కు గొసూర్యకుమార్ యాదవ్ప్ప అవకాశం.. మరో అవార్డుకు నామినేట్ -Suryakumar Yadav
సూర్యకుమార్ యాదవ్ ప్రస్తుతం ఐసీసీ టీ20 ర్యాంకింగ్స్ లో నెంబర్ 1 గా కొనసాగుతున్నాడు. వరుసగా రెండో సంవత్సరం మెన్స్ టీ20 క్రికెటర్‌గా అవార్డును సొంతం చేసుకునే అవకాశం వచ్చింది. 2022 లో టీ20 క్రికెటర్ ఆఫ్ ది ఇయర్ అవార్డును గెలుచుకున్న సంగతి తెలిసిందే. తాజాగా ఐసీసీ టీ20 క్రికెటర్ ఆఫ్ ది ఇయర్ నామినీలను ప్రకటించగా.. సూర్య కుమార్ యాదవ్ కు వరుసగా రెండోసారి ఈ లిస్టులో చోటు దక్కింది. జింబాబ్వే స్టార్ ఆల్ రౌండర్ సికందర్ రజా, న్యూజిలాండ్ క్రికెటర్ మార్క్ చాప్‌మన్, ఉగాండా స్పిన్ సంచలనం అల్పేష్ రంజానీ ఈ అవార్డు రేస్ లో ఉన్నారు.
టీ20ల్లో 2021లో అరంగేట్రం చేసిన సూర్యకుమార్ యాదవ్ తనదైన ముద్ర వేశాడు. నిలకడ కలిగిన ఆటతో పాటు వేగంగా పరుగులు చేస్తున్నాడు. ముంబైకి చెందిన సూర్య.. 2023 టీ 20 ఫార్మాట్ లో అత్యధిక పరుగులు చేసిన ఆటగాళ్లలో మూడో స్థానంలో ఉన్నాడు. 18 మ్యాచ్‌లలో 48.56 యావరేజ్ తో 733 పరుగులు చేశాడు. వీటిలో 2 సెంచరీలు ఉండటంతో పాటు 155.95 స్ట్రైక్ రేట్ ఉండటం విశేషం. ఇప్పటివరకు మొత్తం టీ20 కెరీర్ లో 60 మ్యాచ్ లు ఆడిన సూర్య.. 4 సెంచరీలతో 2141 పరుగులు చేశాడు.