ఇది మంచి ప్రభుత్వం ప్రోగ్రాం
Idi Manchi Prabhutvam Program in Andhra Pradesh
What is The Program
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కొత్త ప్రభుత్వం ఏర్పడి 100 రోజులు పూర్తి అయ్యాయి. ఈ వంద రోజుల్లో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పూర్తి చేసిన కొన్ని ముఖ్యమైన హామీలను ప్రజలలోకి తీసుకొని వెళ్లేందుకు గ్రామ వార్డు సచివాలయ స్థాయిలో నిర్వహించనున్న కార్యక్రమం పేరే ఇది మంచి ప్రభుత్వం
Schedule of Idi Manchi Prabhutvam Program సెప్టెంబర్ 20 నుండి 26 వరకు ఇది మంచి ప్రభుత్వం ప్రోగ్రాం ను నిర్వహించనుంది. గ్రామ వార్డు సచివాలయ సిబ్బంది ద్వారా ప్రజా ప్రతినిధుల సమక్షంలో ఈ ప్రోగ్రాం ప్రజల లోకి వెళ్తుంది.
Download Idi Manchi Prabhutvam Program – AP-Govt-100-days-flyer
Participants Of Idi Manchi Prabhutvam Program
రాష్ట్రంలో ఉన్న అందరూ ఎమ్మెల్యేలు ఈ ప్రోగ్రాంకు హాజరు అయ్యే విధముగా మరియు జిల్లా స్థాయి ప్రజా ప్రతినిధులు హాజరు అయ్యే విధముగా మండల / మునిసిపాలిటీ స్పెషల్ ఆఫీసర్లుగా జిల్లా కలెక్టర్లను ప్రభుత్వం నియమించింది . జిల్లా స్థాయిలో ముఖ్య ప్రణాళిక అధికారి వారు నోడల్ ఆఫీసర్గా ఈ కార్యక్రమానికి ఉంటారు. గ్రామ వార్డు సచివాలయ సిబ్బంది అందరూ కూడా ఈ ప్రోగ్రాం లో భాగం చేస్తూ వారి పర్యవేక్షణ నిమిత్తం మండల స్థాయిలో ఎంపీడీవో వారిని మునిసిపాలిటీ స్థాయిలో మున్సిపల్ కమిషనర్ వారిని నియమించడం జరిగినది.
Process Of Idi Manchi Prabhutvam Program
ఈ ప్రోగ్రాం లో ప్రతి ఇంటికి పంచుటకు గాను ప్రభుత్వం నుండి స్టిక్కర్లు మరియు పాంప్లెట్లు ప్రింటింగ్ చేసినవి జిల్లాల నుండి మండల అధికారుల ద్వారా సచివాలయాలకు అందించడం జరుగుతుంది. వాటిని మండల అధికారుల పర్యవేక్షణలో గ్రామ వార్డు సచివాలయ సిబ్బంది మరియు సంబంధిత ప్రజా ప్రతినిధుల ద్వారా ఇంటింటికి పంపిణీ చేయవలసి ఉంటుంది. రోజువారి రిపోర్టులను తయారుచేసుకొని సంబంధిత అధికారులు ఆదేశాల మేరకు వాటిని సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. ఇందుకుగాను సచివాలయ పరిధిలో ఉన్న ఇళ్లను సచివాలయ సిబ్బందితో అనుసంధానం ఇప్పటికే పూర్తి అయినది.
ప్రోగ్రాం జరుగు తేదీ సెప్టెంబర్ 20 నుండి సెప్టెంబర్ 26 మధ్య సంబంధిత ఎమ్మెల్యే వారు తప్పనిసరిగా ప్రతిరోజు కనీసం ఒక గ్రామ లేదా వార్డు సచివాలయాన్ని సందర్శించి వారి నియోజకవర్గ పరిధిలో అన్ని మండలాలను కవర్ చేసే విధంగా ఉంటుంది. అదే రోజున వారు సందర్శించే గ్రామములో గ్రామసభ లేదా వార్డు సభ ప్రజా వేదికను ఏర్పాటు చేసి ప్రభుత్వం సాధించిన విజయాలను మరియు నెరవేర్చిన హామీలకు తప్పనిసరిగా తెలియజేస్తూ ప్రజలలో భాగం అవ్వనున్నారు.
