Caste Survey in Andhra Pradhesh
కుల గణన పూర్తి సమాచారం
AP Caste Survey Updates:
- నవంబర్ నెల 27 నుంచి కులగణన ( Caste Enumeration Caste Survey ) ప్రారంభించాలని రాష్ట్ర ప్రభుత్వం నవంబర్ 3న జరిగిన మంత్రి వర్గ సమావేశంలో కుల గణన ( AP Caste Survey 2023) కు ఆమోదం ఇచ్చింది. దీన్ని డిజిటల్ విధానంలో చేపట్టనుంది. ఇందుకోసం ప్రత్యేక ప్రశ్నావళితో యాప్ను సిద్ధం చేస్తోంది.
- నవంబర్ 15 నుంచి 5 సచివాలయంలో అందులో 3 గ్రామా సచివాలయాలు, 2 వార్డు సచివాలయాల్లో పైలెట్ ప్రాజెక్ట్ మొదలు అవ్వనుంది .
- నవంబర్ 16న కుల గణన కోసం ప్రత్యేక App అందుబాటులోకి.
- ఎన్యుమరేటర్లుగా గ్రామా వార్డు సచివాలయ సిబ్బంది వ్యవహరిస్తారు .
- సచివాలయ సిబ్బంది, మండల సిబ్బంది వారికి నవంబర్ 22 వరకు ట్రైనింగ్ ఇవ్వటం జరుగును .
- మొత్తం 5 ప్రాంతీయ రౌండ్ టేబుల్ సమావేశాలు జరుగుతాయి. నవంబర్ 17న రాజమండ్రి, కర్నూల్ లో 20న విశాఖపట్నం, విజయవాడ లో, 24న తిరుపతి లో ప్రాంతీయ సదస్సులు జరుగుతాయి. అందులో కుల గణన పై చర్చలు జరగనున్నాయి . ప్రాంతీయ సదస్సులు జరిగిన జిల్లాలో జిల్లా స్థాయి సదస్సులు జరగవు.
- గ్రామ, వార్డు సచివాలయాల సిబ్బంది, గ్రామా వార్డు వాలంటీర్ల ద్వారా ఈ గణన నిర్వహించనున్నట్లు ప్రభుత్వం వెల్లడించింది.
- జిల్లా స్థాయి సమావేశాలు/సదస్సులు నిర్వహించాలని బీసీ సంక్షేమ శాఖ సర్క్యులర్ జారీ చేసింది. దీనికి కుల సంఘాలు, బీసీ కార్పొరేషన్ల చైర్మన్లు, మేధావులు, ప్రజాప్రతినిధులను ఆహ్వానించి వారి సూచనలను స్వీకరించాలని స్పష్టం చేసింది. వారిని ఎంపిక చేసే బాధ్యతను కలెక్టర్ నేతృత్వలోని కమిటీకి అప్పగించింది.
- సదస్సులను విజయవంతంగా నిర్వహించే డానికి వ్యాఖ్యాతలు మోడరేటర్లను ఎంపిక చేయాలని సూచించింది. సమా వేశాలు వివాదాస్పదం కాకుండా ఉండేందుకు వారు నిర్దేశించిన అంశానికే పరిమితమై మాట్లాడేలా చూడాలని ఉత్తర్వుల్లో పేర్కొంది.
Caste Survey in Andhra Pradhesh
కుల గణన షెడ్యూల్ ఏమిటి ?
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రవ్యాప్తంగా కుల గణన సర్వే నవంబర్ 27, 2023 నుండి ప్రారంభం అయ్యి ఒక వారంలోపు సర్వే పూర్తి అవుతుంది. సర్వే చెయ్యని వారికి మరియు హౌస్ హోల్డ్ మ్యాపింగ్ లో లేని కుటుంబ సభ్యులకు సర్వే చేయుటకు చివరి తేదీ డిసెంబర్ 10 2023. కుల గణన సర్వే ఒక ఫేస్ లో మాత్రమే జరుగుతుంది. కుల గణన సర్వేకు నోడల్ డిపార్ట్మెంట్ గా గ్రామ వార్డు సచివాలయ శాఖ ఉంటుంది.
Caste Survey in Andhra Pradhesh
సర్వే ఎలా ఉండబోతుంది ?
గ్రామ వార్డు సచివాలయ సిబ్బంది డోర్ టు డోర్ సర్వే చేయడం జరుగుతుంది. సర్వే అనేది పూర్తిగా స్వచ్ఛందంగా ఉంటుంది. సర్వే చేయు సమయంలో ప్రజల నుంచి డాక్యుమెంట్ విషయంపై ఒత్తిడి లేకుండా సమాచారాన్ని తీసుకోవలసి ఉంటుంది. సేకరించిన సమాచారానికి సంబంధించి గొప్యత పై ప్రభుత్వం ప్రత్యేక చర్యలు తీసుకోవడం. కుల గణన ( Caste Survey Process ) చేయు విధానం.
Caste Survey in Andhra Pradhesh
సర్వే మొబైల్ అప్లికేషన్ ఎలా ఉంటుంది?
• కులగనన సర్వేకు సంబంధించి గ్రామ వార్డు సచివాలయ శాఖ కొత్త మొబైల్ అప్లికేషన్ను డెవలప్మెంట్ చేయడం జరుగుతుంది. ఆ మొబైల్ అప్లికేషన్లో
• ప్రస్తుత ప్రభుత్వం వద్ద ఉన్న డేటాను ప్యూరిఫై చేసి చూపించడం జరగను.
• ప్రభుత్వ వద్ద ఉన్న డేటా బేస్ లో కవర్ అవ్వని కొత్త కుటుంబ సభ్యులను మరియు హౌస్ లను జోడించుటకు ఆప్షన్ ఇవ్వటం జరుగును.
