Aadhaar Document Update Process in Telugu
ఆధార్ డాక్యుమెంట్ అప్డేట్
Aadhar Document Update Process in Telugu
ఆధార్ డాక్యుమెంట్ అప్డేట్ అంటే ఏమిటి ?
What Is Aadhar Document Update ?
2010 నుంచి 2016 వరకు ఆధార్ ఇచ్చేటప్పుడు ఎలాంటి డాక్యుమెంట్స్ తీసుకోకుండా ఆధార్ ఇవ్వబడింది. అయితే ఇప్పుడు ఇందులో ఉన్న బోగస్ ఆధార్ కార్డులను ఏరివేయడానికి సెంట్రల్ గవర్నమెంట్ ప్రతి ఆధార్ ఉన్న పౌరుడు వారి పేరు & అడ్రస్ను సరైన ఆధారాలతో ధృవీకరించుకోవాలి.
ఆధార్ డాక్యుమెంట్ అప్డేట్ ఎవరు చేసుకోవాలి ?
Trending Post
ఆధార్ కార్డుకు మొబైల్ నెంబర్ లింక్ స్టేటస్ తెలుసుకునే విధానము
whom to do Aadhar Document Update ?
ఆధార్ కార్డు పొంది 10 సంవత్సరాలు దేటిన ప్రతీ ఒక్కరు కూడా ఆధార్ డాక్యుమెంట్ అప్డేట్ చేసుకోవాలి.
ఆధార్ డాక్యుమెంట్ అప్డేట్ చేసుకోటానికి ఎం ఎం కావాలి?
What is required for Aadhar Document Update ?
ఆధార్ డాక్యుమెంట్ అప్డేట్ కోసం మీ POI అనగా పేరు, ఫోటో కలిగి, POA అనగా చిరునామా కలిగిన ఒరిజినల్ ఆధారాలను ఆన్లైన్ లో అప్లోడ్ చేసి చేసుకోవాలి.
ఆధార్ బయోమెట్రిక్ అప్డేట్ మరియు ఆధార్ డాక్యుమెంట్ అప్డేట్ కు తేడా ఏంటి?
What is difference between Aadhar Biometric Update and Aadhar Document Update ?
ఆధార్ డాక్యుమెంట్ అప్డేట్ మరియు ఆధార్ బయోమెట్రిక్ అప్డేట్ వేరు. బయోమెట్రిక్ అప్డేట్ అనగా బయోమెట్రిక్ / కళ్ళు / చేతి వేళ్ళు అప్డేట్ చేయటం, అదే ఆధార్ డాక్యుమెంట్ అప్డేట్ అంటే మీ డాక్యుమెంట్ లు అప్లోడ్ చేయటం.ఆధార్ డాక్యుమెంట్ అప్డేట్ చేసాక ఆధార్ కార్డులో ఏ మార్పులు జరగవు కొత్త కార్డు రాదు, కానీ ఆధార్ కార్డు అప్డేట్ లో ఉంటుంది.
ఆధార్ వచ్చిన సవత్సరం ఎలా తెలుసుకోవాలి?
How to Find Aadhar start or Generated Date ?
ఆధార్ కార్డులు జనరేట్ అయిన కొత్తలో లేదా అప్డేట్ చేసుకున్న తరువాత ఇంటి చిరునామాకు / Online లో జనరేట్ చేసుకున్న ఆధార్ లో ఎడమ వైపు ఆధార్ జనరేట్ అయిన తేదీ ఉంటుంది. ఉదాహరణకు 03/08/2012 అని ఉంటే ఆ ఆధార్ కార్డు 2012 లో జనరేట్ అయ్యింది అని అర్థము. వారికి ఆధార్ డాక్యుమెంట్ చేయాలి అని అర్థము. అలా 2016 వరకు ఉన్న వాటికీ చెయ్యాలి.
ఆధార్ డాక్యుమెంట్ అప్డేట్ ఎన్ని విధాలుగా చేసుకోవచ్చు ?
How many ways to do Aadhar document update ?
