ఆడుదాం ఆంధ్ర రిజిస్ట్రేషన్ విధానం | Aadudam Andhra Registration Process
Aadudam Andhra Registration Process, Team Creation, Prize Money, Guidelines
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం గ్రామీణ స్థాయిలో క్రీడలను ప్రోత్సహించడానికి ఆడుదాం ఆంధ్రా అనే ఒక కొత్త కార్యక్రమాన్ని ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం ప్రారంభించింది.
• ఈ కార్యక్రమంలో 15 సంవత్సరాల వయస్సు పైన ఉన్న ప్రతి ఒక్కరూ పాల్గొనవచ్చు.
• ఆటగాడు గ్రామంలో శాశ్వత నివాసి కావచ్చు లేదా తాత్కాలికంగా గ్రామం/పట్టణంలో ఉండవచ్చు.లేదా గ్రామంలో చదువుకోవచ్చు. పట్టణాలు GS/WS స్థాయిలో పాల్గొనవచ్చు.
• ఆడుదాం ఆంధ్రా టోర్నమెంట్లో ఆడేందుకు ఉద్దేశపూర్వకంగా గ్రామానికి వచ్చిన క్రీడాకారులు అర్హులు కారు.
• క్రీడాకారులు 15 సంవత్సరాల కంటే ఎక్కువ వయస్సు కలిగి ఉండాలి మరియు పాల్గొనడానికి గరిష్ట వయోపరిమితి లేదు.
• ప్రభుత్వ ఉద్యోగులు, పచివాలయం ఉద్యోగులు మరియు వాలంటీర్లు అందరూ ఆడుదం ఆంధ్రా టోర్న మెంట్లో పాల్గొనేందుకు అర్హులు కారు.
• ఒక క్రీడాకారుడు గరిష్టంగా రెండు విభాగాల్లో మాత్రమే పాల్గొనవచ్చు..
• టోర్నీని నాకౌట్ పద్ధతిలో నిర్వహించనున్నారు.
• ఈవెంట్లు పురుషులు మరియు మహిళలకు వేర్వేరుగా నిర్వహించిబడతాయి.
• రిజిస్ట్రేషన్ పై ఎటువంటి సమస్యలు ఉన్న 8977611399 నెంబర్కు ఫోన్ చెయ్యవచ్చు .
Aadudam Andhra Registration Process
టోర్నమెంట్లు విధానం ఎలా ఉంటుంది ?
ఈ టోర్నమెంట్లు డిసెంబర్ 15వ తేదీ నుంచి 2024 ఫిబ్రవరి 3వ తేదీ వరకు నిర్వహించనున్నారు. ఈ కార్యక్రమం ద్వారా గ్రామీణ యువతలో క్రీడా స్ఫూర్తి పెంపొందించడంతో పాటు, వారి ఆరోగ్యాన్ని మెరుగుపరచడం లక్ష్యంగా పెట్టుకున్నది ప్రభుత్వం.
Aadudam Andhra Registration Process
రిజిస్ట్రేషన్ కు కావలసిన వివరములు :
1. ప్లేయర్ ఆధార్ నెంబరు
2. ప్లేయర్ మొబైల్ నెంబరు
3. మొబైల్ నెంబర్ కు వచ్చే ఓటీపీ
4. పాస్పోర్ట్ సైజ్ ఫోటో
5. పేరు
6. డేట్ అఫ్ బర్త్
7. చిరునామా
8. వాలంటరీ పేరు
9. వాలంటరీ మొబైల్ నెంబరు
Aadudam Andhra Registration Process
ఆడుదాం ఆంధ్రాలో ఆన్ లైన్ రిజిస్ట్రేషన్ అవ్వడం ఎలా ?
Aadudam Andhra Online Registration Process
Step 1 : ముందుగా ఆడుదాం ఆంధ్ర వెబ్ సైట్ ఓపెన్ చేసి రిజిస్టర్ యాజ్ ప్లేయర్ ని సెలెక్ట్ చేసుకోవాలి.
Step 2: Register Now ! అనే ఆప్షన్ పై క్లిక్ చేయాలి .
Step 3: Register as Player అనే ఆప్షన్ ను ఎంచుకోవాలి. ప్లేయర్ ఆధార్ నెంబర్ ఎంటర్ చేయాలి. User Consent పై టిక్ చేసి, Accept పై క్లిక్ చేయాలి.
Step 4 : ప్లేయర్ మొబైల్ నెంబర్ ఎంటర్ Get OTP పై క్లిక్ చేయాలి.
Step 5: Info పేజీ ఓపెన్ అవుతుంది. OK పై క్లిక్ చేయాలి.
Step 6 : OTP ఎంటర్ చేసి Confirm OTP పై క్లిక్ చేయాలి.
