TS SSC 10th class Hall tickets download 2024
Telangana SSC Exams Updates 2024: మార్చి 18వ తేదీ నుంచి తెలంగాణ పదో తరగతి పరీక్షలు ప్రారంభం కానున్నాయి. ఇందుకు సంబంధించిన హాల్ టికెట్లు మార్చి 7వ తేదీ నుంచి అందుబాటులోకి వచ్చాయి.
Trending Post
ఆధార్ కార్డుకు మొబైల్ నెంబర్ లింక్ స్టేటస్ తెలుసుకునే విధానము
తెలంగాణలో పదో తరగతి పరీక్షలు ప్రారంభం కానున్నాయి. మార్చి 18వ తేదీన ప్రారంభమై….ఏప్రిల్ 2వ తేదీతో ముగియనున్నాయి. మొత్తం 7 రోజులపాటు పరీక్షలు జరగనున్నాయి. పరీక్షలను పకడ్బందీగా నిర్వహించేందుకు అధికారులు కూడా విస్తృత ఏర్పాట్లు చేస్తున్నారు. మార్చి 18వ తేదీనే ఇంటర్ పరీక్షలు(Telangana Inter Exams 2024) కూడా ముగియనున్నాయి. అయితే పదో తరగతి పరీక్షలకు టైం దగ్గరపడుతున్న వేళ హాల్ టికెట్లకు సంబంధించి కీలక అప్డేట్ అందింది. పరీక్షల కోసం రాష్ట్రవ్యాప్తంగా 2,676 పరీక్షాకేంద్రాలను ఏర్పాటు చేశారు. ఈసారి 5,08 లక్షల మంది విద్యార్థులు పరీక్షలకు హాజరుకానున్నారు. మార్చి 7వ తేదీ నుంచి హాల్ టికెట్లు (download TS SSC Hall Ticket) అందుబాటులోకి వచ్చే అవకాశం ఉందని తెలిసింది.
How to download TS SSC Hall Ticket:ఇలా డౌన్లోడ్ చేసుకోవచ్చు…
హాల్ టికెట్లు డౌన్లోడ్ చేసుకొనుటకు ఈ క్రింది లింక్ మీద క్లిక్ చేయగలరు.
ఇప్పటికే పాఠశాలలకు విద్యార్థులకు సంబంధించిన హాల్ టికెట్లను పంపించింది పదో తరగతి పరీక్షల బోర్డు. అయితే వెబ్ సైట్ నుంచి కూడా డౌన్లోడ్ చేసుకునేందుకు వీలుగా వీటిని మార్చి 7వ తేదీ నుంచి అందుబాటులోకి తీసుకురానున్నారు.
TS SSC Exams 2024: తెలంగాణ పదో తరగతి పరీక్షల షెడ్యూల్
TS SSC exams Time Table
మార్చి 18- ఫస్ట్ లాంగ్వేజ్(తెలుగు, కాంపోజిట్ కోర్సు)
మార్చి 19- సెకండ్ లాంగ్వేజ్( హిందీ)
మార్చి 21- థర్డ్ లాంగ్వేజ్ (ఇంగ్లీష్)
మార్చి 23- మ్యాథమెటిక్స్
మార్చి 26- సైన్స్ పేపర్ -1(ఫిజిక్స్)
మార్చి 28- సైన్స్ పేపర్ -2(బయాలజీ)
మార్చి 30- సోషల్ స్టడీస్
ఏప్రిల్ 1- ఒకేషనల్ కోర్సు (సంస్కృతం, అరబిక్ మొదటి పేపర్),
ఏప్రిల్ 2- ఒకేషనల్ కోర్సు(సంస్కృతం, అరబిక్ రెండో పేపర్)
Leave a comment