AP RTE 1st Class admission 2024-25

grama volunteer

AP RTE 1st Class admission 2024-25
Telegram Channel Join Now
WhatsApp Channel Join Now

మొదటి తరగతి ప్రైవేటు పాఠశాలల్లో 25 శాతం ప్రవేశాల సమాచారం – AP RTE 1st Class admission 2024-25

AP RTE 1st Class admission 2024-25 Latest News

AP RTE 1st Class admission 2024-25 Latest News

ఆధార్ కార్డు లింక్ స్టేటస్

Trending Post

ఆధార్ కార్డుకు మొబైల్ నెంబర్ లింక్ స్టేటస్ తెలుసుకునే విధానము

  • విద్యా హక్కు చట్టం RTE Act 2009, సెక్షన్ 12(1)(C) కింద 2024-25 సంవత్సరానికి గాను ఆంధ్రప్రదేశ్ లోని ప్రైవేటు పాఠశాలల్లో 25 శాతం ప్రవేశాలకు దరఖాస్తు చేసుకోవాలని సమగ్ర శిక్షా అభియాన్ రాష్ట్ర ప్రాజెక్టు డైరెక్టర్ శ్రీనివాస రావు తెలిపారు.
  • రాష్ట్ర వ్యాప్తంగా 9350 పాఠశాలలు విద్యా హక్కు చట్టం కింద వివరాలు నమోదు చేసుకున్నాయి. వీటిల్లో 25 శాతం సీట్లకు ప్రభుత్వం నిర్ణయించిన ఫీజులకు ప్రవేశాలు కల్పిస్తారు.
  • 5 నుంచి 6 సంవత్సరాల మధ్య వయసు ఉన్న పిల్లలు అర్హులు.
  • ఎవరికి వారు సొంతంగా దరఖాస్తు చేయు విధానము కింద అప్డేట్ చెయ్యటం జరిగింది . దరఖాస్తుకు గ్రామా వార్డు సచివాలయాలు, ఇంటర్నెట్, మీ సేవ సెంటర్ లను కూడా సందర్శించివచ్చ్చు .

What is RTE 12 (1) (c) Act – $ 2 0 0 223?

  •  భారత రాజ్యాంగంలోని 21A అధికరణ ప్రకారం, 6 నుండి 14 సంవత్సరాల మధ్య వయస్సు ఉన్న పిల్లలకు ప్రాథమిక విద్య ఒక ప్రాథమిక హక్కు ఈ హక్కును అమలు చేయడానికీ, ఉచిత మరియు నిర్బంధ విద్యా హక్కు చట్టం, 2009లో రూపొందించబడింది. ఇది 2010లో అమల్లోకి వచ్చింది.
  • విద్యా హక్కు చట్టం 2009, సెక్షన్ 12(1)(c) ప్రకారం ప్రైవేటు అన్ఎయిడెడ్ పాఠశాలలు, ఒకటవి తరగతి ప్రవేశాల్లో కనీసం 25 శాతం, పాఠశాల పరిసర ప్రాంతాల్లోని వెనుకబడిన మరియు బలహీన వర్గాల పిల్లలకు ఉచిత విద్యను అందించాలి. ఒకటి నుండి ఎనిమిదవ తరగతి వరకు చదువుకోవచ్చు.
  • అమలులోకి వచ్చిన సంవత్సరం – 2022-23

Implementation of AP RTE 1st Class Admission in Andhra Pradesh

  • ఇతర రాష్ట్రాల్లో, ప్రైవేట్ స్కూల్ మేనేజ్ మెంట్లకు ప్రభుత్వం పీజు రీయింబర్స్ చేస్తుంది. ఏపీలో పీజు రీయింబర్స్మెంట్సు అమ్మఒడితో ముడిపెట్టారు. తల్లిదండ్రులకు అమ్మఒడి సొమ్ము అందిన వెంటనే ప్రభుత్వం నిర్ణయించిన ఫీజులను పాఠశాలలకు చెల్లించాలి.

