7 Stages To Earn Money From Blogging In 2024
How To Create A Blog In Telugu?
నేనుబ్లాగ్ స్టార్ట్ చేసి బ్లాగర్ కావాలి అని నిర్ణయించుకున్న తరువాత బ్లాగింగ్ కెరీర్ గురించిన అన్ని విషయాలు తెలుసు కోవాలి అని నిర్ణయించుకుని క్లారిటీ కోసము ఎన్నో బ్లాగ్ పోస్టులు, ఎన్నో బిగినర్ గైడ్లు, ఇంకా అల్టిమేట్ గైడ్లు రిఫర్ చేసి ఒక నిర్ణయానికి రావడానికి నాకు వారాలు నెలలు పట్టాయి. ఎందుకంటే ఒక్కొక్క బ్లాగ్ పోస్ట్ లో ఒక్కొక్క విధానము గురించిన డిస్కషన్. అందుబాటులో వున్న టూల్స్ గురించిన కొన్ని మంచి విషయాలు ఇంకొన్ని నెగటివ్ విషయాలు. క్లారిటీ రాని కారణముగా ఇంకొక బ్లాగ్ పోస్ట్, ఇంకొక యూట్యూబ్ విడియో అంటూ నా రీసెర్చ్ వారాల నుంచి నెలలకి సాగిపోయింది. మీరు నమ్మరెమో కానీ ఒకానొక సంధర్బములో బ్లాగ్ స్టార్ట్ చేయాలి అనే ఆలోచనను కొద్ది రోజులు వాయిదా వేసేంత కన్ఫ్యూజన్.
Trending Post
ఆధార్ కార్డుకు మొబైల్ నెంబర్ లింక్ స్టేటస్ తెలుసుకునే విధానము
నాలా కన్ఫ్యూషన్ ఎదురుకుంటున్న తెలుగు ఆన్లైన్ మని మేకర్స్ మరియు తెలుగు బ్లాగర్స్ కోసము ఒక బ్లాగ్ పోస్ట్ వ్రాయాలి అని నిర్ణయించుకున్న. నా బ్లాగింగ్ జర్నీ లో నేను తెలుసుకున్న ఇంకొక విషయము మనకి ఎక్కువ ఆప్షన్స్ అందుబాటులో ఉంటే ఒక నిర్ణయానికి రావడము చాలా కష్టముఅదీ ఏ విషయమైనా కూడ!
మనకి తెలియని విషయము గురించి అతిగా ఆలోచిస్తూ కూర్చోవడం కన్న అందుబాటులో వున్న మంచి టూల్స్ మరియు మార్గాలని వుపయోగించి కెరీర్ స్టార్ట్ చేసి ముందుకు సాగడము చాలా ముఖ్యం. అలా మీకు సహాయపడడానికి వ్రాసిందే ఈ బ్లాగ్ పోస్ట్.
బ్లాగ్ క్రియేట్ చేయడములో ముఖ్యముగా 7 స్టేజీ లు ఉన్నాయి
- 1. మీ బ్లాగ్ టాపిక్ (నిచ్చే) ఎంచుకోవడము
2. బ్లాగింగ్ ప్లాట్ఫారం నిర్ణయము - 3. బ్లాగ్ డొమైన్ నేమ్ రిజిస్ట్రేషన్
4. వెబ్ హోస్టింగ్ తీసుకోవడము
5. బ్లాగ్ డిజైన్ (theme)
6. బ్లాగ్ కంటెంట్ క్రియేషన్
7. బ్లాగ్ ప్రమోషన్(బ్రాండ్ ప్రమోషన్)
ఇక్కడ నుండి ముందుకు సాగే ముందు బ్లాగ్ స్టార్ట్ చేయడానికి మనలో చాలా మందికి వున్న కొన్ని అపోహలు క్లియర్ చేసుకోవడం చాలా మంచిది.
అపోహ 1: బ్లాగ్ క్రియేట్ చేయడానికి చాలా టెక్నికల్ నాలెడ్జ్ అవసరము
ఆన్లైన్ బిజినెస్ అనగానే చాలామందికి ఈ బ్లాగ్ క్రియేట్ చేయడము అనే విషయము ఒక పెద్ద పనిగా దానిలో ఉండే మరియు లేని కష్టాలను ఊహించుకొని బ్లాగింగ్ కెరీర్ని అంతటితో ఆపేస్తూ ఉంటారు.