ఆధార్ డాక్యుమెంట్ అప్డేట్ ను రెండు రకములుగా చేసుకోవచ్చు. మీ సొంత లాగిన్ లో మరియు ఆధార్ సేవా కేంద్రాల్లో. మీ సొంత లాగిన్ లో చేసుకోటానికి మీ ఆధార్ కు మొబైల్ నెంబర్ లింక్ ఉంటే సరిపోతుంది. అదే ఆధార్ సేవా కేంద్రాల్లో చేయటానికి ఆధార్- మొబైల్ లింక్ అవసరం లేదు.
Aadhaar Document Update Process in Telugu
ఆధార్ లొ పేరు, ప్రూఫ్ లొ పేరు ఒకేలా ఉండాలా ?
What are the exceptions of POI for Aadhar document update?
ఆధార్ కార్డులో ఉన్న పేరు మరియు POI Proof లో ఉన్న పేరు కొన్ని వెసులుబాటులు ఇవ్వటం జరిగింది అవి,
1. ఇంటి పేరు, పేరు తారు మారు అయినా పర్వాలేదు[ex Ande Obulesu (Aadhar), Obulesu Ande (POI) ]
2. చిన్న స్పెల్లింగ్ తప్పు ఉన్న పర్వాలేదు [ex Ande Obulesu (Aadhar), Ande Obulesu (POI) ]
3. పలికే టప్పుడు ఒకేలా విన్నపడిన పర్వాలేదు
4. మొత్తం పేరుకు బదులు లెటర్ లు మాత్రేమే ఉన్న ລ້ [ex Ande Obulesu(Aadhar), A Obulesu(POI) or A Obulesu(Aadhar), Ande Obulesu(POI]
5. ఆధార్ ఇంటి పేరు ఉంది POI లో లేకుండా POI లో C/O లో ఇంటి పేరు ఉంటే పర్వాలేదు. [ ex Ande Obulesu (Aadhar), Obulesu(POI) and Ande Is Surname of C/O]
6. PAN కార్డును సంతకం ఉన్నా, లేకున్న పర్వాలేదు.
Aadhaar Document Update Process in Telugu
ఆధార్ లొ చిరునామా, ప్రూఫ్ లొ చిరునామా ఒకేలా ఉండాలా ?
What are the exceptions of POA for Aadhar document update ?
ఆధార్ కార్డులో ఉన్న చిరునామా మరియు POA Proof లో ఉన్న చిరునామా కోసం మాత్రమే కొన్ని వెసులుబాటులు
ఇవ్వటం జరిగింది. అవి
1. గ్రామం పేరు మరియు మండలం లేదా జిల్లా సరిగా ఉండి POA లో PIN కోడ్ లేకపోయినా పర్వాలేదు.
2. గ్రామం పేరు మరియు PIN కోడ్ సరిగా ఉండి POA లో మండలం / జిల్లా పేర్లు లేకపోయినా పర్వాలేదు.
3. POA కు ఆధార్ కు ల్యాండ్ మార్క్, వార్డ్ నెంబర్ వంటి వాటిలో చిన్న తేడాలు ఉన్నా పర్వాలేదు.
4. దరఖాస్తు దారుడు అప్లికేషన్ లో ఎక్కువ వివరాలు ఇచ్చి, POA లో అన్ని లేకపోయినా పర్వాలేదు.
ఆధార్ డాక్యుమెంట్ అప్డేట్ కు ఫీజు ఎంత ?
What is the fee for Aadhar document update ?
ఆధార్ డాక్యుమెంట్ అప్డేట్ ను మీ సొంత లాగిన్ లో జూన్ 14 2024 వరకు ఉచితంగా చేసుకోవచ్చు. జూన్ 14 తరువాత మాత్రం సొంత లాగిన్ లో చేసుకుంటే 25/- ఛార్జ్ ఉంటుంది. ఆధార్ సేవా కేంద్రాల్లో మాత్రం ఎప్పుడు 50/- ఛార్జ్ ఉంటుంది.
