The Family Star Telugu Movie Review
క్లీన్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్.. విజయ్ దేవరకొండ వన్ మ్యాన్ షో.. ఫ్యామిలీ స్టార్
The Family Star Telugu Movie Review
Trending Post
ఆధార్ కార్డుకు మొబైల్ నెంబర్ లింక్ స్టేటస్ తెలుసుకునే విధానము
Rating: 3/5
నటీనటులు: విజయ్ దేవరకొండ, మృణాల్ ఠాకూర్ తదితరులు
నిర్మాతలు: రాజు, శిరీష్
రచన, దర్శకత్వం: పరశురామ్ పెట్ల
సినిమాటోగ్రఫీ: కేయూ మోహనన్
సంగీతం: గోపీసుందర్
ఆర్ట్ డైరెక్టర్: ఏ ఎస్ ప్రకాష్
ఎడిటర్: మార్తాండ్ కె వెంకటేష్
క్రియేటివ్ ప్రొడ్యూసర్: వాసు వర్మ
బ్యానర్: శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్
రిలీజ్ డేట్: 2023-04-05
The Family Star Telugu Movie Review
మధ్య తరగతి ఉమ్మడి కుటుంబంలో అన్నలు,వదినలు, వారి పిల్లలతోపాటు బామ్మ బాధ్యతలను మోసే యువకుడు గోవర్ధన్ (విజయ్ దేవరకొండ). మిడిల్ క్లాస్ ఫ్యామిలీలో బంధాలకు కట్టుబడి ఉంటాడు. తన జీతం మీదే జీవితాన్ని కొనసాగించే సమయంలో సెంట్రల్ యూనివర్సిటీలో రీసెర్చ్ చేసే ఇందు (మృణాల్ థాకూర్) లైఫ్‌లోకి వస్తుంది. ఇందు చేసిన ఓ పనికి హర్ట్ అయిన గోవర్దన్ ఆమెను దూషించి కొడుతాడు. మధ్య తరగతి వాడు తలుచుకొంటే ఏదైనా సాధించగలడు అని ప్రముఖ రియల్ ఎస్టేట్ కంపెనీ ఓనర్ (జగపతిబాబు) కంపెనీలో మంచి ఉద్యోగంలో చేరి ఇందు చేసిన పని తప్పు అని నిరూపించే ప్రయత్నంలో ఉంటాడు.
గోవర్ధన్ లైఫ్‌లోకి ఇందు ఎలా వచ్చింది? గోవర్ధన్ కుటుంబాన్ని ఇందు ఎలా హర్ట్ చేసింది? అసలు ఇందు వారి జీవితంలోకి ఎందుకు వచ్చింది? రియల్ ఎస్టేట్ సంస్థలో చేరిన గోవర్ధన్ అమెరికాలోని ప్రాజెక్టులో పనిచేయడానికి వెళ్లినప్పుడు ఇందూ కూడా అక్కడికి ఎందుకు వెళ్లింది? అమెరికాలో ఇందు, గోవర్ధన్ మధ్య ఎలాంటి సంఘటనలు చోటుచేసుకొన్నాయి? ఇందును గోవర్ధన్ క్షమించాడా? ఒకవేళ క్షమిస్తే.. ఎలాంటి పరిస్జితులు వారి మధ్య జరిగాయి? ఇందు చేసిన పని తప్పని నిరూపించాడా? లేదా తనదే తప్పు అని ఒప్పుకొన్నాడా? వారిద్దరి మధ్య ప్రేమకు ఎలాంటి పరిష్కారం లభించింది అనే ప్రశ్నలకు సమాధానమే ది ఫ్యామిలీ స్టార్ సినిమా కథ.
మధ్య తరగతి యువకుడు తన కుటుంబాన్ని కంటికి రెప్పలా కాపాడుకొనేందుకు ఎలాంటి బాధ్యతలను భుజాన వేసుకొన్నారనే అంశాలను ఫన్ వేలో చూపించడంతో కథ ఎంటర్‌టైనింగ్‌గా సాగుతుంది. అయితే ఫీల్ గుడ్ ఫ్యాక్టర్ లేకపోవడం వల్ల ఫస్టాఫ్‌లో అక్కడక్కడ సన్నివేశాలు చాలా స్లోగా, రొటీన్‌గా అనిపిస్తాయి. ఫస్టాఫ్‌లో విజయ్ యాక్టింగ్, రెండు ఫైట్స్ అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకొనేలా డిజైన్ చేయడం బాగుంది. కథను మలుపుతిప్పే పాయింట్‌తో ఫస్టాఫ్ ముగుస్తుంది.
ఇక సెకండాఫ్ విషయానికి వస్తే.. ఓ ట్విస్టుతో అమెరికాలో కథ మొదలవుతుంది. విజయ్, మృణాల్ మధ్య టిట్ ఫర్ టాట్ తరహా సన్నివేశాలు ఆసక్తికరంగా ఉంటాయి. అమెరికాలో క్లబ్ సీన్‌లో గోవర్దన్ క్యారెక్టర్‌తో ఓ సీన్ ఫన్ క్రియేట్ చేసింది. ప్రీ క్లైమాక్స్ వరకు కథ మంచి జోష్‌తో సాగుతుంది. క్లైమాక్స్ వరకు వచ్చే సరికే బలమైన కాన్‌ఫ్లిక్ లేకపోవడం వల్ల మూవీ రొటీన్‌గా ముగియడం ఓ మైనస్‌గా అనిపిస్తుంది. ఈ మూవీకి మ్యూజిక్, పాటలు మైనస్ కావడం మరో ప్రతికూల అంశంగా చెప్పుకోవచ్చు.
Leave a comment