UIIC Apprentice Jobs 2025: డిగ్రీతో కేంద్ర ప్రభుత్వ ఉద్యోగం అప్రెంటిస్ ఉద్యోగాలు ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో అవకాశాలు
UIIC Apprentice Jobs 2025: ఉద్యోగాన్ని ఎదురు చూస్తున్న డిగ్రీ అభ్యర్థులకి గుడ్ న్యూస్. యునైటెడ్ ఇండియా ఇన్సూరెన్స్ కంపెనీ లిమిటెడ్ (UIIC) Apprentice పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. మొత్తం 145 పోస్టులు ఖాళీగా ఉండగా, అర్హులైన అభ్యర్థులు ఏప్రిల్ 28, 2025 లోపు ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేయాలి.
📌 UIIC Apprentice Jobs 2025 పోస్టుల వివరాలు:
- పోస్టు పేరు: అప్రెంటీస్ (Apprentice)
- పోస్టుల సంఖ్య: 145
- ప్రాంతాల వారీగా ఖాళీలు ఉండగా, ఆంధ్రప్రదేశ్ & తెలంగాణ రాష్ట్రాల్లో కూడా అవకాశాలు ఉన్నాయి.
- వేతనం (స్టయిపెండ్): నెలకు ₹9,000/-
- ట్రైనింగ్ వ్యవధి: 1 సంవత్సరం
✅ అర్హతలు:
- అభ్యర్థులు ఏదైనా బ్యాచిలర్ డిగ్రీ ఉత్తీర్ణులై ఉండాలి.
- డిగ్రీను 2021, 2022, 2023 లేదా 2024 సంవత్సరాల్లో పూర్తి చేసి ఉండాలి.
- వయోపరిమితి: కనిష్టం 21 సంవత్సరాలు, గరిష్ఠంగా 28 సంవత్సరాలు. వయో సడలింపులు ప్రభుత్వ నిబంధనల ప్రకారం వర్తిస్తాయి.
📋 ఎంపిక విధానం:
- అభ్యర్థుల డిగ్రీ మార్కుల ఆధారంగా షార్ట్‌లిస్టింగ్
- డాక్యుమెంట్ వెరిఫికేషన్
- అప్రెంటిస్ షిప్ ప్రారంభం
ఈ ప్రక్రియ పూర్తయిన తర్వాత అభ్యర్థులు యునైటెడ్ ఇండియా ఇన్సూరెన్స్ కంపెనీలో ట్రైనింగ్ పొందే అవకాశం ఉంటుంది.
Trending Post
ఆధార్ కార్డుకు మొబైల్ నెంబర్ లింక్ స్టేటస్ తెలుసుకునే విధానము
🖊️ దరఖాస్తు విధానం:
- అభ్యర్థులు ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేయాలి.
- అప్లికేషన్ ఫారం జాగ్రత్తగా నింపి, అవసరమైన డాక్యుమెంట్స్ అటాచ్ చేసి సబ్మిట్ చేయాలి.
- చివరి తేదీ: 28-04-2025
Notification – Click Here
Apply – Click Here
|
Tags
UIIC Apprentice Recruitment 2025, UIIC Jobs 2025, Apprentice Jobs in Telugu, Insurance Apprentice Notification, Degree Jobs 2025