Aadhaar Document Update Process in Telugu
సొంతముగా ఆధార్ డాక్యుమెంట్ అప్డేట్ ఎలా చేసుకోవాలి ?
how to do Aadhar document update in Self login?
how to do Aadhar document update in mobile ?
సొంత లాగిన్ లో ఆధార్ డాక్యుమెంట్ అప్డేట్ చేసుకునే విధానము :
Step 1 : మొదట కింద ఇవ్వబడిన వెబ్ సైట్ ను ఓపెన్ చేయాలి.
(Click Here పై క్లిక్ చేయండి)
Step 2 : Login పై క్లిక్ చేయాలి
Step 3: Enter Aadhaar వద్ద 12 ఆధార్ నెంబర్ ఎంటర్ చేయాలి. Enter Above Captcha వద్ద Captcha Code ఎంటర్ చేయాలి. Send OTP పై క్లిక్ చేయాలి. Enter OTP వద్ద 6 అంకెల OTP ఎంటర్ చేసి Login పై క్లిక్ చేయాలి.
ఆధార్ కార్డుకు, మొబైల్ నెంబర్ లింక్ స్టేటస్ తెలుసుకునే విధానము
Step 4 : మీ గుర్తింపు రుజువు (POI) మరియు చిరునామా రుజువు (POA)లు అప్డేట్ చేయటం కోసం Document Update అనే ఆప్షన్ పై క్లిక్ చేయాలి.
Step 5: Objective of Document Update Service లో అన్ని వివరాలు వస్తాయి. POI మరియు POA లో ఉన్న వివరాలు మరియు ఆధార్ లో ఉన్న వివరాలు తో సరిపోవాలి లేదంటే అప్డేట్ అవ్వవు. అన్ని విషయములు చదువుకొని NEXT పై క్లిక్ చేయాలి.
Step 6: How It Works? అనే పేజీ ఓపెన్ అవుతుంది . అందులో మొత్తం 3 స్టెప్ లుగా అప్డేట్ చేసుకోవటం చూపిస్తుంది. Next పై క్లిక్ చేయాలి.
Step 7: Please Verify Your Demographic Details అనే పేజీ ఓపెన్ అవుతుంది. అందులో ఆధార్ లో ఉన్న డేటా చూపిస్తుంది. పేరు, లింగము, పుట్టిన తేదీ, చిరునామా అన్ని చూసుకొని Verify That Above Details Are Correct పై క్లిక్ చేయాలి. Upload చేసే డాక్యుమెంట్లు 2 MB లోపు ఉంటూ JPEG, PNG, PDF రూపం లో ఉండాలి.
Step 8: Please Upload Proof Of Identity (POI) Document Select Valid Supporting Document Type లో మీరు అప్లోడ్ చేసే డాక్యుమెంట్ సెలెక్ట్ చేసుకోవాలి.
Step 9 : ఏ డాక్యుమెంట్ సెలెక్ట్ చేసుకున్న ໙໕ Document Advisory చదువుకోని Okay పై క్లిక్ చేయాలి. అదే విదంగా చిరునామా సంబందించిన డాక్యుమెంట్ అప్లోడ్ చేసాక Next పై క్లిక్ చేయాలి.
Step 10: “Please Confirm Your Demographic Details In The Documents Exactly Matches With Your Demographic Details In Aadhar” పాప్ అప్ వస్తుంది. Okay పై క్లిక్ చేయాలి. తరువాత పేమెంట్ పేజీ కు తీసుకు వెళ్తుంది.
Step 11: I Hereby Confirm That I Have Read The Understand The Payment Cancellation Refund Process అని ఉన్న దగ్గర టిక్ చేసి Make Payment పై క్లిక్ చేయాలి. 2023 మార్చి 15 నుంచి సెప్టెంబర్ 14 వరకు ఉచితం .అన్ని వివరాలు చూసుకొని Submit పై క్లిక్ చేయాలి
Step 12: SRN అనే నెంబర్ తో డౌన్లోడ్ చేసుకొని ఉంచుకోవాలి. స్టేటస్ చూసుకోటానికి ఉపయోగపడుతుంది.
