

Ap Cabinet Decisions on Volunteer System 2024

Rs. 25000 per house: CM Chandrababu

Rs. 25000 per house: CM Chandrababu

One response to “Ap Govt Announce Subsidy Loans in Formers”

1 thought on “Ap Govt Announce Subsidy Loans in Formers”

Leave a comment