Ap Minority Students receive DSC Money 6000
డీఎస్సీ విషయంలో ఏపీ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. అభ్యర్థులకు అదిరిపోయే శుభవార్త చెప్పింది.
Trending Post
ఆధార్ కార్డుకు మొబైల్ నెంబర్ లింక్ స్టేటస్ తెలుసుకునే విధానము
ఆంధ్రప్రదేశ్‌లో కొత్త ప్రభుత్వం ఏర్పడిన వెంటనే మెగా డీఎస్సీ నోటిఫికేషన్ జారీ చేసిన సంగతి తెలిసిందే. ఈ రిక్రూట్‌మెంట్‌తో రాష్ట్ర వ్యాప్తంగా 16,347 ఉపాధ్యాయ పోస్టులను భర్తీ చేయనున్నారు. తాజాగా డీఎస్సీ విషయంలో ఏపీ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది.
ఈ ఎగ్జామ్‌కు ప్రిపేర్ అవుతున్న పేద విద్యార్థులకు ఉచితంగా కోచింగ్ ఇవ్వాలని నిర్ణయించింది. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ఏపీ బీసీ స్టడీ సర్కిల్స్‌లో అభ్యర్థులకు ఫ్రీ కోచింగ్ ఇవ్వనున్నట్లు ఆంధ్రప్రదేశ్ స్టడీ సర్కిల్ డైరెక్టర్ కె. శ్రీదేవి తెలిపారు. అభ్యర్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆమె కోరారు.
ఉమ్మడి విశాఖ జిల్లా (ప్రస్తుత విశాఖపట్నం, అనకాపల్లి, అల్లూరి జిల్లాలు)కు చెందిన వెనుకబడిన తరగతులు (BC), షెడ్యూల్డ్ కులాలు (SC), షెడ్యూల్డ్ తెగలకు(ST) చెందిన అర్హులైన అభ్యర్థుల నుంచి AP BC స్టడీ సర్కిల్ డీఎస్సీ కోచింగ్ కోసం దరఖాస్తులను స్వీకరిస్తోంది. అర్హులైన అభ్యర్థులు జులై 8లోపు అప్లికేషన్స్ సమర్పించాలి. మొత్తంగా 200 మంది అభ్యర్థులకు రెండు నెలల పాటు ఉచిత కోచింగ్‌తో పాటు నెలకు రూ.3,000 స్టైఫండ్, రూ.1,000 విలువైన స్టడీ మెటీరియల్స్ ఇవ్వనున్నారు.
సబ్‌మిట్ చేయాల్సిన సర్టిఫికెట్స్ ;
అభ్యర్థులు తమ బయోడేటాతో పాటు పదో తరగతి మార్కు లిస్ట్, ఇంటర్, డిగ్రీ సర్టిఫికెట్స్, టీటీసీ మార్కు లిస్ట్, టెట్ క్వాలిఫికేషన్ సర్టిఫికేట్, క్యాస్ట్ సర్టిఫికేట్, ఇన్‌కమ్ సర్టిఫికేట్, ఆధార్ కార్డ్, బ్యాక్ పాస్‌బుక్ కాపీ, రెండు పాస్‌పోర్ట్ సైజ్ ఫొటోలను జులై 8లోపు బీసీ స్టడీ సర్కిల్, సెక్టార్-6, హెచ్ డీఎఫ్‌సీ బ్యాంక్ పైన, ఎంవీపీ కాలనీ, విశాఖపట్నం 530017 అనే అడ్రస్‌కు సమర్పించాలి. డీఎస్సీ కోచింగ్‌కు సంబంధించి మరిన్నీ వివరాలు తెలుసుకోవడానికి అభ్యర్థులు 9492569177 అనే ఫోన్ నంబర్‌కు కాల్ చేయవచ్చు.
ఖాళీల వివరాలు :
ఏపీ ప్రభుత్వం జారీ చేసిన మెగా డీఎస్సీ నోటిఫికేషన్ ద్వారా మొత్తంగా 16,347 పోస్టులు భర్తీ కానున్నాయి. అందులో ఎస్‌జీటీ 6,371, స్కూల్ అసిస్టెంట్స్ 7,725, టీజీటీ 1,781, పీజీటీ 286, పీఈటీ 132, ప్రిన్సిపల్స్ 52 పోస్టులున్నాయి. వీటితో పాటు రెసిడెన్షియల్, మోడల్ స్కూళ్లు, బీసీ, గిరిజన స్కూళ్లలో 2,281 ఖాళీలను భర్తీ చేయనున్నారు.
మెగా డీఎస్సీపై సమీక్ష :
విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్ మెగా డీఎస్సీపై ఇటీవల ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు. ఎలాంటి విమర్శలకు తావులేకుండా పూర్తి పారదర్శకంగా మెగా డీఎస్సీ నిర్వహించాలని అధికారులను ఆదేశించారు. టెట్, మెగా డీఎస్సీ మధ్య ఎక్కువ సమయం ఉండాలని అభ్యర్థులు కోరడంతో డీఎస్సీ ఎప్పుడు నిర్వహించాలనే దానిపై అభ్యర్థులు, యువజన సంఘాల అభిప్రాయం తీసుకోవాలని మంత్రి సూచించారు.
మెగా డీఎస్సీ సిలబస్‌పై సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారాన్ని మంత్రి నారా లోకేశ్ ఖండించారు. సిలబస్‌లో ఎలాంటి మార్పులు చేయలేదని స్పష్టం చేశారు. 2024 ఫిబ్రవరిలో ఏ సిలబస్‌తో టెట్ నిర్వహించారో అదే సిలబస్‌తో 2024 జులైలో టెట్ నిర్వహిస్తామని వెల్లడించారు.
Ap DSC Notification 2024 – Click Here
Tags : Ap Minority Students receive DSC Money 6000, Ap Minority Students receive DSC Money 6000, Ap Minority Students receive DSC Money 6000, Ap Minority Students receive DSC Money 6000, ap dsc 6000 training money, ap dsc free coaching, ap government free training dsc ,
Leave a comment