Step 13 : Process మధ్యలో ఆగి పోతే Dashboard ఆప్షన్ మీద క్లిక్ చేసి Document Update వద్ద Resume పై క్లిక్ చేసి మరలా ఎక్కడ ఆగిందో అక్కడ నుంచి చేయువచ్చు.
Aadhaar Document Update Process in Telugu
ఆధార్ డాక్యుమెంట్ అప్డేట్ స్టేటస్ ఎలా తెలుసుకోవాలి ?
How to Know Aadar Document Update Status ?
మీ సొంత లాగిన్ చేసిన ఆధార్ డాక్యుమెంట్ అప్డేట్ స్టేటస్ / ఆధార్ సేవ కేంద్రాల్లో / గ్రామ వార్డు సచివాలయాల్లో చేసిన ఆధార్ డాక్యుమెంట్ అప్డేట్ స్టేటస్ తెలుసుకోటానికి కింద ఇవ్వబడిన లింక్ పై క్లిక్ చేయండి.
Document Update Status Link
మీరు డాక్యుమెంట్ అప్డేట్ చేసుకున్న తరువాత మీకు వచ్చిన SRN / URN 3 ໖໖ ໖໖, Enter Capture ລ້ຜູ້ చూపించిన Captcha కోడ్ ఎంటర్ చేసి Submit పై క్లిక్ చేయాలి. అప్లికేషన్ స్టేటస్ Approved / Under Process / Rejected అనేది చూపిస్తుంది.
ఆధార్ డాక్యుమెంట్ అప్డేట్ కు POI & POA గా ఏ ఏ డాక్యుమెంట్ లు ఉపయోగపడతాయి ?
POI అనగా Proof Of Identity అంటే మీ గుర్తింపు కి సంబందించిన ఏ ఆధారం ఉన్న దానిని ప్రూఫ్ తీసుకోవచ్చు.వీటిలో మీ పేరు, ఫోటో తప్పనిసరిగా ఉండాలి. POA అనగా Proof Of Address అంటే మీ చిరునామాకు సంబందించి ఏ ఆధారం ఉన్న దానిని ప్రూఫ్ గా తీసుకోవచ్చు.వీటిలో మీ పేరు మరియు భారత దేశ చిరునామా ఉండాలి.
POI డాక్యుమెంట్లు :
1. భారతీయ పాస్ పోర్ట్
2. పాన్ కార్డు
3. రేషన్ కార్డు
4. ఆరోగ్యశ్రీ కార్డు
5. ఓటర్ కార్డు
6. డ్రైవింగ్ లైసెన్సు
7. పెన్షన్ ఫోటో ఐడెంటిటీ కార్డు
8. రాష్ట్రీయ స్వస్థ బీమా యోజన కార్డు
9. వికలాంగుల కార్డు
10. డొమెసేల్ సర్టిఫికేట్
11. నివాస ధ్రువీకరణ పత్రము
12. ఉపాధి హామీ జాబు కార్డు
13. లేబరు కార్డు
14. పదవ తరగతి లేదా ఇంటర్మీడియట్ లేదా డిగ్రీ లేదా పై చదువులకు సంబంధించి ఒరిజినల్ మార్క్స్ సీటు
15. ట్రాన్స్ జెండర్ ఐడెంటిటీ కార్డు
16. ఆధార్ స్టాండర్డ్ సర్టిఫికెట్ ఫార్మేట్
17. పెన్షనర్ ఇండక్షన్ డాక్యుమెంటు
18. ఇతర కేంద్ర లేదా రాష్ట్ర రుజువు పత్రము
Note : POI వాడే రుజువు పత్రంలో తప్పనిసరిగా వ్యక్తి యొక్క పేరు మరియు ఫోటో ఆధార్ కార్డులో ఉండేలా ఉండాలి. గ్రూపు ఫోటోతో ఉన్న పరవాలేదు.
