సలార్ మూవీ రివ్యూ– పార్ట్ -1 – సీజ్ ఫైర్
Pakka Telugu Rating : 4.1/5
Cast : ప్రభాస్, పృథ్విరాజ్ సుకుమారన్, జగపతి బాబు, శృతి హాసన్, ఈశ్వరీ రావు, బాబీ సింహా, టినూ ఆనంద్, శ్రియారెడ్డి
Director : ప్రశాంత్ నీల్
Music Director : రవి బాసృర్
సలార్ మూవీ రివ్యూ :
రెబల్ స్టార్ ప్రభాస్ బహుబలి సిరీస్ లతో పాన్ ఇండియా స్టార్ గా ఎదిగాడు. మరోవైపు కేజీఎఫ్ సిరీస్ లతో దర్శకుడు ప్రశాంత్ నీల్ ఇండియా మొత్తాన్ని తన వైపు తిప్పుకున్నాడు. వీరిద్దరి కాంబినేషన్ లో వస్తున్నమూవీ సలార్ కావడంతో ప్రేక్షకుల్లో భారీ అంచానలు నెలకొన్నాయి. టీజర్, ట్రైలర్ ఆ అంచనాలను మరింత పెంచగా… ఈ మూవీ డిసెంబర్ 22 న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. హోంబాలే ఫిలింస్ పతాకంపై విజయ్ కిరంగదూర్ ఈ చిత్రాన్ని నిర్మించారు. గత కొంత కాలంగా సరైన హిట్స్ లేని ప్రభాస్ కు మరి ఈ సలార్ హిట్ ను అందించిందా? అసలు ఈ సినిమా ఎలా ఉందో ఇప్పుడు చూద్దాం!
Trending Post
ఆధార్ కార్డుకు మొబైల్ నెంబర్ లింక్ స్టేటస్ తెలుసుకునే విధానము
సలార్ మూవీ రివ్యూ :
కథ:
అమెరికా నుంచి వచ్చిన ఆద్య(శృతి హసన్) ను ఎయిర్ పోర్టులో దిగగానే కొందరు రౌడీలు కిడ్నాప్ చేయడానికి ప్రయత్నిస్తారు. అయితే ఆద్య ఇండియా వెళ్లిన విషయం తెలుసుకున్న ఆమె తండ్రి అక్కడికి వెళితే ప్రమాదమని ఇప్పుడు తన కూతురిని ఒకే ఒక్కడు కాపాడాగలడని ఆ పని దేవరథ (ప్రభాస్) కి అప్పగిస్తాడు. రౌడీల నుంచి కాపాడి ఆద్యను తన ఇంటికి తీసుకెళ్తాడు. దేవరథ తల్లి (ఈశ్వరీ రావు) ఆ ఊర్లో స్కూల్ లో టీచర్ గా పనిచేస్తుంటుంది. పిల్లలే కాదు తల్లిదండ్రులు కూడా దేవ తల్లికి బయపడుతుంటారు. ఈ నేపథ్యంలోనే ఆద్యను ఇంగ్లీష్ టీచర్ గా దేవ తల్లికి పరిచయం చేస్తారు. దేవ ఏ గొడవలకు వెళ్లకుండా అతని తల్లి కంట్రోల్ చేస్తుంది. మరోవైపు ఆద్య గురించి గ్యాంగ్ లు గ్యాంగ్ లు వెతుకుతుంటాయి. ఎట్టకేలకు ఆద్యను కనిపెట్టిన గ్యాంగ్ ఖాన్సర్ అనే పట్టణానికి ముద్ర వేసి తీసుకెళ్తుండగా దేవ ఆమెను కాపాడాతాడు. అసలు ఖాన్సర్ కు దేవ కు సంబంధం ఏంటి? ఎందుకు ఆద్య ను కిడ్నాప్ చేయాలనుకున్నారు? ప్రతిసారి దేవ తల్లి దేవను ఎందుకు కంట్రోల్ చేస్తుంది? ఖాన్సర్ లో ఉండే వరద రాజమన్నార్(పృథ్విరాజ్ సుకుమారన్) దేవకు ఏం సంబంధం? ఖాన్సర్ పట్టణానికి నాయకుడిగా కర్త రాజమన్నార్ (జగపతి బాబు) పాత్ర ఏంటి? వీటి గురించి తెలుసుకోవాలంటే సినిమా చూడాల్సిందే!
సలార్ మూవీ రివ్యూ :
కథనం-విశ్లేషణ:
కేజీఎఫ్ సిరీస్ లతో ప్రశాంత్ తన ప్రభావాన్ని ఇండియా మొత్తం చూపించాడు. ఇందులో కూడా ప్రభాస్ అభిమానులు అతని నుంచి ఏం ఆశిస్తారో అవి పుష్కలంగా ఉన్నాయి. పస్టాఫ్ హీరోయిన్ అమెరికా నుంచి దిగడం ఆమెను కాపాడం పైనే కథ సాగుతుంది. మరోవైపు ఏ గొడవలకు వెళ్లకుండా హీరో తల్లి అతన్ని కంట్రోల్ చేస్తుంటుంది. హీరో సౌమ్యుడిగా, అసలు గొడవలంటేనే తెలియని వాటిగా కనిపిస్తాడు. తల్లి గా నటించిన ఈశ్వరీ రావు నటనే పస్టాఫ్ లో హైలెట్ అనిపిస్తుంది. హీరోను కూడా ఎలివేషన్ చేసే సందర్బలు చాలానే ఉన్నాయి. కేజీఎఫ్ తో తన పై పెరిగిన అంచనాలను ఏమాత్రం తగ్గకుండా ప్రశాంత్ నీల్ ఎఫెక్ట్ పెట్టాడు. కథ విషయానికి వస్తే కేజీఎఫ్ సినిమా లో కథ, బలమైన ఎమోషన్స్ రాసుకోవడంలో సక్సెస్ అయిన ప్రశాంత్ సలార్ విషయానికి వచ్చే సరికి కొంచెం తడబడ్డాడు. హీరోయిన్ ను తీసుకెళ్లెటప్పుడు ఫైట్ చేసి ఆమెను కాపాడటంతో ఫస్టాఫ్ అయిపోతుంది. అప్పటి వరకు అసలు కథ నార్మల్ గానే సాగుతుంది.