AP RTE 1st Class School Fees

  • పట్టణ ప్రాంతాల్లో ఉండే వారికి రూ.8000/-
  • గ్రామీణ ప్రాంతాల్లో ఉండే వారికి రూ.6500/-
  • గిరిజన ప్రాంతాల్లో ఉండే వారికి రూ.5100/-

AP RTE 1st Class Admission Reservations

మొత్తం 25% రిజర్వేషన్ లు కల్పించటం జరుగును .

  • అనాథలు, HIV బాధితులు, దివ్యంగులు – 5%
  • SC విద్యార్థులు 10%
  • ST విద్యార్థులు – 04%
  • BC, OC, మైనారిటీలు ( గ్రామాల్లో సంవత్సర ఆదాయం 1.2 లక్షలు, పట్టణాల్లో 1.44 లక్షలు లోపు ) – 6%

AP RTE 1st Class Admission Documents Required

For Application Purpose

  • మొబైల్ నెంబర్
  • పిల్లల / తల్లి / తండ్రి / సంరక్షకుల ఆధార్ కార్డు
  • పుట్టిన సర్టిఫికెట్
  • చిరునామా సర్టిఫికెట్

కింద వాటిలో ఏదైనా ఒకటి చిరునామా సర్టిఫికెట్ AP RTE 1st Class Admission Address Proofs గా వాడవొచ్చు.

  • ఆధార్ కార్డు
  • ఓటర్ ఐడి కార్డు
  • కరెంట్ బిల్లు
  • టెలిఫోన్ బిల్లు
  • వాటర్ బిల్లు
  • హౌస్ టాక్స్ రసీదు
  • డ్రైవింగ్ లైసెన్సు
  • రెంట్ అగ్రిమెంట్ కాపీ
  • రేషన్ కార్డు
  • ఉద్యోగ సర్టిఫికెట్
  • తాసిల్దారు సర్టిఫికేట్

For Admission Purpose

  • Caste Certificate
  • Income Certificate
  • Disability Certificate (If Disable)

AP RTE 1st Class Admission Age Criteria

For CBSE/IB/ICSE

  • విద్యార్థి తేదీ 01-04-2018 నుండి 31-03-2019 మధ్య పుట్టి ఉండాలి .
  • CBSE, ICSE, IB సిలబస్ పాఠశాలల్లో చేరడానికి 2024 ఏప్రిల్ ఒకటో తేదీ నాటికి ఐదేళ్లు నిండాలి.

For State Syllabus

  • విద్యార్థి తేదీ 01-07-2018 నుండి 30-06-2019 మధ్య పుట్టి ఉండాలి .
  • స్టేట్ సిలబస్ పాఠశాలలో చేరడానికి 2024 జూన్ ఒకటో తేదీ నాటికి విద్యార్థికి ఐదేళ్లు నిండాలి.

AP RTE 1st Class Admission Imporant Dates

  • Online లో దరఖాస్తుకు ప్రారంభ తేదీ – 2024 మార్చి 5
  • Online లో దరఖాస్తుకు చివరి తేదీ – 2024 మార్చి 25

AP RTE 1st Class Admission Seat Allotment Process

  • విద్యార్థి సొంత గ్రామా / వార్డు సచివాలయాలకు 1 కి.మీ. దూరంలోని పాఠశాలల్లో విద్యార్థులకు సీట్లు కేటాయిస్తారు.
  • 1 కి.మీ. పరిధిలో సీటు లభించకపోతే, 3 కి.మీ. దూరం వరకు ఉన్న పాఠశాలల్లోకి ప్రవేశాలు కల్పిస్తారు.
  • దరఖాస్తుల అర్హతను ధృవీకరించిన తర్వాత, ఆన్లైన్ లాటరీ ద్వారా విద్యార్థులకు పాఠశాలలను కేటాయిస్తారు

AP RTE 1st Class Admission FAQ

Q . ప్రైవేట్ పాఠశాలలకు పుస్తకాలు, యూనిఫాంలు మొదలగు వాటికి ఇతర ఫీజులు తల్లిదండ్రులు చెల్లించాలా? పాఠశాలలో మనకు ఎలాంటి సౌకర్యాలు ఉచితంగా లభిస్తాయి?