POA డాక్యుమెంట్లు :
1. భారతీయ పాస్ పోర్ట్
2. రేషన్ కార్డు
3. ఆరోగ్యశ్రీ కార్డు
4. ఓటర్ కార్డు
5. వికలాంగుల కార్డు
6. డొమెసేల్ సర్టిఫికేట్
7. నివాస ధ్రువీకరణ పత్రము
8. ఉపాధి హామీ జాబు కార్డు
9. లేబరు కార్డు
10. ట్రాన్స్ జెండర్ ఐడెంటిటీ కార్డు
11. విద్యుత్ బిల్లు
12. టెలిఫోన్ ల్యాండ్ లైన్ లేదా పోస్ట్ పెయిడ్ మొబైల్ లేదా బ్రాడ్బ్యాండ్ బిల్లు
13. రిజిస్టర్ ఆఫీసులో ఇచ్చినటువంటి వాలెట్ రిజిస్ట్రేషన్ సేల్ అగ్రిమెంటు లేదా గిఫ్ట్ డీడ్
14. గ్యాస్ కనెక్షన్ బిల్లు
15. కేంద్ర ప్రభుత్వం లేదా రాష్ట్ర ప్రభుత్వం లేదా పిఎస్యు లేదా రెగ్యులేటరీ బాడీస్ లేదా స్టాట్యూచరి బాడీస్ ఇచ్చినటువంటి వసతి కేటాయింపు పత్రము
16. లైఫ్ లేదా మెడికల్ ఇన్సూరెన్స్ పాలసీ
17. పెన్షనర్ యొక్క ఇండక్షన్ డాక్యుమెంట్
18. ఇతర కేంద్ర లేదా రాష్ట్ర రుజువు పత్రము
Note : POA వాడే రుజువు పత్రంలో తప్పనిసరిగా వ్యక్తి యొక్క చిరునామా, ఆధార్ కార్డులోని చిరునామా దగ్గరగా ఉండాలి ఉండాలి.
Aadhaar Document Update Process in Telugu
ఆధార్ డాక్యుమెంట్ అప్డేట్ ప్రశ్న – సమాదానాలు :
Aadhaar Document Update FAQ:
ప్రశ్న : నా ఆధార్ మా అమ్మవాళ్ల ఇంటి పేరుతో ఉంది. నాకు పెళ్లయిన తర్వాత మా అత్తగారింటి పేరుతో ఆధార్ కావాలి. ఇప్పుడు నేను పేరు మార్చుకోవాలంటే ఎలాంటి ప్రూఫ్స్ సబ్మిట్ చేయాలి?
సమాధానం : సబ్ రిజిస్ట్రార్ ఆఫీస్లోలో ఇచ్చిన మ్యారేజ్ సర్టిఫికెట్తో మీ ఇంటి పేరు(ఒకవేళ పేరు మార్చుకున్నట్టయితే దాన్ని కూడా) మార్చుకోవచ్చు.
ప్రశ్న : ఇప్పుడు నేను అడ్రస్ అప్డేట్ చేసుకుంటే మరలా డాక్యుమెంట్ అప్డేట్ చేసుకోవాలా?
సమాధానం : అవసరం లేదు.
ప్రశ్న : నా ఆధార్ లో ఉన్న అడ్రస్, ఇప్పుడు నేను ఉంటున్న అడ్రస్
రెండూ వేరు వేరు.. ఇప్పుడు నేనేం చేయాలి?
సమాధానం: సరైన ఆధారాలతో మీ అడ్రస్ను అప్డేట్
ప్రశ్న : డాక్యుమెంట్ అప్డేట్ చేసుకోకపోతే ఏమవుతుంది?
సమాధానం: డాక్యుమెంట్ అప్డేట్ చేసుకోని వారందరి ఆధార్లు 2023 సెప్టెంబర్ తర్వాత సస్పెండ్ అవుతాయని కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేసింది.
ప్రశ్న : ఆధార్ సస్పెండ్ అయితే ఏమవుతుంది?
సమాధానం: ఆధార్ సస్పెండ్ అయితే ఆధార్ లింక్ అయిన అన్ని సర్వీసులూ నిలిచిపోతాయి. అనగా బ్యాంకింగ్, పోస్టల్, గ్యాస్ వంటి అన్నిరకాల సేవలూ ఆగిపోతాయి. స్టేట్ & సెంట్రల్ గవర్నమెంట్ రెండింటి నుంచి రావాల్సిన స్కీమ్స్ అన్ని ఆధార్తో సంబంధించినవే గనుక అన్ని పథకాలు వర్తించకుండా పోతాయి.
