సీఎం చంద్రబాబు ఆదేశాలు – ఆ రైతుల ఖాతాల్లో భారీగా నిధులు..!!
Ap CM Orders to Release Money in Formers
అన్నదాత సుభీభవగా మార్చిన రైతు భరోసా పథకం పై ముఖ్యమంత్రి చంద్రబాబు కీలక ఆదేశాలు జారీ చేసారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు పథకం అమల్లో భాగంగా మార్గదర్శకాలు సిద్ధం చేయాలని అధికారులకు నిర్దేశించారు. ఇటీవల కురిసిన భారీ వర్షాలకు పంటలు నష్టపోయిన రైతులకు పెట్టుబడి రాయితీ ఇవ్వాలని అధికారులను చంద్రబాబు ఆదేశించారు. ఇందుకోసం రూ. 36 కోట్లు విడుదల చేయాలని ఆర్థిక శాఖకు సూచించారు. రాష్ట్రంలో విత్తన కొరత ఉండొద్దని స్పష్టం చేశారు.
అధికారులకు ముఖ్యమంత్రి ఆదేశాలు
అన్నదాత సుఖీభవ పైన ముఖ్యమంత్రి చంద్రబాబు అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఎన్నికల సమయంలో రైతులకు ప్రతీ ఏటా రూ 20 వేల చొప్పున ఆర్థిక సాయం అందిస్తామని హామీ ఇచ్చారు. ఇప్పుడు ఈ పథకం అమలు దిశగా మార్గదర్శకాల తయారీకి చంద్రబాబు సూచనలు చేసారు. లబ్ధిదారులను గుర్తించేందుకు రైతుల మొబైల్ నంబర్లను బ్యాంకు ఖాతాలతో లింక్ చేయాలని చంద్రబాబు ఆదేశించారు. వీటికి జియో ట్యాగ్ చేయాలని సూచించారు. మరోవైపు మైక్రో ఇరిగేషన్ మాన్యుఫాక్చరింగ్ పార్కు ఏర్పాటుపై ప్రతిపాదనలు తయారు చేయాలని సీఎం చంద్రబాబు ఆదేశించారు.
Ap CM Orders to Release Money in FormersAp CM Orders to Release Money in Formers
రైతులకు సాయంగా వ్యవసాయ సమీక్ష
రైతులకు సాయంగా వ్యవసాయ సమీక్షలో భాగంగా ఇటీవల కురిసిన భారీ వర్షాలకు జరిగిన పంట నష్టం పైన చర్చ జరిగింది. నష్టపోయిన రైతులకు పెట్టుబడి రాయితీ ఇవ్వాలని ముఖ్యమంత్రి స్పష్టం చేసారు. ఇందు కోసం విపత్తుల సహాయ నిధి నుంచి రూ 36కోట్లు విడుదల చేయాలని అధికారులను ఆదేశించారు. రాష్ట్రంలో విత్తన కొరత ఉండొద్దని స్పష్టం చేశారు. వ్యవసాయంలో డ్రోన్ల వినియోగం పెంచాలని అధికారులకు సూచించారు. కరవు ప్రాంతాల్లో శాటిలైట్ ఫోటోల ద్వారా మాయిశ్చర్‌ను పరిశీలన చేసి చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.
కీలక సూచనలు
– ఏపీలో సాగులో ఉన్న ప్రాంతాన్ని ఈ క్రాపింగ్ చేయాలని అధికారులకు స్పష్టం చేశారు.
– ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్లను ప్రోత్సహించాలని, ఉత్పత్తులను ఎగుమతించేందుకు ఎయిర్ కార్గో సేవలను అందించేలా చూడాలని చంద్రబాబు స్పష్టం చేశారు.
– కొత్త జిల్లాల్లో డీసీసీబీలు ఏర్పాటు చేయాల్సి ఉందని సహాకార శాఖ అధికారులు సూచించారు.
– ఫుడ్ ప్రొసెసింగ్ లో ఉత్తమ విధానాన్ని తెచ్చేందుకు నివేదిక సిద్ధం చేయాలని ముఖ్యమంత్రి నిర్దేశించారు.
– ఉద్యాన పంటల్లో రాష్ట్రం ముందుండేలా చర్యలు తీసుకోవాలని సూచించారు.
ఈ ఆదేశాలు రైతులకు సకాలంలో సహాయం అందించడంలో కీలక పాత్ర పోషిస్తాయి. ముఖ్యంగా, ఇటీవల జరిగిన పంట నష్టానికి పరిహారం చెల్లించడం ద్వారా రైతులు మళ్లీ స్థిరపడేలా చేయడం ప్రభుత్వ ప్రధాన లక్ష్యంగా ఉంది.
Ap CM Orders to Release Money in Formers
చంద్రన్న పెళ్లి కానుక సంక్షేమ పథకం పూర్తి వివరాలు – Click Here
ఆడబిడ్డ నిధి పథకం – Click Here
AP Deepam Scheme Details 2024 – Click Here
NTR Bharosa Pension Scheme Details 2024 – Click Here
అన్నదాత సుఖీభవ పథకం 2024 – Click Here
AP Free Bus Journey Scheme 2024 – Click Here
తల్లికి వందనం పథకం 2024 – Click Here
I need any volunteer job