Ans. పుస్తకాలు, యూనీఫాం మొదలగునవి పాఠశాలలు ఉచితంగానే ఇవ్వాలి. పాఠశాలలోని ఇతర విద్యార్థులతో సమానంగా వీరిని కూడా చూడాలి. మధ్యాహ్న భోజనం లాంటి వసతులు ఉండవు.

Q. తల్లిదండ్రులు/సంరక్షకులు పాఠశాలను ఎలా ఎంచుకోవచ్చు?

Ans. వారు తమ నివాసానికి ట్యాగ్ చేయబడిన సంబంధిత సచివాలయాలకి 1 నుండి 3 కి.మీల దూరంలో ఉన్న పాఠశాలలను ఎంపిక చేసుకోవచ్చు.

Q. మేము ఇల్లు మారాము కానీ నా ఆధార్ కార్డ్లో మునుపటి ఇంటి ఇంటి చిరునామా ఉంది?

మీరు విద్యుత్ బిల్లును ఉపయోగించవచ్చు

Q. ఏవైనా సమస్యలుంటే ఎవరు పరిష్కరిస్తారు?

Ans. BEO/MEO/DEO లను సంప్రదించవచ్చు.

AP RTE 1st Class admission 2024-25

AP RTE 1st Class Admission Toll free Numbers – Contact Numbers

  • Govt Helpline Number – 18004258599
  • Indus Action Helpline Number – 04045208001
  • Govt Toll Free number – 18004258588
  • Central Toll Free Number – 14417

AP RTE 1st Class Admission Online Process – AP RTE Act 1st Class Admission 2024 2025 Apply Online

12(1)(C) అప్లికేషన్ రిజిస్ట్రేషన్ అనేది విద్యార్థుల ఆధార్ నెంబరు ఆధారంగా ఉంటుంది. విద్యార్థికి ఆధార్ నెంబరు లేకపోతే అప్పుడు వారి తల్లి లేదా తండ్రి లేదా సంరక్షకుల ( తల్లి మరియు తండ్రి లేని అనాధ పిల్లలకు ) ఆధార నెంబర్ పై రిజిస్ట్రేషన్ అవ్వాలి.

Step 1 : కింద ఇవ్వబడిన లింక్ ఓపెన్ చేసి Register పై క్లిక్ చేయాలి.

RTE Act 1st Class Admission Online Link – Click Here

Step 2 : రిజిస్ట్రేషన్ చేసుకునే సమయంలో విద్యార్థి లేదా తల్లి లేదా తండ్రి లేదా సంరక్షకులు తప్పనిసరిగా BPL ఫ్యామిలీ అయి ఉండాలి అప్పుడు మాత్రమే రిజిస్ట్రేషన్కు అవకాశం ఉంటుంది. రిజిస్టర్ పేజీ ఓపెన్ చేసిన వెంటనే రెండు ఆప్షన్లో చూపిస్తుంది.

1. Child Is Having Aadhaar Number

2. Child is not having Aadhaar number

AP RTE 1st Class admission 2024-25

పిల్లలకు ఆధార్ నెంబరు ఉన్నట్టయితే Child Is Having Aadhaar Number ♡ ♡ 35 33 , 2 ఆధార్ నెంబరు ఎంటర్ చేసి GO పై క్లిక్ చేయాలి. తరువాత

1. విద్యార్థి పూర్తి పేరు

2. విద్యార్థి ఆధార్ నెంబరు వి

3. ద్యార్థి పుట్టిన తేదీ

4. ఇమెయిల్ ఐడి ( లేక పోతే అవసరం లేదు )

5.జిల్లా

6. మండలం

7. సచివాలయం

8. ఇంటి నెంబర్

9. పిన్ కోడ్

10. ఫోన్ నెంబర్ ( తరువాత మార్చుకోవచ్చు )

11. రేషన్ కార్డు నెంబర్ ( లేక పోతే అవసరం లేదు )

12. వయసు

13. లింగము

14. మతము

15. కులము

15. కులము

16. విద్యార్థికి తల్లి / తండ్రి ఉన్నారా?