కానీ మీలో చాలా మందికి తెలియని ఒక విషయం ఏ టెక్నికల్ నాలెడ్జ్ లేకుండా బ్లాగ్ క్రియేట్ చేయడం చాలా సులభం. ఎందుకంటే టెక్నాలజీ అడ్వాన్స్ గా పోతున్న ఈ ప్రపంచంలో ఈ కష్టమైన పనిని సులభంగా చేసిపెట్టడానికే ఎన్నో కంపెనీలు వున్నాయి. ఈ కంపెనీ లు అందించే టూల్స్ ఆధారంగా మనము మన వెబ్సైట్ నీ సులభంగా రుపొందించుకోవచ్చు.
ఫ్రీ వెబ్సైట్ బిల్డర్స్ సహాయముతో బ్లాగ్ స్టార్ట్ చేసి పాపులర్ చేయడము సులభమైన విషయము అయినప్పటికీ, మనము కలలు కని కష్టపడి నిర్మించుకున్న బ్లాగింగ్ సామ్రాజ్యము మీద సర్వాధికారాలు ఇతరుల చేతిలో వుండటము తో పాటు చాలా వరకి పరిమితులతో కూడిన టూల్స్ మాత్రమే మనకి లభించి మన వేగానికి బ్రేకులు వేస్తూ ఉంటాయి. మిమ్మలిని హీరో చేయడం లేదా జీరో చేయడం మీ ప్రమేయం లేకుండా వాళ్ళకి అది నిమిషాలలో పని. ఎదో ఒక కారణము చూపి మీ బ్లాగ్ క్లోజ్ చేసే అధికారము వారికి వుంటుందీ. అందుకని ఆన్లైన్లో మీరు మీ సెల్ఫ్ హోస్టెడ్ వెబ్సైట్ కలిగి ఉండడం చాలా అవసరం. మీరు నిర్మించుకున్న మీ బ్లాగ్ ( కెరీర్/ మీ ఆన్లైన్ బిజినెస్/ మీ రీడర్స్) పూర్తిగా మీ ఆదీదంనంలో వుండే అవకాశం సెల్ఫ్ హోస్టెడ్ బ్లాగ్ లో మాత్రమే ఉంటుంది.
అపోహ 2: బ్లాగ్ నిర్మించడం పెద్ద ఖర్చుతో కూడుకున్న పని.
20 సంవత్సరాలు క్రితం వెబ్సైట్ లేదా బ్లాగ్ నిర్మించడం అనేది చాలా టెక్నికల్ విషయము. చాలా వరకు ఖర్చుతో కూడుకున్న పని. దీనితో పాటు ఆ బ్లాగ్ నిర్వహించడానికి ఒక టెక్నికల్ టీమ్ అవసరము వుండేది.
బ్లాగర్(1999) మరియు wordpress(2003) లాంటి టూల్స్ వచ్చిన తరువాత బ్లాగ్/ వెబ్సైట్ స్టార్ట్ చేయడం ఏ టెక్నికల్ నాలెడ్జ్ లేకుండా చాలా తక్కువ ఖర్చుతో చేయగలిగిన పనిగా మారింది.
టెక్నాలజీ డెవలప్మెంట్ కి మనం ఖచ్చితంగా మనం కృతజ్ఞతలు చెప్పుకోవాలి.
ఇపుడు అందుబాటులో వున్న టూల్స్ ఆధారముగా 3 నుంచి 4 వేల రూపాయల ఖర్చుతో మనము బ్లాగ్ స్టార్ట్ చేయడము వీలు అవుతుంది.అది ఎటువంటి టెక్నికల్ నాలెడ్జి అవసరము లేకుండా. థాంక్ యూ టెక్నాలజీ అని చెప్పకుండ వుండలేమేమో.
మీరు సింగిల్ పర్సన్ గా మీ డిజిటల్ కెరీర్ స్టార్ట్ చేయడానికీ ఈ క్రింద చెప్పిన టూల్స్ చాలా ఉపయోగ పడతాయి.
