Annadata Sukhibhava latest update 2024

Table of Contents

Telegram Channel Join Now
WhatsApp Channel Join Now

Annadata Sukhibhava latest update 2024

 

రైతులకు గుడ్ న్యూస్.. ఏటా రూ.20 వేలు.. త్వరలోనే విధివిధానాల ఖరారు!

 

    ఏపీ ప్రభుత్వం మరో హామీ అమలుపై దృష్టిపెట్టినట్లు తెలుస్తోంది. ఇప్పటికే మెగా డీఎస్సీ, పింఛన్లు, ఉచిత ఇసుక వంటి హామీలను అమలు చేసిన ప్రభుత్వం.. త్వరలోనే రైతులకు సంబంధించిన పథకాన్ని కూడా అమలుచేయనున్నట్లు తెలిసింది. అన్నదాత సుఖీభవ పేరుతో రైతులకు ఏటా రూ.20 వేలు అందిస్తామని టీడీపీ కూటమి ఎన్నికల ప్రచారంలో హామీ ఇచ్చింది. అధికారంలోకి వచ్చిన నేపథ్యంలో ఈ హామీ అమలుపై దృష్టిపెట్టినట్లు సమాచారం.

    ఇప్పటికే రైతుభరోసా పేరుతో ఉన్న పోర్టల్‌ను టీడీపీ కూటమి ప్రభుత్వం అన్నదాత సుఖీభవగా మార్చింది. ఈ పథకానికి సంబంధించి త్వరలోనే విధివిధానాలు ఖరారు చేయనున్నట్లు సమాచారం.

    ఆంధ్రప్రదేశ్‌లో కొలువు దీరిన టీడీపీ కూటమి ప్రభుత్వం మరో పథకం అమలుపై దృష్టి పెట్టినట్లు తెలుస్తోంది. ఇప్పటికే సామాజిక భద్రత పింఛన్ల పెంపు, మెగా డీఎస్సీ, ఉచిత ఇసుక వంటి హామీలను అమలుచేసిన ఏపీ ప్రభుత్వం.. ఈసారి రైతులకు మేలు కలిగించేలా నిర్ణయం తీసుకోనున్నట్లు తెలిసింది. 2024 ఏపీ అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో టీడీపీ కూటమి అనేక హామీలు ఇచ్చింది.

Annadata Sukhibhava latest update

   అందులో ప్రధానంగా సూపర్ సిక్స్ పేరిట టీడీపీ ప్రకటించిన మేనిఫెస్టో జనంలోకి బలంగా దూసుకెళ్లి ఓట్ల వర్షం కురిపించింది. సూపర్ సిక్స్ హామీల్లో భాగంగా అన్నదాత సుఖీభవ పేరిట రైతులకు ఏటా రూ.20 వేలు చొప్పున పెట్టుబడి సాయం అందిస్తామని అప్పట్లో ప్రకటించారు. ప్రభుత్వం ఏర్పాటైన నేపథ్యంలో హామీల అమలుపై కసరత్తు ప్రారంభించిన టీడీపీ.. అన్నదాత సుఖీభవ పథకం అమలుపైనా ఫోకస్ పెట్టినట్లు తెలుస్తోంది.

Vijayawada floods Report
ఏపీలో వరద నష్టంపై కేంద్రానికి నివేదిక పంపిన ప్రభుత్వం

   వైసీపీ ప్రభుత్వ హయాంలో రైతుభరోసా పేరిట రైతులకు పెట్టుబడి సాయం అందించేవారు. ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి పేరిట కేంద్రం ఏటా అందించే రూ.6 వేలకు తోడు మరో రూ.7,500 కలిపి.. ఏటా రూ.13,500 సాయంగా అందిస్తూ వచ్చారు. అయితే ఎన్నికల ప్రచారం సమయంలో ఈ మొత్తాన్ని రూ.20 వేలకు పెంచుతామని టీడీపీ హామీ ఇచ్చింది. అధికారంలోకి వచ్చిన నేపథ్యంలో త్వరలోనే ఈ హామీ అమలుపై నిర్ణయం తీసుకోనున్నట్లు సమాచారం.

