వైస్సార్ పెన్షన్ కానుక – అన్ని రకముల పెన్షన్ ల సమాచారం

All YSR Pensions Complete Details

వైస్సార్ పెన్షన్ కానుక – అన్ని రకముల పెన్షన్ ల సమాచారం

Telegram Channel Join Now
WhatsApp Channel Join Now

All YSR Pensions Complete Details

ఆంధ్రప్రదేశ్లోని పేద ప్రజలందరికీ సురక్షితమైన మరియు గౌరవప్రదమైన జీవితాన్ని అందించే ఉద్దేశ్యంతో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం YSR పెన్షన్ కనుక పథకాన్ని ప్రవేశపెట్టింది. ఈ పథకం సమాజంలోని అత్యంత హాని కలిగించే వర్గాలను రక్షించడానికి మరియు 17 వేర్వేరు వర్గాలను అనుసరించి పెన్షన్ అందించడానికి ఉద్దేశించబడింది.

All YSR Pensions Complete Details

వైస్సార్ పెన్షన్ కానుక లొ పెన్షన్ రాకములు ఎన్ని ?

How Many Types Of Pension Coming Under YSR Pension Kanuka ?

1. వృద్ధాప్య పెన్షన్

2. వితంతువు

3. వికలాంగులు

4. ఒంటరి మహిళ పెన్షన్

5. నేత కార్మికులు

6. గీత కార్మికులు

7. ట్రాన్స్ జెండర్

8. మత్స్యకారులు

9. కళాకారుల పెన్షన్లు

10. డయాలసిస్ పెన్షన్లు

11. సాంప్రదాయ చెప్పులు కుట్టేవారు

12. డప్పు కళాకారులు

13. దీర్ఘకాలిక మూత్రపిండ వ్యాధులు

14. దీర్ఘకాల వ్యాధులు

15. ఎయిడ్స్ వ్యాధిగ్రస్తులు

16. అభయ హస్తం

17. పక్షవాతం

All YSR Pensions Complete Details

What Are The Common Eligibility Criteria for Pensions Under YSR Pension Kanuka?

1. పెన్షన్ పొందాలి అనుకునే వారి కుటుంబం యొక్క ఆదాయం గ్రామీణ ప్రాంతాలలో నెలకు Rs. 10000 కు, అలాగే పట్టణ ప్రాంతంలో అయితే Rs. 12000 కు మించకూడదు.

2. కుటుంబం మొత్తానికి మాగాని 3 ఎకరాలు లేదా మెట్ట భూమి 10 ఎకరాల వరకు లేదా రెండు కలిసి 10 ఎకరాల వరకు ఉండవచ్చు. దానికి మించి ఉండకూడదు.

3. కుటుంబంలో ఎవరికి నాలుగు చక్రాల వాహనం ఉండకూడదు.కానీ ట్రాక్టర్, టాక్సీ, ఆటోలకు దీని నుండి మినహాయింపు ఉంటుంది.

4. ఆదాయపు పన్ను చెల్లిస్తున్న వారు ఆ కుటుంబంలో ఉండకూడదు.

5. ఆ కుటుంబంలో ప్రభుత్వ ఉద్యోగం చేస్తున్నవారు లేదా పెన్షన్ పొందుతున్న వారు ఉండరాదు. కానీ పారిశుద్ధ్య కార్మికులకు దీని నుండి మినహాయింపు ఉంది.

6. ఆ కుటుంబ విద్యుత్ వాడకం నెలకు 300 యూనిట్లు దాటరాదు. దీనిని గడిచిన 12 నెలల సరాసరిగా తీసుకుంటారు.

7. ఆ కుటుంబంలో ఎవరు పేరుమీద కూడా మున్సిపాలిటీ లేదా పట్టణ ప్రాంతాలలో 1000 చదరపు అడుగులకు మించి నిర్మించిన భవనం ఉండకూడదు.

All YSR Pensions Complete Details

వైస్సార్ పెన్షన్ కానుక లొ పెన్షన్ ను దరఖాస్తు చేయుటకు కావాల్సినవి ఏమిటి ?

Application Required Documents YSR Pension Kanuka?