అపోహ 3: బ్లాగ్ మెయింటైన్ చేయడానికీ టెక్నికల్ టీమ్ అవసరము.
చాలా వరకు ఆన్లైన్ బ్లాగ్ బిల్డింగ్ టూల్స్ వారి ప్లాన్ లో భాగముగా ఫ్రీ గా బ్లాగ్ మైంటేనన్స్ మరియు 24*7 సర్వీసెస్ అందిస్తున్నాయి. కాబట్టి full టైం టెక్నికల్ టీము అవసరము ఏమి లేదు.
ఇంక మనము మన బ్లాగింగ్ కెరీర్ యొక్క 7 స్టెప్స్ చూస్తే
7 Stages To Earn Money From Blogging In 2024
1. బ్లాగ్ టాపిక్(నిచ్చే ) ఎంచుకోవడము
ఇక్కడ ఇచ్చిన 7 స్టెప్స్ లలో మీ యొక్క విజయావకాశాలను ప్రభావితము చేసే శక్తీ మీ బ్లాగ్ టాపిక్ కి వుంటుందీ. కావున ఈ స్టెప్ విషయములో మీరు కాసింత ఎక్కువ కేర్ తీసుకుంటే మంచిది.
ఏముందిలే అన్న మనకి తెలిసిన ఎదో ఒక టాపిక్ గురించి బ్లాగ్ చేసేస్తే పోలా అని మీరు అనుకోవచ్చు. ఇంటెర్నెట్ అనేది దగ్గర దగ్గరా 2 కోట్లకి పైగా బ్లాగ్ మరియు వెబ్సైట్ వుండే ఇన్ఫర్మేషన్ మహా సముద్రము. దాంట్లో మీరు ఎవరు? మీ నాలెడ్జ్ లెవెల్ ఏమిటి? మీ గొప్పతనము ఏమిటి? ఇలాంటివి నిర్ణయించడానికి మీ బ్లాగ్ టాపిక్(నిచ్చే) అవసరము అవుతుంది.
బ్లాగ్ నిచ్చే అంటే మీరు ప్లాన్ చేసుకున్న బ్లాగ్ లో మీరు ఫోకస్ చేసి రాయపోయే ఒక ప్రత్యేకమైన సబ్జెక్టు అన్నమాట.
మీ టాపిక్ యొక్క నిచ్చే నిర్ణయించే సమయములో మీరు పరిగణలోనికి తీసుకోవాల్సిన ఇంకొక విషయము మీ టార్గెట్ ఆడియెన్స్.
ముఖ్యముగా మీ బ్లాగ్ టాపిక్ మీ టార్గెట్ ఆడియెన్స్ 3 వది వారికి రీచ్ కావటానికి సరియైన బ్లాగింగ్ ప్లాట్ఫారం.
మీ బ్లాగింగ్ కెరీర్ విజయాన్ని లేదా పరాజయాన్ని నిర్ణయించే శక్తి మీరు ఎంచుకునే బ్లాగ్ టాపిక్ కి వుంది. మీకు చాలా విషయాల్లో మంచి గ్రిప్ ఉన్నపటికీ ఈ క్రింద చెప్పిన కొన్ని విషయాల అనుగుణముగా మీ బ్లాగ్ టాపిక్ ఎంచుకోవడం కారణముగా మీరు ఎక్కువ మంది రీడర్స్ పొందడంతో పాటు ఎక్కువ పాపులర్ కావడానికి మరియు ఎక్కువ మని సంపాదించడానికి అవకాశము వుంటుంది.