    గతంలోలాగే మూడు విడతల్లో రూ. 20 వేలు సాయం అందించనున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే అన్నదాత సుఖీభవ పేరిట పోర్టల్ కూడా ప్రారంభించారు. అన్నదాత సుఖీభవ పథకం కింద కేంద్రం ఇచ్చే రూ.6 వేలకు తోడు మరో 14 వేలు కలిపి రూ.20 వేలు అందించనున్నట్లు తెలిసింది.

   ఈ పథకం అమలుపై విధివిధానాలు కూడా ప్రభుత్వం త్వరలోనే ఖరారు చేయనుంది. కుటుంబంలో ఒకరికే ఈ పథకం కింద లబ్ధి పొందేలా నిబంధనలు ఉండనున్నట్లు తెలిసింది. జులై నెలలోనే కేంద్రం, రాష్ట్రాలు బడ్జెట్ ప్రవేశపెట్టనున్నాయి. ఈ నేపథ్యంలో బడ్జెట్‌లో ఈ పథకానికి కేటాయింపులు జరిపి.. ఆ తర్వాత అమలు చేసే అవకాశాలు ఉన్నాయి.

More Links :

అన్నదాత సుఖీభవ పథకం – Click Here

ఆడబిడ్డ నిధి పథకం – Click Here

Thalliki Vandanam Scheme Details 2024 – Click Here

PM Kisan 18th Installment Date 2024 Telugu
PM కిసాన్ 18వ విడత తేదీ 2024: చెల్లింపు స్థితి, లబ్ధిదారుల జాబితా

AP Deepam Scheme Details 2024 – Click Here

NTR Bharosa Pension Scheme Details 2024 – Click Here

Ap New Scheme for Women – Click Here

 

Tags : Annadata Sukhibhava Scheme 2024, annadata sukhibhava ap gov in status check, annadata sukhibhava status, annadata sukhibhava payment status, annadata sukhibhava payment status 2024, nnadata sukhibhava in telugu, annadata sukhibhava scheme, annadata sukhibhava scheme apply online, annadata sukhibhava official website, annadata sukhibhava logo, annadata sukhibhava registration, annadata sukhibhava release date, annadata sukhibhava helpline number, Annadata Sukhibhava latest update, Annadata Sukhibhava latest update, Annadata Sukhibhava latest update, anna data sukhibhava, annadata sukhibhava official website, Annadata Sukhibhava latest update.

4.2/5 - (5 votes)

ప్రభుత్వ పథకాలు, ప్రభుత్వ ఉద్యోగాలు, ప్రైవేట్ కంపెనీ ఉద్యోగాల గురించి రోజువారీ సమాచారాన్ని పొందడానికి మా వాట్సాప్ ఛానెల్‌లో మరియు టెలిగ్రామ్ ఛానెల్‌లో చేరండి

Telegram Channel Join Now
WhatsApp Channel Join Now

Related Job Posts

Vijayawada floods Report

ఏపీలో వరద నష్టంపై కేంద్రానికి నివేదిక పంపిన ప్రభుత్వం

PM Kisan 18th Installment Date 2024 Telugu

PM కిసాన్ 18వ విడత తేదీ 2024: చెల్లింపు స్థితి, లబ్ధిదారుల జాబితా

Anganwadi Recruitment 2024 Kadapa

అంగన్వాడీ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ 2024 | దరఖాస్తు ప్రక్రియ & చివరి తేదీ

One response to “Annadata Sukhibhava latest update 2024”

  1. Jagadish avatar
    Jagadish

    Yes I am interested

1 thought on “Annadata Sukhibhava latest update 2024”

Leave a comment