1. ఆధార్ కార్డు

2. కుల ధ్రువీకరణ పత్రము

Aadabidda Nidhi
Aadabidda Nidhi Scheme 2024: Comprehensive to Apply Online

3. ఆదాయ ధ్రువీకరణ పత్రము

4. ఆధార్ అప్డేట్ హిస్టరీ

5. వీటితోపాటు ఏ పెన్షన్ కి అయితే దరఖాస్తు చేస్తున్నారో ఆ పెన్షన్ కి సంబంధించిన పత్రాలు (పెన్షన్ వారీగా దిగువ వివరించబడ్డాయి).

పైన చెప్పిన నియమాలతో పాటు ఏ పెన్షన్ కు మనం దరఖాస్తు చేస్తున్నామో ఆ పెన్షన్ కు సంబంధించిన నియమాలు ఉంటాయి. వాటిని ఇప్పుడు ఒక్కొక్క పెన్షన్ వారీగా చూద్దాం.

All YSR Pensions Complete Details

1.వృద్ధాప్య పెన్షన్:-

వృద్ధాప్య పెన్షన్ రావాలి అంటే దరఖాస్తుదారునికి పైన తెలిపిన నియమాలతో పాటు 60 సంవత్సరాలు వయస్సు లేదా అంతకంటే ఎక్కువ వయస్సు ఆధార్ కార్డులో ఉండాలి. అదేవిధంగా ఎస్టీ దరఖాస్తుదారులకు 50 సంవత్సరాలు ఉంటే సరిపోతుంది.

2. వితంతువు :

18 సంవత్సరాలు వయస్సు మించిన మహిళల యొక్క భర్త చనిపోయినటువంటి వారు భర్త మరణ ధ్రువీకరణ పత్రం తో ఈ పెన్షన్ దరఖాస్తు చేసుకోవచ్చు.

3.వికలాంగులు :-

ఏ వ్యక్తికి అయితే వైకల్యం 40% లేదా అంతకంటే ఎక్కువ ఉంటుందో వారికి సదరం సర్టిఫికెట్ ఆధారంగా దరఖాస్తు చేసుకోవాలి. ఈ పెన్షన్ కు వయసుతో సంబంధం లేదు.

4.ఒంటరి మహిళ పెన్షన్ :-

భర్త విడిచిపెట్టి సంవత్సరకాలం పైబడిన లేదా వివాహం కానీ మహిళలకు ఈ పెన్షన్ వర్తిస్తుంది. ఈ పెన్షన్ రావడానికి కచ్చితంగా 50 సంవత్సరాలు లేదా ఆ పైబడి ఉండాలి. మండల తాసిల్దారు వారు జారీ చేసిన ఒంటరి మహిళ సర్టిఫికెట్ ఉండాలి.

4.ఒంటరి మహిళ పెన్షన్ :

భర్త విడిచిపెట్టి సంవత్సరకాలం పైబడిన లేదా వివాహం కానీ మహిళలకు ఈ పెన్షన్ వర్తిస్తుంది. ఈ పెన్షన్ రావడానికి కచ్చితంగా 50 సంవత్సరాలు లేదా ఆ పైబడి ఉండాలి. మండల తాసిల్దారు వారు జారీ చేసిన ఒంటరి మహిళ సర్టిఫికెట్ ఉండాలి.

5.నేత కార్మికులు :-

50 సం. లు నిండిన చేనేత కార్మికులు ఈ పెన్షన్ కు అర్హులు. అయితే చేనేత శాఖ నుండి ధ్రువీకరణ పత్రం సమర్పించాలి.

6. గీత కార్మికులు :-

50 సంవత్సరాలు లేదా ఆపైన వయస్సు గల కల్లుగీత కార్మికులు దీనికి అర్హులు. దీని కొరకు టోడి కో-ఆపరేటివ్ సొసైటీ (TCS) లో సభ్యత్వం ఉండాలి లేదా ఎక్సెజ్ శాఖ నుండి గుర్తింపు పత్రం పొందాలి. a

7. ట్రాన్స్ జెండర్ :-

ట్రాన్స్ జెండర్ పెన్షన్ కొరకు సంబంధిత జిల్లా వైద్య శాఖ వారి ధ్రువీకరణ పత్రం ఉండాలి.

8.మత్స్యకారులు :-

50 సంవత్సరాలు వయస్సు లేదా ఆ పైబడిన వయస్సు గల మత్స్యకారులు ఈ పెన్షన్ కు అర్హులు. అయితే మత్స్యశాఖ నుండి ధృవీకరణ పత్రం ఉండాలి.