ముందుగా చెప్పుకున్నట్టు బ్లాగింగ్ కెరీర్ అనేది ఒక దీర్ఘకాల పెట్టుబడి మని మరియు సమయము పరముగా. కాబట్టి మీరు మీ బ్లాగ్ టాపిక్ ఎంచుకునే సమయములో
మీకు బాగా ఇంటరెస్ట్ వున్న టాపిక్ మీకు నాలెడ్జ్ లిమిటెడ్ గా వున్న కూడ తీసుకోండి
ఆ టాపిక్ కి ఆన్లైన్ లో మంచి డిమాండ్ వుండాలి
రెవెన్యూ పోటెన్షియల్ కూడ చాలా ముఖ్యం
మీ బ్లాగ్ టాపిక్ మీరు ఎంచుకునే సమయములో ఈ చిన్న సలహాలను మీరు పరిగణలోకి తీసుకోండి
1. మీకు బాగా నచ్చిన మరియు మీకు బాగా తెలిసిన విషయాల గురించి బ్లాగింగ్ చేయడము ద్వారా మీరు ఈజీ గా పాపులర్ కావచ్చు
2. మీరు రెగ్యులర్ గా చదివే బ్లాగ్ పోస్టులు పేపర్ మాగజైన్ లేదా టీవీ పోగ్రాములు సంబంధించినవి
3. మీరు రెగ్యులర్ కలిసే మనుషులు మరియు కమ్యూనిటీ కి సంబంధించిన విషయాలు మరియు విశేషాలు
4. Amazon, Flipkart మరియు ఇతర అఫిలియేట్ నెట్వర్క్స్ లోని రివ్యూ మరియు రేటింగ్స్ నుంచి
పైన చెప్పిన విధానాలలో మీరు షార్ట్ లిస్ట్ చేసుకున్న టాపిక్స్ నుంచి పైన చెప్పిన 3 లక్షణము ఉంటే ఈ క్రింద చెప్పిన 3 ప్రశ్నలు సమాధానము కోసం ప్రయత్నిస్తే మీకు ఒక క్లారిటీ వచ్చే అవకాశము ఎక్కువ
ప్రశ్న 1: నేను ఈ బ్లాగ్ టాపిక్ గురించి మొదటి నెలలో 30+ బ్లాగ్ పోస్టులు వ్రాయగలనా?
ప్రశ్న 2: నేను వ్రాసే ఈ బ్లాగ్ పోస్టు చదివే వారు లేదా చదవ గలిగె వారు చెప్పుకోదగ్గ మంది ఆన్లైన్ లో వున్నారా?
ప్రశ్న 3: నేను వ్రాసే టాపిక్ యొక్క కీవర్డ్ కి మంచి సెర్చ్ నంబర్స్ మరియు మంచి CPC వున్నాయా?
ప్రశ్న 4: మీరు వ్రాసే టాపిక్ లో డబ్బు ఇన్వెష్ట్ చేసే కంపెనీలు మరియు డబ్బు పెట్టి పరిష్కార వేతుకునే రీడర్స్ వున్నారా?
పైన చెప్పిన ప్రశ్నలకి మీకు అనువైన సమాధానాలు దొరికితే మీరు దానిని మీ బ్లాగ్ టాపిక్ ఎంచుకొని నెక్స్ట్ స్టెప్ కి ప్లాన్ చేసుకోవడం మంచిది.
బ్లాగ్ టాపిక్ కి అనుగుణముగా బ్లాగ్ నేమ్ డిసైడ్ చేసుకోవడం
మీ బ్లాగ్ టాపిక్ డిసైడ్ చేయడము ఎంత ముఖ్యమైన పనో అంతే ముఖ్యముగా మీ బ్లాగ్ నేమ్ డిసైడ్ చేసుకోవడం అంత ముఖ్యం.
మీ బ్లాగ్ టాపిక్ మీ బ్లాగ్ నేమ్ లో వచ్చే టట్లు చూసుకోవడం వలన మీ రీడర్స్ మీ బ్లాగ్ నేమ్ జ్ఞాపకము పెట్టుకోవడము సులభము అధే విధముగ మీ బ్లాగ్ కి సెర్చ్ ఇంజిన్ నుంచి వచ్చే ట్రాఫిక్ కూడా మీకు బాగా కలిసి వస్తుంది. దీనినే మనము SEO అని కూడ అంటాము.
7 Stages To Earn Money From Blogging In 2024
2. బ్లాగింగ్ ప్లాట్ఫారం నిర్ణయించుకోవడం
మీ బ్లాగ్ క్రియేట్ చేసుకోవడానికి అనేక రకాలైన ఆప్షన్స్ అందుబాటులో వున్నాయి. వాటిలో blogger.com Tumblr.com wordpress.com మరియు medium.com లాంటి ఫ్రీ టూల్స్ వున్నాయి.
