PM Kisan Payment Status PM Kisan Beneficiary List PM Kisan eKYC

జమిలి ఎన్నికలు… సలహాలు, సూచనలు కోరిన కమిటీ – One Nation One Election

Telegram Channel Join Now
WhatsApp Channel Join Now

Table of Contents

జమిలి ఎన్నికలు… సలహాలు, సూచనలు కోరిన కమిటీ -One Nation One Election

దేశంలో లోక్ సభ ఎన్నికలు, అసెంబ్లీ ఎన్నికలు ఒకేసారి జరపాలన్న ఉద్దేశంతో కేంద్రం ఒకే దేశం-ఒకే ఎన్నిక అంశాన్ని తెరపైకి తెచ్చింది. తద్వారా గణనీయంగా ఖర్చు తగ్గుతుందన్నది కేంద్రం భావన.1952లో స్వతంత్ర భారతదేశంలో జరిగిన తొలి ఎన్నికల నుంచి 1967 వరకు ఇలాగే ఏకకాలంలో ఎన్నికలు జరిగేవి. దీనిపై సమగ్ర అధ్యయనం కోసం భారత మాజీ రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ అధ్యక్షతన ఓ కమిటీని కూడా నియమించింది. ఈ కమిటీలో అమిత్ షా, గులాం నబీ ఆజాద్, ఎన్ కె సింగ్, సుభాష్ కశ్యప్, సంజయ్ కొఠారీ ఉన్నారు. ప్రత్యేక ఆహ్వానితుడిగా న్యాయశాఖ మంత్రి, కమిటీ కార్యదర్శిగా న్యాయశాఖ కార్యదర్శి వ్యవహరిస్తారు.జమిలి ఎన్నికలు

జమిలి ఎన్నికలు

ఇప్పటికే ఈ కమిటీ పని ప్రారంభించి రెండు సార్లు సమావేశమైంది. వివిధ వర్గాలను కలుస్తూ అభిప్రాయసేకరణ జరుపుతోంది. రాజకీయ పార్టీలను, న్యాయ కమిషన్ ను కూడా కలిసింది. తాజాగా, ప్రజల నుంచి సలహాలు, సూచనలకు ఆహ్వానం పలికింది. దేశంలో ఒకేసారి పార్లమెంటు, రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల అసెంబ్లీ ఎన్నికలు జరపడంపై ప్రజలు తమ అభిప్రాయాలను తెలియజేయాలని కోవింద్ కమిటీ తెలిపింది.

High Court Vacancy 2025
High Court Vacancy 2025 – Exam లేకుండా డేటా ఎంట్రీ ఆపరేటర్ & టెక్నికల్ అసిస్టెంట్ కొత్త నియామకాలు

ప్రజలు తమ సూచనలు, సలహాలను onoe.gov.in వెబ్ పోర్టల్ ద్వారా, sc-hlc@gov.in మెయిల్ ఐడీకి ఈ-మెయిల్ చేయడం ద్వారా తెలియజేయవచ్చని కమిటీ వివరించింది. ప్రజలు తమ అభిప్రాయాలను జనవరి 15 లోపు తెలియజేయాలని వెల్లడించింది.

WCD Bapatla Recruitment 2025
WCD Bapatla Recruitment 2025: మహిళలు & శిశు అభివృద్ధి శాఖలో కొత్త ఉద్యోగాలు – పూర్తి వివరాలు

ప్రభుత్వ పథకాలు, ప్రభుత్వ ఉద్యోగాలు, ప్రైవేట్ కంపెనీ ఉద్యోగాల గురించి రోజువారీ సమాచారాన్ని పొందడానికి మా వాట్సాప్ ఛానెల్‌లో మరియు టెలిగ్రామ్ ఛానెల్‌లో చేరండి

Telegram Channel Join Now
WhatsApp Channel Join Now
WhatsApp