9.కళాకారుల పెన్షన్లు :-

కళాకారుల పెన్షన్ పొందుటకు సంబంధిత శాఖ నుండి ధ్రువీకరణ పత్రము ఉండాలి.దీనికి కనీస అర్హత వయస్సు 50 సంవత్సరాలు లేదా ఆ పైబడిన వయసు వారు అర్హులు.

10.డయాలసిస్ పెన్షన్లు :-

కిడ్నీ వ్యాధితో బాధపడుతూ ప్రభుత్వ లేదా ప్రైవేటు ఆసుపత్రిలో డయాలసిస్ పొందుతున్నవారు ఈ పెన్షన్ కు అర్హులు. ఈ పెన్షన్ పొందుటకు కనీస అర్హత వయస్సు అంటూ ఏమీ లేదు.

11.సాంప్రదాయ చెప్పులు కుట్టేవారు :-

సాంప్రదాయ చెప్పులు కుట్టేవారు ఎవరైతే వున్నారో వారి వయసు 40 సంవత్సరాలు లేదా ఆ పైబడి ఉంటుందో వారికి ఈ పెన్షన్ వస్తుంది. వీరు సాంఘిక సంక్షేమ శాఖలో నమోదయి ఉండాలి. అక్కడ నుండి జాబితా ప్రభుత్వానికి వెళుతుంది.

12. డప్పు కళాకారులు :-

50 సంవత్సరాలు లేదా ఆ పైబడిన వయసు గల డప్పు కళాకారులు ఈ పెన్షన్ కు అర్హులు అయితే వీరు సాంఘిక సంక్షేమ శాఖ వద్ద రిజిస్ట్రేషన్ అయి ధ్రువీకరణ పత్రం ఉండాలి.

13.దీర్ఘకాలిక మూత్రపిండ వ్యాధులు :-

దీర్ఘకాలికంగా మూత్రపిండ వ్యాధి (స్టేజ్ 3,4,5)తో బాధపడుతున్న వారు ఈ పెన్షన్ కు అర్హులు. డయాలసిస్ చేయించుకోకపోయినా ఈ పెన్షన్ కి అర్హులు. అయితే ఈ పెన్షన్ కొరకు జిల్లా ప్రభుత్వ వైద్య ఆరోగ్య శాఖ నుండి ప్రభుత్వానికి ప్రతిపాదనలు వెళ్తాయి.

14.దీర్ఘకాల వ్యాధులు :-

దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతున్న వారు అనగా తల సేమియా, సికిల్ సెల్ ఎనీమియా, తీవ్రమైన హిమోఫిలియా వంటి వ్యాధులు తో బాధపడుతున్న వారు ఈ పెన్షన్ కు అర్హులు. ఈ పెన్షన్ పొందుటకు ప్రతిపాదనలు జిల్లా వైద్య ఆరోగ్య శాఖ నుండి ప్రభుత్వానికి వెళ్తాయి. ప్రభుత్వం మంజూరు చేసిన తరువాత మీ సంబంధిత గ్రామ సచివాలయం నుండి మీకు తెలియజేయడం జరుగుతుంది.

15.ఎయిడ్స్ వ్యాధిగ్రస్తులు :-

ఎయిడ్స్ వ్యాధితో బాధపడుతూ యాంటీ రెట్రో వైరల్ థెరపీ సెంటర్ లో కనీసం ఆరు నెలల నుండి చికిత్స పొందుతున్న వారు ఈ పెన్షన్ కు అర్హులు. ఈ పెన్షన్ కూడా జిల్లా వైద్య ఆరోగ్య శాఖ నుంచి ప్రభుత్వానికి ప్రతిపాదనలు వెళ్తాయి. అక్కడి నుంచి మంజూరు అయి వస్తాయి.

AP New Pensions 2024
కొత్త పెన్షన్లపై ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం: అర్హులందరికీ త్వరలో పెన్షన్లు

16.అభయ హస్తం :-

మహిళా సంఘాలలో సభ్యత్వం గల మహిళలు ప్రతి సంవత్సరం 365 రూపాయలు రుసుము చెల్లిస్తే వారికి 60 సంవత్సరాలు వయస్సు వచ్చేటప్పుడు ప్రతినెల 500 రూపాయలు పెన్షన్ రూపంలో వస్తుంది. ఈ పెన్షన్ కు మిగిలిన పెన్షన్లతో సంబంధం ఉండదు .ఈ పెన్షన్ వస్తూ వేరే పెన్షన్ కూడా రావచ్చు.

