Ap New Government Schemes List

Ap New Government Schemes List

కూటమి ప్రభుత్వ మ్యానిఫెస్టోలో ఉన్న ముఖ్య పథకాల వివరాలు

Telegram Channel Join Now
WhatsApp Channel Join Now

Welfare Schemes Of TDP-JSP-BJP alliance – Andhra Pradesh 2024

ఆంధ్ర ప్రదేశ్ సార్వత్రిక ఎన్నికలలో భారీ మెజారిటీ తో ప్రభుత్వం ఏర్పాటు చేస్తున్న తెలుగుదేశం కూటమి, తాము ప్రకటించిన మ్యానిఫెస్టోలో కింది పథకాల ను అమలు చేయనుంది. అవేంటో చూసేద్దాం.

Key Schemes In The Manifesto Announced By TDP – Jana sena 

టీడీపీ-జనసేన ప్రకటించిన మేనిఫెస్టోలోని కీలక పథకాలు ఇవే

తెలుగుదేశం పార్టీ కూటమి ప్రకటించినటువంటి పథకాలలో రైతులకు, మహిళలకు, విద్యార్థులకు మరియు నిరుద్యోగులకు మేలు చెకురనుంది. కొత్తగా ఏర్పాటు అయ్యే ప్రభుత్వం అమలు చేసే ముఖ్యమైన పథకాలు ఇవే..

New Schemes Introduced For Women

మహిళలకు కోసం ప్రవేశ పెట్టిన కొత్త పథకాలు

1. ప్రతినెల 1500 రూపాయలు:

18 నుంచి 59 ఏళ్ల వరకు రాష్ట్రవ్యాప్తంగా ఉన్నటువంటి ప్రతి మహిళకు ఆడబిడ్డ నిధి పథకం కింద ప్రతినెల 1500 రూపాయలు నేరుగా వారి బ్యాంకు ఖాతాలో జమ చేయనున్నట్లు కూటమి ప్రకటించడం జరిగింది. అంటే ప్రతి ఏటా 18 వేల రూపాయలు ఎటువంటి కుల ప్రాతిపదికన కాకుండా నేరుగా మహిళల ఖాతాలో తెలుగుదేశం జనసేన ప్రభుత్వం జమ చేయనుంది.

Aadabidda Nidhi Scheme Starting Date Fix 2024
Aadabidda Nidhi Scheme Starting Date Fix 2024

2. ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యం:

కర్ణాటక మరియు తెలంగాణ రాష్ట్రాల మాదిరిగానే ఆంధ్రప్రదేశ్ లో కూడా తెలుగుదేశం జనసేన కూటమి ప్రభుత్వం రాష్ట్ర వ్యాప్తంగా ఏపీఎస్ఆర్టీసీ బస్సులలో మహిళలకు ఉచిత ప్రయాణ సౌకర్యాలు కల్పించనుంది. స్థానికత ఆధారంగా ఆధార్ కార్డు లేదా ఏదైనా స్థానిక అడ్రెస్ ప్రూఫ్ చూపించి రాష్ట్రంలో ఎక్కడి నుంచి ఎక్కడికైనా ఉచితంగా బస్సు ప్రయాణం చేయవచ్చు .

3. మహిళలకు వడ్డీ లేని రుణాలు:

తాము అధికారంలోకివస్తే కేంద్ర ప్రభుత్వ సహకారంతోటి మహిళలకు వడ్డీ లేని రుణాలను అందిస్తామని ఎన్డీఏ కూటమి ప్రకటించింది.

4.రైతుల కోసం అన్నదాత

తెలుగుదేశం జనసేన ప్రభుత్వం ప్రతి ఏటా రైతుల ఖాతాలో ఏకంగా 20వేల రూపాయలు జమ చేయనున్నట్లు ప్రకటించింది. అన్నదాత పథకం ద్వారా గతంలో ఇచ్చిన మాదిరిగానే ఈసారి కూడా రైతులకు పెట్టుబడి సహాయాన్ని రాష్ట్ర ప్రభుత్వం అందించనుంది. గతంలో రైతు భరోసా మరియు పీఎం కిసాన్ కలుపుకొని 13500 ఇస్తుండగా ఇకపై కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ సహాయాలు కలుపుకొని తెలుగుదేశం ప్రభుత్వం ఏకంగా 20వేల రూపాయలను రైతుల ఖాతాలో ప్రతి ఏటా జమ చేయనుంది.

Schemes For Students – విద్యార్థులకు సంబంధించిన పథకాలు.