Idi Manchi Prabhutvam Program Data Updation Process
ఇంటింటికి విసిట్ కు వెళ్ళాక ఆ రోజు వచ్చిన ముఖ్య అతిధి / ప్రజా ప్రతినిదుల వివరాలు మరియు ఎన్ని ఇళ్లకు విసిట్ చేసారో ఆయా వివరాలను గ్రామా సచివాలయం లో పంచాయతి కార్యదర్శి లేదా పంచాయతీ సెక్రటరీ గ్రేడ్ 6 డిజిటల్ అసిస్టెంట్, వార్డు సచివాలయంలో అయితే వార్డు అడ్మిన్ సెక్రటరీ లేదా వార్డ్ ఎడ్యుకేషన్ అండ్ డేటా ప్రాసెస్లోసింగ్ సెక్రటరీ వారి AP Seva Portal లాగిన్ లో హోమ్ పేజీ లో ఆప్షన్ ఇవ్వటం జరిగింది . PS / WAS వారు వారి సచివాలయం కోడ్ తో ఉన్న లాగిన్ లో డేటా అప్డేట్ చేయాల్సి ఉంటుంది . ఎవరో ఒకరు అప్డేట్ చేస్తే సరిపోతుంది . సచివాలయం లో ఇద్దరు చేయాల్సిన పని ఉండదు .
Start –> AP Seva Portal Login –> Click On ఇది మంచి ప్రభుత్వం –> Enter Visit Date, Total HH Visited, Name Of Chief Guest, Designation Of Chief Guest –> Submit 99
Idi Manchi Prabhutvam Pamphlat Contains
ఇది మంచి ప్రభుత్వం ప్రోగ్రాం [ Idi Manchi Prabhutvam Program] లో ఇచ్చే పాంప్లెట్ లో ఉండే ముఖ్యమైన అంశాలు
అంశం 1 : నిరుద్యోగ యువతకు అండగా నిలబడుతూ మెగా డీఎస్సీ తో 16437 ఉపాధ్యాయ పోస్టుల భర్తీ చేపట్టటం
అంశం 2 : పెన్షన్లు ఒకేసారి 1000 రూపాయలు పెంచి 4000 ఇవ్వటం ఒకటైతే మొదటి నెల ఒక్కొక్కరికి ₹7,000 చొప్పున ఒకేరోజు 65 లక్షల 18 వేల మందికి అది కూడా ఇంటింటికి వెళ్లి 4408 కోట్ల రూపాయలు పంపిణీ చేయడం దేశంలోనే ఇది ఒక తిరుగులేని సంక్షేమ చరిత్ర
అంశం 3 : ప్రతినెల ఒకటో తారీకున ఉద్యోగుల జీతాలు ఇస్తున్నారు
అంశం 4 : 1674 కోట్ల దాన్యం కొనుగోలు బకాయిలు చెల్లించి అన్నదాతను ఆదుకున్నారు .
అంశం 5 : స్థానిక సంస్థలకు 1452 కోట్లు ఇచ్చి పంచాయతీలకు ప్రాణం పోశారు .
అంశం 6 : పేదల కోసం రాష్ట్రవ్యాప్తంగా కేవలం ఐదు రూపాయలతోనే ఆకలి తీర్చే 100 అన్న క్యాంటీన్లను పున ప్రారంభించడం.
అంశం 7 : ప్రజల కంటికి నిద్ర లేకుండా చేసిన ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ను రద్దుచేసి ప్రజల ఆస్తులను భద్రత కల్పించారు.
అంశం 8 : విజయవాడ నగరం వరదలతో విలవిలలాడుతున్నప్పుడు పది రోజులపాటు బస్సులో ఉండి నిద్రాహారాలు మాని ప్రజలను ఓ తండ్రిలా కాపాడుకున్నారు చంద్రబాబు గారు .