• డోర్ లాక్ / తాత్కాలికంగా బయటకి వెళ్లినవారు / ఆసుపత్రిలో ఉన్నవారికి ప్రత్యేక ఆప్షన్లు ఇవ్వడం జరుగుతుంది.
• శాశ్వత వలసలో ఉన్నవారికి, సంచార సమూహాలకు, డోర్ లాక్ కేసెస్కు ప్రత్యేక ఆప్షన్ ఇవ్వటం జరుగును.
• గ్రామ వార్డు సచివాలయాల ద్వారా ఆనులైనలో డేటా కలెక్షన్ చేయడం జరుగును.
Caste Survey in Andhra Pradhesh
కుల గణన సర్వేలో ఏ ఏ ప్రశ్నలు ఉంటాయి ?
సోషల్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ వారు వివిధ డిపార్ట్మెంట్లను కలగలిపి ప్రశ్నలను సిద్ధం చేయడం జరుగును. ప్రజలకు సంబంధించి పేరు, వయసు, లింగము, వ్యవసాయ భూమి, నివాస భూమి, పశుసంపద, వృత్తి సమాచారం, వివిధ మార్గాల ద్వారా వచ్చే మొత్తం ఆదాయము, కులము, ఉపకులము , మతము, విద్యా అర్హతలు, ఇంటి రకము, సురక్షిత త్రాగునీరు మరియు టాయిలెట్లు, గ్యాస్ అందుబాటు పై ప్రశ్నలు ఉంటాయి.
Caste Survey in Andhra Pradhesh
సర్వే లో సేకరించే సమాచారం :
- కుటుంబం అందుబాటులో ఉన్నారా / మరణించారా / శాశ్వతంగా Migration అయ్యారా
- జిల్లా, జిల్లా కోడ్, మండలం/ మున్సిపాలిటీ, గ్రామం, పంచాయతీ మరియు పంచాయతీ కోడ్, వార్డు నెంబర్, ఇంటి నెంబర్.
- కుటుంబ పెద్ద పేరు, ఆధార్ నెంబర్,
- కుటుంబ సభ్యుల సంఖ్య, Family member పేరు మరియు కుటుంబ పెద్ద తో గల సంబంధం, రేషన్ కార్డు నెంబర్.
- కుటుంబం నివాసం ఉంటున్న ఇళ్లు Type ( Kutcha house, Building, Duplex, pucca house etc.
- ప్రస్తుతం ఉన్న చిరునామా
- Toilet facility ఉందా లేదా?
- మంచి నీరు / త్రాగు నీరు సదుపాయం ఉందా? ( Public tap, Borewell, public borewell etc..).
- Live stock ఏమైనా కలిగి ఉన్నారా? (ఆవులు, గేదెలు, మేకలు, గొర్రెలు etc )
- Gas Connection Type ( LPG / Kerosene / Fire wood etc…
- కుటుంబ సభ్యుల వివరాలు
- Member name, Father name, Gender, Date of birth, వైవాహిక స్థితి, caste, sub caste, Education,Profession ( ప్రస్తుతం చేస్తున్న వృత్తి )
- Agricultural land వివరాలు.
- Residential Land వివరాలు.
ప్రతి వ్యక్తి వివరాలు నమోదు చేసినప్పుడు వారి Ekyc తప్పనిసరి. 8 సంవత్సరాల లోపు ఉన్న వారికి Ekyc తప్పనిసరి కాదు.
Note : ప్రతి కుటుంబానికి సర్వే పూర్తి చేసిన తర్వాత సచివాలయం సిబ్బంది మరియు వాలంటీర్ బయోమెట్రిక్ వేయాలి. ఆలా అయితేనే Final submit అవుతుంది.
Caste Survey in Andhra Pradhesh
డేటాను సేకరించడానికి ఉన్నటువంటి మార్గదర్శకాలు
• గ్రామ వార్డు వాలంటీర్లు మరియు సచివాలయ ఉద్యోగులు కలిపి సర్వే చేయవలసి ఉంటుంది.
• ప్రతి ఇంటికి సర్వే పూర్తి అయిన వెంటనే వాలంటీర్లు మరియు సచివాలయ ఉద్యోగులు ఈ కేవైసీ సబ్మిట్ చేయవలసి ఉంటుంది.
•సర్వే ఇంటికి పూర్తి చేయడానికి ఇంటిలో కుటుంబ సభ్యుల ఈ కేవైసీ తప్పనిసరి. 8 సంవత్సరాల లోపు ఉన్నటువంటి పిల్లలకు మినహాయింపు ఉంటుంది.
•మండలం డివిజనల్ మరియు జిల్లా స్థాయి అధికారులు వెరిఫికేషన్ ఆఫీసర్లుగా ఉంటారు.
Caste Survey in Andhra Pradhesh
పైలెట్ సర్వే ఎలా ఉంటుంది
•పైలెట్ సర్వే చేయడం ద్వారా మొబైల్ అప్లికేషన్ మరియు వివిధ సమస్యలపై అవగాహన వస్తుంది. దానికి అనుగుణంగా గ్రామ వార్డు సచివాలయ శాఖ మొబైల్ అప్లికేషన్లో మార్పులు చేర్పులు చేయడం జరుగుతుంది.
• పైలెట్ సర్వేను ఐదు సచివాలయాల్లో అందులో గ్రామాల్లో మూడు సచివాలయాలు అర్బన్ లో రెండు సచివాలయంలో చేయడం జరుగును.
• పైలెట్ సర్వే అనేది నవంబర్ 16,2023 లోపు పూర్తి అవుతుంది.
Download Caste Survey User Manual :
Leave a comment