17. ఉంటే తల్లి / తండ్రి పేరు

18. తల్లి / తండ్రి ఆధార్ నెంబర్

19. అక్క / అన్న ఉన్నారా ?

20. ఉంటే అక్క / అన్నయ్య ఆధార్ నెంబర్

21. అక్క / అన్నయ్య చదివే స్కూల్ UDISE కోడ్

22. సమస్యలు ఉన్నాయా? (వికలాంగులు / HIV / ఎయిడ్స్ / అనాథ )

23. చిరునామా ప్రూఫ్ అప్లోడ్

24. డేట్ అఫ్ బర్త్ సర్టిఫికెట్

25. విద్యార్థి / తల్లి /తండ్రి / సంరక్షకులు ఒకే చిరునామాలు ఉన్నారా?

తరువాత Register పై క్లిక్ చేయాలి.

Step 3 : రిజిస్టర్ అయిన తరువాత మొబైల్ నెంబర్ కు User Name & Password లు వస్తాయి. Change Password చేసుకోవాలి.

Step 4 : లాగిన్ అయిన తరువాత విద్యార్థి లేదా తల్లి తండ్రి లేదా సంరక్షకుల ఆధార్ నెంబరు ఎంటర్ చేసి GO పై క్లిక్ చేస్తే GSWS Server లొ ఉండే డేటా అనగా పేరు, జిల్లా పేరు ,మండలం పేరు,పంచాయతీ పేరు, మొబైల్ నెంబరు,చిరునామా వస్తాయి. మొబైల్ నెంబర్ ను ఎడిట్ చేసుకునే అవకాశం ఉంటుంది. రిజిస్ట్రేషన్ సమయంలో ఏ నెంబర్ అయితే ఇస్తారో ఆ నెంబర్ మాత్రమే ఇక్కడ ఎంటర్ చేయవలసి ఉంటుంది.

AP RTE 1st Class admission 2024-25

Step 5 : ఇతర వివరాలు అనగా PIN Code, E-Mail, DOB, Age, Gender, Religion, Caste, Rice Card Number (Weaker Section వాళ్లకు తప్పనిసరి) ఎంటర్ చేయాలి.

Step 6 : విద్యార్థి యొక్క వయసు ఐదు సంవత్సరాలు కన్నా ఎక్కువ ఆరు సంవత్సరాల తక్కువ ఉండాలి.

For CBSE/IB/ICSE

  • విద్యార్థి తేదీ 01-04-2018 నుండి 31-03-2019 మధ్య పుట్టి ఉండాలి .
  • CBSE, ICSE, IB సిలబస్ పాఠశాలల్లో చేరడానికి 2024 ఏప్రిల్ ఒకటో తేదీ నాటికి ఐదేళ్లు నిండాలి.

For State Syllabus

  • విద్యార్థి తేదీ 01-07-2018 నుండి 30-06-2019 మధ్య పుట్టి ఉండాలి .
  • స్టేట్ సిలబస్ పాఠశాలలో చేరడానికి 2024 జూన్ ఒకటో తేదీ నాటికి విద్యార్థికి ఐదేళ్లు నిండాలి.

Step 7 : విద్యార్థి తోబుట్టువులు ఎవరైనా ఉంటే Weather The Applicant Is Having Sibling (YES/NO) YES అని లేకపోతే NO అని సెలెక్ట్ చేయాలి. YES అని పెడితే Sibling యొక్క ఆధార్, చదువుతున్న పాఠశాల UDISE కోడ్ ఎంటర్ చేయాలి.

Step 8:

  • Children With Disability / Special Needs (CWSN)
  • Children Suffering From HIV/AIDS
  • Children is Orphan

పై డేటా ఇవ్వ వలెను.