ఇవి కాక wordpress.org joomla.com ghost.com లాంటి టెక్నికల్ ప్లాట్ఫారం ద్వారా కూడ మీరు మీ సెల్ఫ్ హోస్టెడ్ బ్లాగ్ క్రియేట్ చేసుకునే అవకాశము ఉంది.
ప్రపంచములో 30% పైగా వెబ్సైట్లు wordpress.org ఓపెన్ సోర్సు సాఫ్టువేర్ వుపయోగించి నిర్మించినవే.
మీరు మీ బ్లాగింగ్ కెరీర్ స్టార్ట్ చేయడానికి డిసైడ్ అయిన తరువాత మీరు ఇప్పటికే ఎంతో మంది ఫాల్లో అయ్యే రూట్ లో వెళ్ళడము మంచిది. కొత్తగా స్టార్ట్ చేయడము లో మనకి ఒరిగేదేమీ ఉండదు.
నా సలహా ప్రకారము మీరు మీ బ్లాగ్ స్టార్ట్ చేయడానికి wordpress.org ఓపెన్ సోర్సు సాఫ్టువేర్ వాడుకోవడం మంచిది.
దీనిలో చాలా ఉపయోగాలు ఉన్నాయి కాబట్టి ఇంత పాపులర్. కాబట్టి ఆ బెనిఫిట్స్ తెలుసుకోవడం కన్నా సెలెక్ట్ చేసుకుని ముందుకు సాగడం మంచిది.
7 Stages To Earn Money From Blogging In 2024
3. బ్లాగ్ డొమైన్ నేమ్ రిజిస్ట్రేషన్
మనలో చాలా మంది అంతగా టెక్నికల్ నాలెడ్జ్ లేని వారే కాబట్టి పెద్దగా ఎటువంటి ఇబ్బంది లేని విధానములో డొమైన్ రిజిస్టర్ చేసుకోడం మంచిది.
చాలా వరకు హోస్టింగ్ సర్వీసులు అందించే కంపెనీలు డొమైన్ రిజిస్ట్రేషన్ సర్వీసులు ఫ్రీగా అందిస్తున్నాయి.
మీరు మీ డొమైన్ నేమ్ విషయములో ఒక 4-5 ఆప్షన్స్ కలిగి వుంటే మీరు మీ హోస్టింగ్ సర్వీస్ తీసుకునే సమయములో మీ డొమైన్ నీ అత్యంత సులభముగా రిజిస్టర్ చేసుకుని ముందుకు సాగి పోవచ్చు.
అలకాని పక్షములో మీ డొమైన్ నేమ్ మీ హోస్టింగ్ సర్వీస్ నుంచి వేరుగా వుంచుకోవాలి అని మీరు డిసైడ్ చేసుకుంటే అది కూడ సాధ్యమే. కాకపోతే మీరు మీ డొమైన్ రిజిస్టర్స్ నీ మీ హోస్టింగ్ సర్వీస్ కంపెనీ కి మాప్ చేయవలసి ఉంటుంది.
ఈ డొమైన్ రిజిస్టర్ కోసం వున్న సర్వీస్ లలో
- Namecheap.com
- GoDaddy.com
వాడుకోవచ్చు.
ఇవేకాక హోస్టింగ్ సర్వీసులు అందించే
- Bluehost
- Hostgator
- Siteground
- A2hosting
లాంటి కంపెనీలు కూడ డొమైన్ రిజిస్టర్ సర్వీసులు అందిస్తున్నాయి.
మీ వీలుని మరియు అవసరాన్ని బట్టి మీరు ఇంకా క్లియర్ గా చెప్పాలంటే మీ టెక్నికల్ నాలెడ్జ్ ఆధారముగా మీరు మీ డొమైన్ నేమ్ రిజిస్టర్ ఎంచుకోవచ్చు.
7 Stages To Earn Money From Blogging In 2024
4. హోస్టింగ్ సర్వీసులు సెలెక్ట్ చేసుకోవడం
మీ సీఎంఎస్ (Content Management System) ఎంచుకున్న తరువాత ఆ CMS ని హోస్ట్ చేయడానికి హోస్టింగ్ సర్వీసులు అందించే సర్వీస్ ప్రొవైడర్ ఎంచుకోవడం.