సెకండాఫ్ లోనే అసలు కథ మొత్తన్ని చెప్పే ప్రయత్నం చేశాడు దర్శకుడు. కేజీఎఫ్ లో బంగారం గురించి కుట్రలు, కుతాంత్రాలు జరిగితే సలార్ లో ఖాన్సర్ అనే కల్పిత పట్టణాన్ని సృష్టించి కుర్చీ గురించి కొట్లాట పెట్టాడు ప్రశాంత్ నీల్. ఖాన్సర్ కుర్చీ కోసం కుటుంబంలోని కొందరు కొట్టుకోవడం దానిలోనే ఒకరిని మించి మరోకరు ఎత్తులు వేయడం చూపించాడు. అయితే దేవ, వరద రాజమన్నార్ మధ్యలో వంచే సీన్స్ ఎమోషన్స్ ను పండిస్తాయని అందరు భావించిన అలా జరగలేదు. ఈ విషయంలో ప్రశాంత్ సఫలం కాలేదు. కాటమ్మ తల్లి కి బలి ఇచ్చే ఫైట్ సీన్ లో మాత్రం ప్రభాస్ హీరోయిజం వేరే లెవల్ లో ఉందనే చెప్పాలి. ఈ సీన్ కి థియేటర్లు దద్దరిల్లిపోతాయి. ఈ చిత్రంలో ప్రేక్షకులు సెకండాఫ్ లో కొంత గందరగోళానికి గురయ్యే అవకాశం ఉంది.
సలార్ మూవీ రివ్యూ :
నటీ-నటులు:
ప్రభాస్ కు ఇది ఓ మంచి సినిమాగా నిలుస్తుంది అనడంలో సందేహం లేదు. మాస్ పాత్రలో మరోసారి రెచ్చిపోయాడు ప్రభాస్. ఫైట్ సీన్స్ లో మాత్రం థియేటర్ లో విజుల్స్ మామూలుగా లేవు. ఈ సినిమాలో దేవరథ పాత్ర ను మాత్రమే చూపెట్టిన ప్రశాంత్ సినిమా చివరలో సలార్ ని పరిచయం చేశాడు. సెకండాఫ్ లో సలార్ కథ చెప్పే అవకాశం ఉంది. సలార్ విషయంలో ప్రశాంత్ తన వందశాతం ఎఫెక్ట్ పెట్టిన సెంటిమెంట్ ని పండించడంలో విఫలమయ్యడానే చెప్పాలి. శృతి హసన్ పస్టాఫ్ మొత్తం ఉన్న ఆమె ప్రభావం ఏ మాత్రం ఉండదు. నటనకు ఆస్కారం లభించే సీన్స్ ఇందులో లేదు. హీరో తల్లిగా చేసిన ఈశ్వర్ రావు తన యాక్టింగ్ పస్టాఫ్ లో హైలెట్ గా నిలుస్తుంది. ఆమె కళ్ళల్లో ఓ ఎమోషన్ చూస్తాం. పృథ్విరాజ్ సుకుమారన్ తన పాత్రలో ఒదిగిపోయాడు. జగపతిబాబు పాత్ర కొంచెం సేపే ఉన్న ఆకట్టుకున్నాడు. మిగిలిన వారు వారి వారి పాత్ర మేరకు నటించారు.
సలార్ మూవీ రివ్యూ :
సాంకేతిక వర్గం:
సాంకేతికంగా సినిమా ఉన్నతంగా ఉంది. ఖాన్సార్ ప్రపంచాన్ని ఆవిష్కరించిన తీరు ఆకట్టుకుంటుంది. రవి బస్రూర్ సంగీతం, భువన్ గౌడ కెమెరా పనితనం చిత్రానికి ప్రధానబలం. ఇందులో ఉన్న పాటలు ఇప్పటికే ప్రేక్షకులను ఆకట్టుకుకోగా… థియేటర్లలో ఆ ఫీల్ ని కలిగిస్తాయి. ఖాన్సర్ పట్టణాన్ని సృష్టించి తీరు బాగుంది. ప్రశాంత్ నీల్ ఫస్ట్ పార్ట్ పర్వాలేదనిపించిన మరి సెకండ్ పార్ట్ ఎలా తీస్తాడో చూడాలి. నిర్మాతలు ఈ సినిమాను ఎక్కడ రాజీ పడకుండా నిర్మించినట్లు తెలుస్తుంది. ప్రభాస్ లోని మరో కోణం ఈ సలార్.
సలార్ మూవీ రివ్యూ :
ప్లస్ పాయింట్స్:
ఖాన్సర్ పట్టణం
ప్రభాస్ నటన
క్లైమాక్స్
యాక్షన్ సీన్స్
మైనస్ పాయింట్స్:
కథలో కొంత గందరగోళం
ఎమోషన్స్ కి కనెక్ట్ కాలేరు
పంచ్‌లైన్: ప్రభాస్ యాక్షన్… ఫ్యాన్స్ కు పండగే
Leave a comment