1.ప్రతి ఏటా 15000

గతంలో వైఎస్ఆర్సిపి ప్రభుత్వం ఇస్తున్నటువంటి అమ్మఒడి పథకాలను కేవలం కుటుంబంలో ఒక బిడ్డకు మాత్రమే వర్తించేది. అయితే ప్రస్తుత తెలుగుదేశం జనసేన ప్రభుత్వం ఒకే కుటుంబంలో ఎంతమంది పిల్లలు ఉంటే అంతమంది పిల్లలకు 15వేల రూపాయలు ప్రతి ఏటా తాము చెల్లిస్తామని వెల్లడించింది.

2.కాలేజ్ ఫీజులు నేరుగా కళాశాలలకే:

Aadabidda Nidhi
Aadabidda Nidhi Scheme 2024: Comprehensive to Apply Online

తెలుగుదేశం జనసేన కూటమి ప్రభుత్వం పై చదువులు చదువుతున్నటువంటి విద్యార్థులకు ఫీజు రియంబర్స్మెంట్ అమౌంటును నేరుగా కళాశాలలకే చెల్లిస్తామని తమ మానిఫెస్టో లో వెల్లడించింది. ఇప్పటివరకు విద్యా దీవెన కింద అందిస్తున్నటువంటి అమౌంటు విద్యార్థులు లేదా తల్లుల జాయింట్ ఖాతాలో జమ అవుతుండగా వాటిని తిరిగి కళాశాలలకు జమ చేయాల్సి ఉంటుంది. ఇందులో ఆలస్యమై విద్యార్థులు ఇబ్బందులు పడుతున్న నేపథ్యంలో, గతంలో మాదిరిగానే ఫీజ్ రీయింబర్స్మెంట్ అమౌంట్ నేరుగా కళాశాలల ఖాతాలో ని జమ చేయనున్నట్లు కూటమి వెల్లడించింది.

A Bumper Offer For The Unemployed – నిరుద్యోగులకు బంపర్ ఆఫర్

తెలుగుదేశం జనసేన ప్రభుత్వం రాబోయే 5 ఏళ్లలో 20 లక్షల ఉద్యోగాల కల్పన…. ఏటా 4 లక్షల ఉద్యోగాల నియామకం చేపట్టనుంది. తొలి సంతకం మెగా డీఎస్సీ పైనే, ఇక నిరుద్యోగులకు నెలకు 3 వేల రూపాయల చొప్పున నిరుద్యోగ భృతి ఇవ్వనున్నారు.

ఇవే కాకుండా రాజధాని అమరావతి గా కొనసాగించడం, అమరావతి, వైజాగ్ ను అభివృద్ధి చేయడం ద్వారా మరిన్ని ఉపాధి అవకాశాలు కల్పిస్తామని కొత్త ప్రభుత్వం చెబుతోంది.

TDP-BJP-JSP alliance’s manifesto

 

TDP Official Website : Click Here

 

Tags : Ap New Government Schemes List, Ap New Government Schemes List, Ap New Government Schemes List, Ap New Government Schemes List, TDP New Schemes List,

3.7/5 - (12 votes)

ప్రభుత్వ పథకాలు, ప్రభుత్వ ఉద్యోగాలు, ప్రైవేట్ కంపెనీ ఉద్యోగాల గురించి రోజువారీ సమాచారాన్ని పొందడానికి మా వాట్సాప్ ఛానెల్‌లో మరియు టెలిగ్రామ్ ఛానెల్‌లో చేరండి

Telegram Channel Join Now
WhatsApp Channel Join Now

Related Job Posts

Aadabidda Nidhi Scheme Starting Date Fix 2024

Aadabidda Nidhi Scheme Starting Date Fix 2024

Aadabidda Nidhi

Aadabidda Nidhi Scheme 2024: Comprehensive to Apply Online

AP New Pensions 2024

కొత్త పెన్షన్లపై ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం: అర్హులందరికీ త్వరలో పెన్షన్లు

3 responses to “Ap New Government Schemes List”

  1. […] కూటమి ప్రభుత్వ మ్యానిఫెస్టోలో ఉన్న ముఖ్య పథకాల వివరాలు – Click Here […]

  2. […] కూటమి ప్రభుత్వ మ్యానిఫెస్టోలో ఉన్న ముఖ్య పథకాల వివరాలు – Click Here […]

  3. […] కూటమి ప్రభుత్వ మ్యానిఫెస్టోలో ఉన్న ముఖ్య పథకాల వివరాలు – Click Here […]

3 thoughts on “Ap New Government Schemes List”

Leave a comment