అందుబాటులో ఉన్న సర్వీసుల్లో
- Bluehost
- Hostgator
- Siteground
- A2Hosting
సర్వీసులు బెస్ట్ గా వున్నాయి. మీరు ఒక సంవత్సరం ప్లాన్లు సెలెక్ట్ చేసుకోవడం ద్వారా ఫ్రీగా డొమైన్ నేమ్ కూడ పొందే అవకాశాలను ఈ 4 కంపెనీ లు అందిస్తున్నాయి.
తెలుగు ట్రైబ్ తో పాటు ప్రపంచ వ్యాప్తంగ 60% wordpress వెబ్సైట్ లు bluehost సర్వీసులను ఎంచుకున్నయి.
Bluehost 3 సంవత్సరాల ప్లాన్ మీకు లాభదాయకముగ వుండటము తో పాటు ఫ్రీ డొమైన్ అందించే కారణముగా మీ బ్లాగ్ స్టార్ట్ చాలా సులభంగ 10 నిముషాల్లో పూర్తి అవుతుంది. WordPress ఇన్స్టాల్ సర్వీస్ సెకండ్స్ లో పూర్తి అవుతుంది.
అందుకే నా సజెషన్ bluehost సెల్ఫ్ హోస్టింగ్ సర్వీస్ తీసుకుని బ్లాగింగ్ స్టార్ట్ చేయడము మంచి శుభ సూచకం.
ఈ క్రింద bluehost యొక్క ప్లాన్స్ వాటికి సంబంధించిన ఇతర వివరాలు కూడ అందించడము జరిగింది.
7 Stages To Earn Money From Blogging In 2024
5. బ్లాగ్ డిజైన్(బ్లాగ్ థీమ్) సెలెక్షన్
WordPress ఇంస్టాల్ చేయడము తో మీకు ఫ్రీ థీమ్ తో మీ వెబ్సైట్ లాంచ్ చేసే అవకాశాన్ని wordpress మనకి అందిస్తోంది.
ఫ్రీ థీమ్స్ అంటే అంటూ మీరు పెదవి విరచనవససరము లేదు. ఎందు కంటే మీ బ్లాగింగ్ కెరీర్ మొదట్లో అవసరానికి తగిన అన్ని ఫీచర్స్ వుండే ఫ్రీ థీమ్స్ చాలా ఇక్కడ అందుబాటులో ఉన్నాయి.
ఎది ఏమైనప్పటికీ ఫ్రీ థీమ్స్ అంటే కొంచెం లిమిటేషన్స్ తో రావడము చాలా సహజము. మీకు ఇంకా ఎక్కువ ఫీచర్స్ సూపర్ కూల్ డిజైన్ కలిగిన థీమ్స్ కావాలంటే $30-50 ఖర్చుతో కొనుగోలు చేయావచ్చు.
మీ బ్లాగ్ మరియు మీ బ్లాగింగ్ కెరీర్ లక్ష్యాలను మనసులో పెట్టుకోని మీ బ్లాగ్ థీమ్ మరియు థీమ్ అందించే కంపెనీ లు ఎంచుకోవల్సీ వుంటుంది.
7 Stages To Earn Money From Blogging In 2024
6. బ్లాగ్ కంటెంట్ క్రియేట్ చేయడము
బ్లాగింగ్ కెరీర్ లో మరో ముఖ్యమైన అంకము బ్లాగ్ కంటెంట్ క్రియేట్ చేయడము. బ్లాగ్ డిజైన్ లో బ్లాగ్ పేజీ & బ్లాగ్ పోస్టులు చాలా ముఖ్యమైన విషయాలు.
AboutUs ContactUs privacy policy లాంటి బ్లాగ్ పేజీలు కూడ మీ బ్లాగ్ కంటెంట్ కిందకి వస్తాయి.
తరువాత ముఖ్యమైన కంటెంట్ బ్లాగ్ పోస్టులు.
మీ రీడర్స్ ని ఆకర్షించే బ్లాగ్ టాపిక్ కి సంబంధించిన విషయాలను రెగ్యులర్ గా కంటెంట్ ఆర్టికల్ గా మీరు ప్రచురిస్తూ మీ బ్లాగ్ కంటెంట్ మరియు మీ రీడర్స్ సంఖ్యను మీరు పెంచుకుంటూ పోవాలి.