Notes On Idi Manchi Prabhutvam Program
1. ఇది మంచి ప్రభుత్వం ప్రోగ్రాంలో తప్పనిసరిగా రెండు విషయాలపై ప్రత్యేక శ్రద్ద వహించాలి మొదటిది గ్రామ వార్డు సచివాలయ సిబ్బంది ప్రజా ప్రతినిధులతో వారికి అనుసంధానం చేసిన క్లస్టర్ పరిధిలో ఇంటికి వెళ్లినప్పుడు స్టిక్కర్ అంటించి పాంప్లెట్లో ప్రభుత్వం 100 రోజుల్లో సాధించిన విజయాలను తెలియజేయాల్సి ఉంటుంది రెండవది గౌరవ ఎమ్మెల్యే గారు ఈ ప్రోగ్రాం సమయంలో కనీసం ఒక మండలానికి ఒక రోజుకి ఒక గ్రామాన్ని విజిట్ చేసి ప్రజావేదికను ఏర్పాటు చేసి ప్రభుత్వ విజయాలను చేయాల్సి ఉంటుంది.
2. ప్రతి ఇంటిని సచివాలయ సిబ్బందితో అనుసంధానంపూర్తి చేసి ఆ వివరాలను గ్రామ వార్డు సచివాలయ శాఖకు పంపించాల్సి ఉంటుంది.
3. సచివాలయ సిబ్బంది స్టిక్కర్ మరియు పాంప్లెట్ తో ఇంటింటికి వెళ్లి పాంప్లెట్ లో ఉన్న విషయాలను ఇంటింటికీ తెలియజేయాల్సి ఉంటుంది.
4. గౌరవ మినిస్టర్లు లేదా ఎమ్మెల్యేలు ప్రతిరోజు వారి నియోజకవర్గంలో ఉన్న ప్రతి మండలంలో గ్రామసభ లేదా ప్రజా వేదికను ఏర్పాటు చేసి చేయాల్సి ఉంటుంది షెడ్యూల్ ప్రాప్తికి సంబంధిత ప్రజాప్రతినిధులు సమాచారం అందించాల్సి ఉంటుంది.
5. సెప్టెంబర్ 20 ఉదయం 9 గంటలకు ప్రతి సచివాలయంలో సరిపడిన పాంప్లెట్ మరియు డోర్ స్టిక్కర్లు అందించడం జరుగుతుంది.. ఈ ప్రోగ్రాంను సచివాలయ స్థాయిలో పర్యవేక్షించడానికి స్పెషల్ ఆఫీసర్లను నియమించడం జరుగుతుంది.
Click Here to Know House Hold Count Per VSWS – Click Here
Idi Manchi Prabhutvam Program GO –ఇది మంచి ప్రభుత్వం
Tags :
1. ఇది మంచి ప్రభుత్వం కార్యక్రమం
2. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం
3. గ్రామ, వార్డు సచివాలయాలు
4. ప్రజా ప్రతినిధులు
5. ప్రభుత్వ విజయాలు
6. సంక్షేమ పథకాలు
7. పెన్షన్ పెంపు
8. ఉద్యోగ నియామకం
9. అన్న క్యాంటీన్లు
10. పంచాయతీ కార్యదర్శి
11. ఇంటింటి సందర్శన
12. వంద రోజుల విజయాలు
13. ప్రభుత్వ హామీలు
14. డీఎస్సీ నియామకాలు
15. ప్రజా వేదిక
2. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం
3. గ్రామ, వార్డు సచివాలయాలు
4. ప్రజా ప్రతినిధులు
5. ప్రభుత్వ విజయాలు
6. సంక్షేమ పథకాలు
7. పెన్షన్ పెంపు
8. ఉద్యోగ నియామకం
9. అన్న క్యాంటీన్లు
10. పంచాయతీ కార్యదర్శి
11. ఇంటింటి సందర్శన
12. వంద రోజుల విజయాలు
13. ప్రభుత్వ హామీలు
14. డీఎస్సీ నియామకాలు
15. ప్రజా వేదిక