డెవిల్ మూవీ రివ్యూ

Table of Contents

Telegram Channel Join Now
WhatsApp Channel Join Now

డెవిల్ మూవీ రివ్యూ

Pakka Telugu Rating : 3.25/5
Cast : కళ్యాణ్ రామ్, సంయుక్త మీనన్, మాళవిక నాయర్, అజయ్, సత్య, జబర్దస్త్ మహేష్, షఫీ
Director : అభిషేక్ నామా
Music Director : హర్షవర్థన్ రామేశ్వర్
Release Date : 29/12/2023

డెవిల్ మూవీ రివ్యూ :

నందమూరి కళ్యాణ్ రామ్ హీరో అభిషేక్ నామా తెరకెక్కించిన మూవీ డెవిల్. బింబిసార మూవీతో బ్లాక్ బ్లాస్టర్ హిట్ అందుకున్న కళ్యాణ్ రామ్ నుంచి వచ్చిన మూవీ కావడంతో ప్రేక్షకుల్లో భారీ అంచనాలు ఉన్నాయి. ఇందులో ఆయనకు జోడిగా సంయుక్త మీనన్ నటించింది. ఈ మూవీలో మాళవిక నాయర్, అజయ్, సత్య కీలక పాత్రలు పోషించారు. అభిషేక్ పిక్చర్స్ బ్యానర్ పై దేవాన్ష్ నామా సమర్పణలో అభిషేక్ నామా నిర్మించారు. ట్రైలర్, టీజర్ తో చిత్రబృందం ఈ మూవీ పై భారీ అంచనాలను పెంచేసింది. మరి ఈ మూవీ ప్రేక్షకులను ఆకట్టుకుందా? అసలు ఈ సినిమా ఎలా ఉందో ఇప్పుడు చూద్దాం!

డెవిల్ మూవీ రివ్యూ

కథ:

ఈ కథ 1945 మొదలవగా అప్పటి బ్రిటీష్ ప్రభుత్వం నేతాజీ సుభాస్ చంద్రబోస్ ను పట్టుకునేందుకు ప్రయత్నాలు చేస్తుంటుంది. అలాంటి టైంలో నేతాజీ భారత్ లో అడుగు పెడుతున్నట్లు బ్రిటీష్ వారు తెలుసుకుంటారు. అదే టైంలో మద్రాసు ప్రెసిడెన్సీలోని రాసపాడు జమీందారు కూతురు విజయ (అభిరామి) హత్య జరుగుతుంది. అయితే కూతుర్ని హత్య చేశాడనే ఆరోపణతో జమీందారును పోలీసులు అరెస్ట్ చేస్తారు. ఈ కేసును చేధించేందుకు బ్రిటీష్ సీక్రెట్ ఏజెంట్ డెవిల్ (కళ్యాణ్ రామ్) రంగంలోకి దిగుతాడు. ఈ కేసులో జమీందారు మేనకోడలు నైషధ (సంయుక్త మీనన్)ను డెవిల్ ఓ కంట కనిపెడుతుంటాడు. అసలు ఆ హత్య చేసింది ఎవరు? ఈ కేసుకు, బోస్‌‌ను పట్టుకునే మిషన్‌కు ఉన్న లింక్ ఏంటి? ఈ కథలో సుభాష్ చంద్రబోస్‌కు రైట్ హ్యాండ్ అయిన త్రివర్ణ ఎవరు? మణిమేఖల (మాళవిక నాయర్) పాత్ర ఏంటి? అన్నది తెలుసుకోవాలంటే సినిమా చూడాల్సిందే!

డెవిల్ మూవీ రివ్యూ

క‌థ‌నం-విశ్లేషణ:

కథను మొదలు పెట్టినప్పటి నుంచి చివరి వరకు ఈ మూవీలో సస్పెన్స్ థ్రిల్లింగ్ అంశాలు చాలానే ఉన్నాయి. అవే మూవీ పై ఆసక్తిని రేకేత్తించేలా చేస్తాయి. పిరియాడిక్ మూవీ కావడం కూడా ఆసక్తిని పెంచే అంశాలలో ఒకటి. హత్య ఎలా జరిగిందో చేధించడానికి వచ్చిన హీరో ఒక్కోక్క చిక్కుముడిని ఇప్పుకుంటు వెళ్లిన కొద్ధి ప్రేక్షకుల్లో హత్య ఎవరు చేశారో తెలుసుకోవాలనే ఆసక్తి మరింత పెరిగిపోతుంది. హత్య ఎవరు చేశారో తెలియకుండా ఉండటం కోసం జమీందారు కుటుంబం, పని మనుషులపై అనుమానం వచ్చేలా చేయడంలో దర్శకుడు సఫలమయ్యాడనే చెప్పాచ్చు. మరోవైపు నేతాజీ సుభాస్ చంద్రబోస్ ను పట్టుకోవడం కోసం బ్రీటీష్ ప్రభుత్వం చేసే ప్రయత్నాలు కూడా మెప్పిస్తాయి. హీరోయిన్ పై ట్రైబల్స్ దాడి చేసి హతమార్చాలని చూసే సన్నివేశం సెకాండఫ్ పై ఆసక్తిని పెంచుతుంది.