ఎదో ఒక కంటెంట్ అని కాకుండా మీ రీడర్స్ వెతికే మరియు ఎదురు చూసే కంటెంట్ వ్రాయడము ద్వారా వారిని ఆకర్షిస్తూ వారు మళ్ళీ మళ్ళీ మీ బ్లాగ్ విసిట్ చేసే మాదిరి కంటెంట్ కీవర్డ్ రీసెర్చ్ టెక్నిక్స్ ఫాలో చేయడము మంచిది.
బ్లాగ్ అంటే కంటెంట్. ఆన్లైన్ కంటెంట్ అంటే బ్లాగ్. కాబట్టి మీ బ్లాగ్ కంటెంట్ క్రియేట్ చేయడములో చాలా వరకి మీ సమయము మరియు మని ఇన్వెష్ట్ చేయడము ముఖ్యము.
బ్లాగ్ లో కంటెంట్ క్రియేట్ చేయడానికీ సింపుల్ గా ఈ క్రింద ఇచ్చిన 4 స్టెప్స్ ఫాలో చేయండి.
మీ బ్లాగ్ పోస్ట్ క్రియేట్ చేసే సమయములో మంచి డిమాండ్ వున్న కీవర్డ్ ఆధారము చేసుకుని బ్లాగ్ కంటెంట్ క్రియేట్ చేస్తే మీ బ్లాగ్ సక్సెస్ కావటానికి వున్న అవకాశాలు పెరిగే ఛాన్స్ వుంటుందీ.
7 Stages To Earn Money From Blogging In 2024
7. బ్లాగ్ ప్రమోషన్
మీరు ఎంత సూపర్ కూల్ డొమైన్ నేమ్ పెట్టిన అత్యంత ఆకర్షణ కలిగిన బ్లాగ్ డిజైన్ చేసిన మంచి పాపులర్ కంటెంట్ అత్యంత అద్భుతముగా వ్రాసిన ఇవి మీ రీడర్స్ చేరకపోతే మీ ప్రయత్నాలు అన్ని బూడిదలో పోసిన పన్నీరు సమము.
సో బ్లాగ్ (మీ బ్రాండ్) ని మీరు ప్రమోట్ చేయడమూ అనేది మీ బ్లాగింగ్ కెరీర్ లో చాలా ముఖ్యమైన అంకము.
మనలో చాలా మంది ఈ విషయాన్ని పూర్తిగా పట్టించుకోరు. దీని కారణముగా పైన చెప్పిన అన్ని స్టేజీ లలో మీరు చేసిన ప్రయత్నాలు కృషి సత్ఫలితాలు ఇవ్వక పోగా మొత్తము మీ కెరీర్ విజయ తీరాలని అందుకోవడం లో జాప్యం ఏర్పడుతుంది.
కాబట్టి మీ బ్లాగ్ కెరీర్ ప్లానింగ్ లో బ్లాగ్ ప్రమోషన్ ఒక ముఖ్య భాగముగా మీరు ప్లాన్ చేసుకోవడం ముఖ్యం.
బ్లాగ్ ప్రమోషన్ కి రెండు విధానాలు అందుబాటులో వున్నాయి.
A. ఫ్రీ విధానాలు:
SEO, కంటెంట్ మార్కెటింగ్, సోషియల్ మీడియా మార్కెటింగ్, గెస్ట్ బ్లాగింగ్ లాంటి విధానాలను వుపయోగించి మీ బ్లాగ్ ని మీరు ఫ్రీగా ప్రమోట్ చేసి ఫాలోయర్స్ పెంచుకోవచ్చు.
మీ బ్లాగ్ కి వచ్చె లేదా ఫాలో అయ్యే రీడర్స్ ని అధారముగా మీ బ్లాగ్ విజయము నిర్ణయిస్తారు.
