Ap New Madhyam Policy 2024
ఆంధ్రప్రదేశ్‌లో కొత్త మద్యం పాలసీకి చంద్రబాబు నేతృత్వంలోని కేబినెట్ ఆమోదం తెలిపింది. దీనిని అక్టోబరు 1వ తేదీ నుంచి రాష్ట్రవ్యాప్తంగా అమలు చేయనున్నారు. ఈ కొత్త విధానం లో ఇప్పటివరకు అమల్లో ఉన్న అన్ని ప్రభుత్వ మద్యం దుకాణాలను ఎత్తివేసి ప్రైవేట్ రంగానికి అప్పగిస్తారు. ప్రస్తుతం బార్లు మాత్రమే ప్రైవేట్ ఆధ్వర్యంలో ఉన్నాయని, వాటి లైసెన్సులు నవంబరు-డిసెంబరు వరకు కొనసాగుతాయని తెలిపారు.
జగన్ ప్రభుత్వ హయాంలో ప్రతీ 50 వేల ఇళ్లకు ఒక బార్ ను కేటాయించారు. దీనివల్ల అక్రమ మద్యం అమ్మకాలు పెరిగాయని ప్రస్తుత కూటమి ప్రభుత్వం భావిస్తోంది. ఈ సమస్యను పరిష్కరించేందుకు కొత్త పాలసీ ప్రకారం 20-30 వేల ఇళ్లకు ఒక బార్ చొప్పున ఏర్పాటు చేయనున్నారు. అదే సమయంలో చీపు లిక్కర్‌ను పూర్తిగా తీసేయనున్నారు. మంచి బ్రాండ్లను తీసుకువస్తారు.
Trending Post
ఆధార్ కార్డుకు మొబైల్ నెంబర్ లింక్ స్టేటస్ తెలుసుకునే విధానము
కీలకమైన ధరల విషయంలో మార్పులు:
గత ప్రభుత్వం రూ.60 విలువ చేసే బ్రాండ్ మద్యాన్ని కూడా రూ.200పై చిలుకు చొప్పున విక్రయించింది. దీనివల్ల మద్యం తాగే వారు దూరంగా ఉండి మద్యపాన వినియోగం తగ్గుతుందని అంచనా వేసింది. కానీ, ఇది వికటించింది. మద్యం ధరలను తగ్గించాలని ఎప్పటి నుంచో డిమాండ్ ఉంది. ఎన్నికల సమయంలో చంద్రబాబు సైతం దీనికి ఆమోదం తెలుపుతూ.. తాము అధికారంలోకి వస్తే ఖచ్చితంగా ధరలు తగ్గిస్తామన్నారు. ఇప్పుడు అదే నిర్ణయం తీసుకున్నారు. గత చంద్రబాబుపాలనలో ఉన్న ధరలనే అందుబాటులోకి తీసుకురావాలనే నిర్ణయించారు. డిస్టిలరీలను ఒప్పించేందుకు కమిటీ వేయాలని నిర్ణయించారు.
పర్మిట్ రూమ్‌ల ఏర్పాటు:
పర్మిట్ రూమ్‌లను మళ్ళీ తీసుకురావాలని ప్రభుత్వం నిర్ణయించింది. గతంలో జగన్ ప్రభుత్వ హయాంలో పర్మిట్ రూమ్‌లను ఎత్తివేయడంతో ఎక్కడ పడితే అక్కడ మద్యం తాగడం, మహిళలను వేధింపులకు గురిచేయడం వంటి కేసులు వెలుగు చూశాయి. ఈ పరిణామాల నేపథ్యంలో ప్రస్తుత ప్రభుత్వం పర్మిట్ రూమ్‌లను పరిమితంగా అనుమతించాలని నిర్ణయించింది. గ్రామీణ ప్రాంతాల్లో కన్నా పట్టణాలు, నగరాల్లో పర్మిట్ రూమ్‌లకు అనుమతి ఉంటుంది. మద్యం కొనుగోలు చేసిన వ్యక్తి అక్కడే తాగేందుకు అనుమతి ఇవ్వనున్నారు. దీని ద్వారా అసాంఘిక నేరాలు తగ్గుముఖం పడతాయని ప్రభుత్వం భావిస్తోంది.
Ap New Madhyam Policy 2024
Ap New Madhyam Policy 2024
చీపు బ్రాండ్ల స్థానంలో ప్రీమియం బ్రాండ్లు:
గతంలో జగన్ హయాంలో ఉన్న బూమ్ బూమ్, ప్రెసిడెంట్, త్రీ కేపిటల్స్ వంటి చీపు బ్రాండ్లను పూర్తిగా తీసేయనున్నారు. వీటి స్థానంలో రాయల్ స్టాగ్ సహా ఇతర ప్రీమియం బ్రాండ్లకు బాటలు పరచనున్నారు. మద్యం వినియోగదారులకు మంచి మద్యం అందించడం ద్వారా ఆరోగ్య సమస్యలను తగ్గించవచ్చని ప్రభుత్వం భావిస్తోంది.
మద్యం విక్రయాల నియంత్రణ:
ఈ కొత్త విధానం అమలులోకి వచ్చిన తర్వాత మద్యం విక్రయాలను మరింత కట్టుదిట్టంగా నియంత్రించాలని నిర్ణయించారు. బార్లు మరియు మద్యం దుకాణాలను నియంత్రణలో ఉంచి, అక్కడ పనిచేసే సిబ్బందిని శిక్షణ ఇవ్వాలని ప్రభుత్వం భావిస్తోంది. ప్రజలు చీపు మద్యం వైపు ఆకర్షితులవకుండా, మంచి బ్రాండ్లను కొనుగోలు చేయడం ద్వారా ఆరోగ్య సమస్యలను తగ్గించవచ్చని ప్రభుత్వం విశ్వసిస్తోంది.
మొత్తం నూతన మద్యం పాలసీ:
ఈ కొత్త మద్యం విధానం అమలులోకి వచ్చిన తర్వాత రాష్ట్రంలో మద్యం వినియోగం మరింత నియంత్రణలోకి వస్తుందని, అసాంఘిక నేరాలు తగ్గుముఖం పడతాయని ప్రభుత్వం ఆశిస్తోంది. కొత్త విధానం రాష్ట్రవ్యాప్తంగా అక్టోబరు 1 నుంచి అమలులోకి వస్తుందని ప్రభుత్వం ప్రకటించింది.
Ap New Madhyam Policy 2024
ఆంధ్రప్రదేశ్ కేబినెట్ కీలక నిర్ణయాలు (07.08.2024) – Click Here
Leave a comment