Step 7: Competitive Games లో ఒకటి లేదా రెండు టిక్ చేయాలి. Non Competitive Games లో నచ్చినవి సెలెక్ట్ చేసుకోవాలి.ప్లేయర్ ఫోటో అప్లోడ్ చేయాలి
Step 8: వాలంటీర్ వద్ద హౌస్ మాపింగ్ ప్రకారం ఆధార్ ప్రకారం వివరాలు వస్తాయి. రాకపోతే వివరాలు ఎంటర్ చేయాలి. అందులో సచివాలయం పేరు సచివాలయం ఉన్న పిన్కోడు వాలంటరీ పేరు వాలంటరీ మొబైల్ నెంబరు ఎంటర్ చేయాలి.
Step 9: తర్వాత చిరునామా రుజువు పత్రాన్ని సెలెక్ట్ చేసుకుని అప్లోడ్ చేయాలి. తరువాత రిజిస్టర్ పై క్లిక్ చేయాలి.
Step 10: ప్లేయర్ యొక్క రిజిస్ట్రేషన్ కార్డు వస్తుంది పిడిఎఫ్ రూపంలో డౌన్లోడ్ చేసుకొని ప్రింట్ తీసుకుంటే సరిపోతుంది రిజిస్ట్రేషన్ ప్రక్రియ ఇంతటితో పూర్తి అయినట్టు.
Aadudam Andhra Registration Process
అన్ లైన్ లో మీ టీం దరఖాస్తు చేసుకోవటం ఎలా ?
Aadudam Andhra Team Creation Process
Step 1: క్రికెట్, వాలీ బాల్ వంటి Team Event లో పాల్గొనే క్రీడాకారులు ముందుగా పైన తెలిపిన విధంగా ప్రతి ఒక్కడు వ్యక్తిగతంగా రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. ఆ విధంగా ఒక గ్రామ సచివాలయం నుండి ఎవరైతే మీ టీంలో ఆడాలి. అనుకుంటున్నారో అంతమంది వ్యక్తిగతంగా రిజిస్ట్రేషన్ చేసుకావాలి.
Step 2: తర్వాత అందులో ఎవరైతే కెప్టెన్ గా ఉంటారో ఆ వ్యక్తి రిజిస్ట్రేషన్ అయిన మొబైల్ నెంబర్ తో లాగిన్ అయ్యి తరువాత My Team అని ఆప్షన్ను ఎంపిక చేసుకోగానే ఆ గ్రామ సచివాలయం పరిధి లో ఆ ఆట కు. సంబంధించి రిజిస్టర్ అయిన ప్లేయర్ల అంతమంది కనిపిస్తారు.
Step 3: అక్కడ కనిపిస్తున్న పేర్ల నుండి మీ టీం లో చేర్చుకోవలసిన వారి పేర్లను ఒక్కొక్కరుగా ఎంపిక చేసుకోవాలి, ముందుగా ఒక ప్లేయర్ను ఎంపిక చేసుకోగానే ఆ ప్లేయర్ ఏ మొబైల్ నెంబర్ తో రిజిస్టర్ అయ్యున్నారో అ మొబైల్ నెంబర్ ను టైప్ చేసి Get OTP పై క్లిక్ చేయగానే అతని మొబైల్ నెంబర్ కు ఓటీపీ వెళ్తుంది. ఆ ఓటీపీని ఎంటర్ చేసి. సబ్మిట్ చేయగానే అతను మీ టీం లో నమోదు అవుతారు. ఈ విధంగా మీ టింలో అంతమంది మెంబర్లను ఎంపిక చేసి సబ్మిట్ బటన్ పై క్లిక్ చేయగానే మీ టీం తదుపరి లాగిన్లకు వెళుతుంది.
Aadudam Andhra Registration Process
రిజిస్ట్రేషన్ ఎక్కడెక్కడ చేసుకోవచ్చు ?
• 15 ఏళ్లు పైబడిన వారందరూ ఈ పోటీలకు రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు.
• పైన తెలిపిన విధంగా మీ మొబైల్ ఫోన్ సహాయం తో online Registration .
• రిజిస్ట్రేషన్ చేసుకోవడానికి 1092కి కాల్ చేయవచ్చు లేదా మీ సమీపంలోని సచివాలయాన్ని సంప్రదించవచ్చు.
Aadudam Andhra Registration Process
ఆడుదాం ఆంధ్రా పోటీల విజేతలకు ప్రైజ్ మనీ ఎంత ?