B. పెయిడ్ విధానాలు
గూగుల్ యాడ్ (PPC) ఫేస్బుక్ యాడ్ ల ద్వారా మరియు ఈమెయిల్ క్యాంపెయిన్ ల ద్వారా మీ బ్లాగ్ ప్రమోట్ చేసుకుంటూ మీ బ్లాగ్ రీడర్స్ పెంచుకునే ఇంకొక మార్గము మీ బ్లాగ్ విజయానికి కొంచెం షార్ట్ కట్.
మీ బ్లాగ్ యొక్క మోనేటైజేషన్ ప్లాన్ మరియు రీడర్స్ సంఖ్య లాంటి విషయాలను పరిగణలోనికి తీసుకుని మీ బ్లాగ్ ప్రమోషన్ ఫ్రీ నా లేక పెయిడ్ నా అని మీరు నిర్ణయించుకోవచ్చు.
7 Stages To Earn Money From Blogging In 2024
16 Ways To Earn From Blogging In Telugu.
ఇక మీ బ్లాగ్ మని లో చివరి మరియు చాలా చాలా ముఖ్యమైన అంకము బ్లాగ్ మోనేటైజేషన్
అంటే బ్లాగ్ నుంచి మని సంపాదన.
మీ బ్లాగ్ నుంచి మని సంపాదనకు చాలా మార్గాలు ఉన్నాయి
వాటిలో ముఖ్యమైనవి
- 1. అడ్వర్టైస్మెంట్ ద్వారా
- 2. స్పాన్సర్షిప్ ద్వారా
- 3. పెయిడ్ రివ్యూస్
- 4. పెయిడ్ కంటెంట్
- 5. అఫ్ఫైలియేట్ కమిషన్ ద్వారా
- 6. సొంత ప్రొడక్ట్స్ అమ్మడము
- 8. ఇతరుల ప్రొడక్ట్స్ అమ్మడం ద్వారా
- 9. సొంత సర్వీసులను అమ్మడము
- 10. ఇతరుల సర్వీసెస్ అమ్మడం
- 11. ఈ బుక్స్ అమ్మడము
- 12. వీడియో కోర్సులు అమ్మడం ద్వారా
- 13. ప్రీమయం కంటెంట్ మెంబర్షిప్ సైట్ ల ద్వారా అమ్మడం
- 14. డైరక్టరీ వెబ్సైట్ నిర్వహించడం ద్వారా
- 15. ఇతర ఆన్లైన్ సర్వీసులు అందించే ఏజన్సీ నడపటం
- 16. ఆన్లైన్ కోచింగ్ మరియు కన్సల్టింగ్ చేయడము ద్వారా
బ్లాగ్ ద్వారా మని సంపాదనకు ఇన్ని మార్గాలు ఉన్నపటికీ ప్రతి బ్లాగర్ ఈ అన్ని మార్గాలలో మీ కంటెంట్ స్ట్రాటజీ కి సరిపోయే 2-3 మార్గాలు ఎంచుకొని మని సంపాదనకు ప్రయత్నము చేయడము ముఖ్యము. మీ బ్లాగింగ్ కెరీర్ ద్వారా మని సంపాదనకు ముఖ్యమైన 9 విధానాలు బ్లాగింగ్ కెరీర్ లో సక్సెస్ కావడానికి మీకు వున్న ఇతరులకు ఉపయోగపడే స్కిల్ క్లారిటీ కుదిరిన అన్ని మార్గాలలో మని సంపాదనకు ప్రయత్నించడం తప్పు లేక పోయినా అది మీ రీడర్స్ ని డిస్టర్బ్ చేసే విధముగ మారకుండ చూసుకోవడం చాలా ముఖ్యము. లేకపోతే మీరు ఎన్నో రోజులు కష్టపడి నిర్మించుకున్న మీ బ్లాగింగ్ సామ్రాజ్యము మీ అతి ఆశకు లేదా అనవసరమైన ఆలోచనకు దెబ్బ అయిపోయే అవకాశము ఉంది.
మరి ఫ్రెండ్స్ తెలుసుకున్నారు కదా. బ్లాగింగ్ కెరీర్ లో వున్న ఆ స్టెప్స్ ఇంకెందుకు ఆలోచన! ఈరోజే మీ ఐడియా ని ఇపుడే మీ బ్లాగ్ గా మార్చే ప్రయత్నం ఈరోజే చేయండి.
Leave a comment