17. పక్షవాతం :-

ఎవరైతే పక్షవాతం తో బాధపడుతూ మంచం నుండి కదలలేని లేదా వీల్ చైర్ లో ఉన్నటువంటి వారికి ఈ పెన్షన్ వర్తిస్తుంది. అలాగే తీవ్రమైన కండరాల బలహీనతతో బాధపడుతూ మంచానికి పరిమితమై లేదా వీల్ చైర్ కు పరిమితమైన వారు కూడా అర్హులే.

All YSR Pensions Complete Details

పెన్షన్ కు ఎంత డబ్బులు వస్తాయి?

What is YSR Pension Pension Amount?

పైన తెలిపిన 17 రకాల పెన్షన్స్ లో ఒక్కొక్క పెన్షన్ కు ఒక్కొక్క విధమైనటువంటి డబ్బులు వస్తాయి అవేంటో ఇప్పుడు దిగువ తెలుపబడింది.

1. వృద్ధాప్య పెన్షన్ – Rs.2750

2. వితంతువు – Rs.2750

3. వికలాంగులు – Rs.3000

4. ఒంటరి మహిళ పెన్షన్ – Rs.2750

5. నేత కార్మికులు – Rs.2750

6. గీత కార్మికులు – Rs.2750

7. ట్రాన్స్ జెండర్- Rs. 3000

8. మత్స్యకారులు – Rs.2750

9. కళాకారుల పెన్షన్లు – Rs.3000

10. డయాలసిస్ పెన్షన్లు – Rs.10000

11. సాంప్రదాయ చెప్పులు కుట్టేవారు – Rs.2750

12. డప్పు కళాకారులు – Rs.3000

13. దీర్ఘకాలిక మూత్రపిండ వ్యాధులు – Rs.10000

14. దీర్ఘకాల వ్యాధులు- Rs. 3000 to Rs.10000

15. ఎయిడ్స్ వ్యాధిగ్రస్తులు – Rs.2750

16. అభయ హస్తం – Rs.500

17. పక్షవాతం – Rs.5000 లేదా Rs. 10000 (వ్యాధి తీవ్రత బట్టి)

All YSR Pensions Complete Details

Note:- ఇటీవల గౌరవ ముఖ్యమంత్రి గారు జనవరి 1, 2024 నుండి ఏ పెన్షన్స్ అయితే Rs.2750 ఉన్నాయో ఆ పెన్షన్స్ 3000 రూపాయలకు పెంచడం జరుగుతుందని ప్రకటన చేశారు.

పైన తెలిపిన సమాచారం కేవలం విషయ పరిజ్ఞానానికి మాత్రమే అందించడం జరిగింది. పూర్తి వివరాలు కొరకు మీకు దగ్గరలో ఉన్న గ్రామ, వార్డు సచివాలయానికి గాని లేదా సంబంధిత అధికారులను గాని కలిసి పూర్తి వివరాలు పొందవచ్చు.

All YSR Pensions Complete Details

More Useful Links

YSR Pension Kanuka official WebsiteClick Here

All YSR Pensions Complete Details

All YSR Pensions Complete Details

All YSR Pensions Complete Details

 

Rate this post

ప్రభుత్వ పథకాలు, ప్రభుత్వ ఉద్యోగాలు, ప్రైవేట్ కంపెనీ ఉద్యోగాల గురించి రోజువారీ సమాచారాన్ని పొందడానికి మా వాట్సాప్ ఛానెల్‌లో మరియు టెలిగ్రామ్ ఛానెల్‌లో చేరండి

Telegram Channel Join Now
WhatsApp Channel Join Now

Related Job Posts

Aadabidda Nidhi

Aadabidda Nidhi Scheme 2024: Comprehensive to Apply Online

AP New Pensions 2024

కొత్త పెన్షన్లపై ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం: అర్హులందరికీ త్వరలో పెన్షన్లు

Aadabidda Nidhi Eligibility 1500 per month

Aadabidda Nidhi Eligibility 1500 per month

Leave a comment