పస్టాఫ్ మొత్తం హత్య చేధించే అంశాంపై ఫోకస్ పెట్టిన దర్శకుడు సెకండాఫ్ లో మరిన్ని థ్రిల్లింగ్ అంశాలను జోడించాడు. బోస్ ముఖ్య అనుచరుడైన త్రివర్ణను పట్టుకోవడం కోసం బ్రిటిష్ వారు ఎత్తులు వేయడం వారి ఎత్తులను చిత్తు చేస్తు త్రివర్ణ… పై ఎత్తులు వేయడం ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది. త్రివర్ణ ను పట్టుకోవడం కోసం బోస్ అనుచరులను బంధించి కోట్టడం వారిని కాపాడటం కోసం అతను బ్రిటీష్ వారిని చంపే సీన్ ఈ సినిమాకు హైలెట్ అని చెప్పచ్చు. బ్రిటిష్ గూడచారి నేతాజీ టీమ్ లో చేరడం ఎవరు ఊహించని ట్వీస్ట్ అనే చెప్పాలి. ఈ మూవీ భారత స్వతంత్ర్య పోరాటంతో లింక్ ఉండటం అందులోను నేతాజీ చుట్టు కథ తిరగడం ఇందులోని కొత్త అంశం. స్క్రీన్ ప్లే మీద ఇంకొంచెం వర్క్ అవుట్ చేసి ఉంటే ఈ సినిమా రిజల్ట్ మరోలా ఉండేది.

సలార్ మూవీ రివ్యూ
సలార్ మూవీ రివ్యూ– పార్ట్ -1 – సీజ్ ఫైర్

డెవిల్ మూవీ రివ్యూ

న‌టీ-న‌టులు:

ఈ సినిమాలో బ్రిటిష్ సీక్రెట్ సర్వీస్ ఏజెంట్ డెవిల్ అనే టైటిల్ రోల్ లో కళ్యాణ్ రామ్ అదరగొట్టాడు. ఎప్పుడూ సెటిల్డ్ గా నటించే ఆయన ఈ సినిమాలో యాక్షన్ సీక్వెన్స్ తో దుమ్ము రేపాడు. ఏజెంట్ పాత్రలో జీవించడాని చెప్పచ్చు. ఇక సంయుక్త మీనన్ కి మంచి రోల్ పడింది, అందంగా కనిపిస్తూనే నటన విషయంలోను ప్రతిభ కనబరిచింది. మాళవిక పాత్ర చిన్నదే అయినా ఉన్నంతలో అదరగొట్టింది. కాంగ్రెస్ నాయకురాలిగా శాంతియుతంగా బ్రిటిష్ వారిపై పోరాడే వ్యక్తి పాత్రలో మాళవిక నాయర్ నటన ఈ సినిమాకి ప్లేస్ అయిందనే చెప్పాలి. అజయ్, శ్రీకాంత్ అయ్యంగార్, సత్య, వశిష్ట సింహ, జబర్దస్త్ మహేష్, షఫీ వంటి వారు తమ తమ పాత్రల పరిధి మేరకు నటించారు.

డెవిల్ మూవీ రివ్యూ

సాంకేతిక వర్గం:

ఈ మూవీలో అందరికంటే ఎక్కువగా కష్టపడింది ఆర్ట్ టీం అనిపించింది. సినిమా చూస్తున్నంత సేపు ఆ రోజుల్లోకి తీసుకువెళ్ళారు. దర్శకుడు అభిషేక్ నామా సినిమా కోసం చాలానే కష్టపడ్డట్టు తెలుస్తుంది. స్క్రీన్ ప్లే విషయంలో మరికొన్ని జాగ్రత్తలు తీసుకొని ఉంటే బాగుండు అనిపించింది. ఇక ఇందులో పాటలు పర్వాలేదనిపించిన, బ్యాక్ గ్రౌండ్ స్కోర్ తో హర్ష వర్ధన్ దుమ్ములేపాడు. కాస్ట్యూమ్స్ విషయం లో కూడా చాలా జాగ్రత్తలు తీసుకున్నారు. కానీ కంప్యూటర్ గ్రాఫిక్స్ అంత మెప్పించేలా లేవు. మిగతా విషయాలలో నిర్మాణ విలువలు బాగున్నాయి.

డెవిల్ మూవీ రివ్యూ

ప్లస్ పాయింట్స్:

కళ్యాణ్ రామ్ నటన

నేపథ్య సంగీతం

సస్పెన్స్

మైనస్ పాయింట్స్:

గ్రాఫిక్స్

స్క్రిన్ ప్లే

పంచ్‌లైన్: ప్రేక్షకులను థ్రిల్ చేసే డెవిల్

3/5 - (1 vote)

ప్రభుత్వ పథకాలు, ప్రభుత్వ ఉద్యోగాలు, ప్రైవేట్ కంపెనీ ఉద్యోగాల గురించి రోజువారీ సమాచారాన్ని పొందడానికి మా వాట్సాప్ ఛానెల్‌లో మరియు టెలిగ్రామ్ ఛానెల్‌లో చేరండి

Telegram Channel Join Now
WhatsApp Channel Join Now

Related Job Posts

సలార్ మూవీ రివ్యూ

సలార్ మూవీ రివ్యూ– పార్ట్ -1 – సీజ్ ఫైర్

Leave a comment