జమిలి ఎన్నికలు… సలహాలు, సూచనలు కోరిన కమిటీ – One Nation One Election

grama volunteer

జమిలి ఎన్నికలు
Telegram Channel Join Now
WhatsApp Channel Join Now

జమిలి ఎన్నికలు… సలహాలు, సూచనలు కోరిన కమిటీ -One Nation One Election

దేశంలో లోక్ సభ ఎన్నికలు, అసెంబ్లీ ఎన్నికలు ఒకేసారి జరపాలన్న ఉద్దేశంతో కేంద్రం ఒకే దేశం-ఒకే ఎన్నిక అంశాన్ని తెరపైకి తెచ్చింది. తద్వారా గణనీయంగా ఖర్చు తగ్గుతుందన్నది కేంద్రం భావన.1952లో స్వతంత్ర భారతదేశంలో జరిగిన తొలి ఎన్నికల నుంచి 1967 వరకు ఇలాగే ఏకకాలంలో ఎన్నికలు జరిగేవి. దీనిపై సమగ్ర అధ్యయనం కోసం భారత మాజీ రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ అధ్యక్షతన ఓ కమిటీని కూడా నియమించింది. ఈ కమిటీలో అమిత్ షా, గులాం నబీ ఆజాద్, ఎన్ కె సింగ్, సుభాష్ కశ్యప్, సంజయ్ కొఠారీ ఉన్నారు. ప్రత్యేక ఆహ్వానితుడిగా న్యాయశాఖ మంత్రి, కమిటీ కార్యదర్శిగా న్యాయశాఖ కార్యదర్శి వ్యవహరిస్తారు.జమిలి ఎన్నికలు

జమిలి ఎన్నికలు

ఇప్పటికే ఈ కమిటీ పని ప్రారంభించి రెండు సార్లు సమావేశమైంది. వివిధ వర్గాలను కలుస్తూ అభిప్రాయసేకరణ జరుపుతోంది. రాజకీయ పార్టీలను, న్యాయ కమిషన్ ను కూడా కలిసింది. తాజాగా, ప్రజల నుంచి సలహాలు, సూచనలకు ఆహ్వానం పలికింది. దేశంలో ఒకేసారి పార్లమెంటు, రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల అసెంబ్లీ ఎన్నికలు జరపడంపై ప్రజలు తమ అభిప్రాయాలను తెలియజేయాలని కోవింద్ కమిటీ తెలిపింది.

ఆధార్ కార్డు లింక్ స్టేటస్

Trending Post

ఆధార్ కార్డుకు మొబైల్ నెంబర్ లింక్ స్టేటస్ తెలుసుకునే విధానము

ప్రజలు తమ సూచనలు, సలహాలను onoe.gov.in వెబ్ పోర్టల్ ద్వారా, [email protected] మెయిల్ ఐడీకి ఈ-మెయిల్ చేయడం ద్వారా తెలియజేయవచ్చని కమిటీ వివరించింది. ప్రజలు తమ అభిప్రాయాలను జనవరి 15 లోపు తెలియజేయాలని వెల్లడించింది.

Rate this post

ప్రభుత్వ పథకాలు, ప్రభుత్వ ఉద్యోగాలు, ప్రైవేట్ కంపెనీ ఉద్యోగాల గురించి రోజువారీ సమాచారాన్ని పొందడానికి మా వాట్సాప్ ఛానెల్‌లో మరియు టెలిగ్రామ్ ఛానెల్‌లో చేరండి

Telegram Channel Join Now
WhatsApp Channel Join Now

Related Posts

Free Electricity Scheme AP

Free Electricity Scheme AP: Free Power for Weavers in Andhra Pradesh from August 7 – Check Eligibility Details

Jio Finance Loan 2025

Jio Finance Loan 2025: Get a Loan of up to ₹1 Crore in Just 10 Minutes from Home – Full Details

Thalliki Vandanam Grievance 2025: తల్లికి వందనం డబ్బులు రాలేదు? కారణాలు, గ్రీవెన్స్ ఎలా పెట్టాలి? పూర్తి సమాచారం

grama volunteer avatar

 

WhatsApp