State Level
SN | Cricket,Volleyball,Kabaddi,Kho Kho | Badminton |
First Prize | 5,00,000 | 2,00,000 |
Second Prize | 3,00,000 | 1,00,000 |
Third Prize | 2,00,000 | 50,000 |
District Level
SN | Cricket,Volleyball,Kabaddi,Kho Kho | Badminton |
First Prize | 60,000 | 35,000 |
Second Prize | 30,000 | 20,000 |
Third Prize | 10,000 | 10,000 |
Coinstituency level
SN | Cricket,Volleyball,Kabaddi,Kho Kho | Badminton |
First Prize | 35,000 | 20,000 |
Second Prize | 15,000 | 10,000 |
Third Prize | 5000 | 5000 |
Aadudam Andhra Registration Process
క్రికెట్, వాలీబాల్, కబడ్డీ, ఖోఖో పోటీలకు
నియోజకవర్గ స్థాయిలో తొలి స్థానంలో నిలిస్తే రూ.35 వేలు, జిల్లాస్థాయిలో రూ.60 వేలు, రాష్ట్రస్థాయిలో రూ.5 లక్షలుగా ఉంది.
రెండో ప్రైజ్ నియోజకవర్గస్థాయిలో రూ.15 వేలు, జిల్లాస్థాయిలో రూ.30 వేలు, రాష్ట్రస్థాయిలో రూ.3 లక్షలుగా నిర్ణయించారు.
మూడో ప్రైజ్ నియోజకవర్గ స్థాయిలో రూ.5 వేలు, జిల్లాస్థాయిలో రూ.10 వేలు, రాష్ట్రస్థాయిలో రూ.2 లక్షలుగా నిర్ణయించారు.
Aadudam Andhra Registration Process
బ్యాండ్మింటన్ డబుల్స్ విభాగంలో
• మొదటి బహుమతి ప్రైజ్ మనీ నియోజకవర్గ స్థాయిలో రూ. 20 వేలు, జిల్లాస్థాయిలో రూ.35 వేలు, రాష్ట్రస్థాయిలో రూ.2 లక్షలుగా నిర్ణయించారు.
రెండో ప్రైజ్ నియోజకవర్గస్థాయిలో రూ.10 వేలు, జిల్లాస్థాయిలో రూ.20 వేలు, రాష్ట్రస్థాయిలో రూ. 1 లక్షగా నిర్ణయించారు.
• మూడో ప్రైజ్ కింద నియోజకవర్గ స్థాయిలో రూ.5 వేలు, జిల్లాస్థాయిలో రూ.10 వేలు, రాష్ట్రస్థాయిలో రూ.50 వేలుగా నిర్ణయించారు
Aadudam Andhra Registration Process
కార్యక్రమం ఎలా జరుగుతుంది ?
• కార్యక్రమం ఐదు దశల్లో జరుగుతుంది:
• గ్రామ/వార్డు సచివాలయ స్థాయి: 15,004 గ్రామ/వార్డు సచివాలయాల పరిధిలో మొత్తం 1.50 లక్షల మ్యాచ్లు జరుగుతాయి.
• మండల స్థాయి: 680 మండలాల్లో మొత్తం 1.42 లక్షల మ్యాచ్లు జరుగుతాయి.
• నియోజకవర్గ స్థాయి: 175 నియోజకవర్గాల్లో 5,250 మ్యాచ్లు జరుగుతాయి.
• జిల్లా స్థాయి: 26 జిల్లాల్లో 312 మ్యాచ్లు జరుగుతాయి.
• రాష్ట్ర స్థాయి: 250 మ్యాచ్లు జరుగుతాయి.
• ఈ కార్యక్రమంలో క్రికెట్, వాలీబాల్, ఖోఖో, కబడ్డీ, బ్యాడ్మింటన్ డబుల్స్తో పాటు సంప్రదాయ యోగా, టెన్నీకాయిట్, మారథాన్ పోటీలు కూడా నిర్వహించబడతాయి.
• విజేతలకు భారీగా నగదు బహుమతులు, సర్టిఫికెట్లు, మెమెంటోలు ఇవ్వబడతాయి.
• ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం గ్రామీణ స్థాయిలో క్రీడలను ప్రోత్సహించడానికి ప్రారంభించిన ఆడుదాం ఆంధ్రా పోటీల విజేతలకు భారీగా నగదు బహుమతులు ఇవ్వనున్నారు.
Aadudam Andhra Registration Process
Adudam Andhra Tournament Guidlines – ఆడుదాం ఆంధ్ర పోటీల సమాచారం – Click here
Table of Contents
Hi 👋
Unfortunately I did the mistake of team creation in aadudam Andhra cricket team. The mistake is I added to that team me only . Right now my village captain trying to add me but thta showing unavailable .so How to exit and add to my village team. Pls resolve my problem
పంచాయతి కార్యదర్శి వారి లాగిన్ లో టీమ్ ఎడిట్ ఆప్షన్ ఇవ్వడం జరిగింది. టీమ్స్ ఆమోదం , టీం డిలీట్, టీం సభ్యుల డిలీట్ చేయుట, టీం లో ప్లేయర్ ను జోడించటం, కొత్త టీం ను ఏర్పాటు చేసే ఆప్షన్ లు PS వారి లాగిన్ లో ఉన్నాయి.