ప్రశ్న : 2016 తర్వాత నేను నా ఫోటో & డేట్ అఫ్ బర్త్ను
మార్చుకున్నాను. ఇప్పుడు నేను మరలా డాక్యుమెంట్ అప్డేట్ చేసుకోవాలినా?
సమాధానం: 2016 తర్వాత పేరు అడ్రస్ మార్చుకోలేదు కాబట్టి మీరు డాక్యుమెంట్ అప్డేట్ చేయించుకోవాల్సిందే.
ప్రశ్న : డాక్యుమెంట్ అప్డేట్ ఎవరు చేసుకోవాలి?
సమాధానం: 2010 నుంచి 2016 మధ్యలో ఆధార్ తీసుకుని 2016 తర్వాత ఆధార్ పేరు గానీ అడ్రస్ గానీ మార్చుకోకపోతే వాళ్లు తప్పనిసరిగా డాక్యుమెంట్ అప్డేట్ చేసుకోవాలి.
ప్రశ్న : కొత్తగా ఈ ఆధార్ డాక్యుమెంట్ అప్డేట్ ఎందుకు?
సమాధానం: 2010 నుంచి 2016 వరకు ఆధార్ ఇచ్చేటప్పుడు ఎలాంటి డాక్యుమెంట్స్ తీసుకోకుండా ఆధార్ ఇవ్వబడింది. అయితే ఇప్పుడు ఇందులో ఉన్న బోగస్ ఆధార్ కార్డులను ఏరివేయడానికి సెంట్రల్ గవర్నమెంట్ ప్రతి ఆధార్ ఉన్న పౌరుడు వారి పేరు & అడ్రస్ను సరైన ఆధారాలతో ధృవీకరించుకోవాలి.
ప్రశ్న :ఆధార్ అప్డేట్ కేవలం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలకేనా లేక దేశంలో అందరికీ ఉందా?
సమాధానం:సెంట్రల్ గవర్నమెంట్ ఆదేశాల మేరకు ఆధార్ ఉన్న ప్రతి ఒక్కరూ వారి ఆధార్లో డాక్యుమెంట్ అప్డేట్ చేసుకోవాలి.
Aadhaar Document Update Process in Telugu
More Useful Links :
1.ఆధార్ కార్డుకు మొబైల్ నెంబర్ లింక్ స్టేటస్ తెలుసుకునే విధానము – Click Here
2. Aadhar All Websites Links – Click Here
3. ఆధార్ కార్డు కు ఏ బ్యాంకు అకౌంట్ లింక్ అయినదో తెలుసుకునే విధానము – Click Here
Tags : Aadhaar Document Update Process in Telugu, document for Aadhaar update, update Aadhar card online, Aadhaar Document Update Process in Telugu, Aadhar card update, Aadhar card update mobile number, Aadhaar Document Update Process in Telugu, ఆధార్ అప్డేట్ ఎలా చేసుకోవాలి?, ఆధార్ కార్డు డౌన్లోడ్ ఎలా?, Aadhaar Document Update Process in Telugu, 10 సంవత్సరాల తర్వాత ఆధార్ నవీకరణ?, ఆధార్ కార్డు అప్డేట్ చేయడానికి ఎన్ని రోజులు పడుతుంది?,
Aadhaar Document Update Process in Telugu, ఆధార్ కార్డ్ మొబైల్ నెంబర్ అప్డేట్?, మా ఆధార్ కార్డు లో పేరు మార్చడం ఎలా?, Aadhaar Document Update Process in Telugu, Aadhaar Document Update Process, document for Aadhaar update, documents required for Aadhar card update after 18 years, Aadhaar Document Update Process in Telugu, Aadhaar Document Update Process in Telugu, Aadhaar Document Update Process in Telugu, Aadhaar Document Update Process in Telugu,
Leave a comment