Step 9 : అప్లికేషన్ చేస్తున్న సమయంలో చిరునామా తప్పుగా ఉన్నట్లయితే చిరునామాను మార్చుకునే అవకాశం ఉంది. దానికిగాను కింద ఇవ్వబడిన ఏదైనా ఒక ప్రూఫ్ అప్లోడ్ చేయాలి.

  • ఆధార్ కార్డు
  • ఓటర్ కార్డు
  • కరెంట్ బిల్లు
  • టెలిఫోన్ బిల్లు
  • వాటర్ బిల్లు
  • హౌస్ టాక్స్ రసీదు
  • డ్రైవింగ్ లైసెన్సు
  • ఇంటి రెంట్ అగ్రిమెంట్ కాపీ
  • రేషన్ కార్డు
  • ఉద్యోగి సర్టిఫికెట్
  • సంబంధిత ఎమ్మార్వో లేదా లోకల్ అధికారి నుండి సర్టిఫికెట్

పై రిజిస్ట్రేషన్ పూర్తి అయిన తర్వాత ఎవరైతే అప్లికేషన్ చేస్తారో వారికి అప్లికేషన్ ఐడి మరియు పాస్వర్డ్ ఎస్ఎంఎస్ రూపంలో వస్తుంది. ఆ డేటా Save చేసుకోవాలి.

AP RTE 1st Class admission 2024-25

AP RTE 1st Class Admission Web Options Selection Process

విద్యార్థి లేదా తల్లి లేదా తండ్రి లేదా సంరక్షకులు ఉన్నటువంటి చిరునామా నుంచి ఒక కిలోమీటర్ పరిధిలో ఉన్న పాఠశాలలో కనిపిస్తాయి. పాఠశాలల సంఖ్య 10 కన్న తక్కువ ఉన్నట్టయితే అప్పుడు మూడు కిలోమీటర్ల పరిధిలో ఉన్నటువంటి పాఠశాలల లిస్టు చూపించడం జరుగును. ఒక కిలోమీటర్లు మరియు మూడు కిలోమీటర్ల పరిధిలో ఏ ఒక్క పాఠశాల లేనట్టు అయితే అప్పుడు మిగిలిన పాఠశాలల లిస్టు చూపించడం జరుగును. విద్యార్థి యొక్క వయసు ఆధారంగా స్కూల్ ల వివరాలనేవి చూపించడం జరుగును. లిస్టులో నుంచి గరిష్టంగా 10 పాఠశాలను సెలెక్ట్ చేసుకోవాలి. తరువాత సబ్మిట్ చేయవలసి ఉంటుంది.

AP RTE 1st Class admission 2024-25

AP RTE 1st Class admission 2024-25,AP RTE 1st Class admission 2024-25,AP RTE 1st Class admission 2024-25,AP RTE 1st Class admission 2024-25,AP RTE 1st Class admission 2024-25,AP RTE 1st Class admission 2024-25,AP RTE 1st Class admission 2024-25,AP RTE 1st Class admission 2024-25,AP RTE 1st Class admission 2024-25,AP RTE 1st Class admission 2024-25

AP RTE 1st Class Admission Downloads

Rate this post

ప్రభుత్వ పథకాలు, ప్రభుత్వ ఉద్యోగాలు, ప్రైవేట్ కంపెనీ ఉద్యోగాల గురించి రోజువారీ సమాచారాన్ని పొందడానికి మా వాట్సాప్ ఛానెల్‌లో మరియు టెలిగ్రామ్ ఛానెల్‌లో చేరండి

Telegram Channel Join Now
WhatsApp Channel Join Now

Related Posts

New Ration Card AP 2024

New Ration Card AP 2024: సంక్రాంతికి రేషన్‌కార్డులు లేనట్టే!

Infosys Java Developer Jobs 2024

Infosys Java Developer Jobs 2024: Infosys కంపెనీలో భారీగా ఉద్యోగాలు

Tech Mahindra Recruitment 2024 | టెక్ మహీంద్రా వాయిస్ ప్రాసెస్ జాబ్స్ | Apply Online

Leave a comment